హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఆటోమేటిక్ వేరియంట్లు
న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ గ్రాండ్ ఐ10 మోడల్‌లో రెండు ఆటోమేటిక్ వేరియంట్లను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ రెండు వేరియంట్లను-గ్రాండ్ స్పోర్ట్‌జ్ ఏటీ(ధర రూ.5.64 లక్షలు), గ్రాండ్ ఆస్టా ఏటీ(ధర రూ.5.92 లక్షలు-ఈ రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అందిస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ చెప్పారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రాండ్ ఐ10ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా 20 వేల బుకింగ్స్ వచ్చాయని వివరించారు. గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ ఏటీలో ఇంటిగ్రేటెడ్ 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, పవర్ విండోస్, ఎలక్ట్రిక్ అవుటర్ రియర్ వ్యూ మిర్రర్స్, పవర్ స్టీరింగ్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, పుష్-స్టార్ట్ బటన్, టిల్ట్ స్టీరింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. గ్రాండ్ ఐ10 ఆస్టా ఏటీలో వీటితో పాటు అదనంగా రియర్ డిఫాగర్, బ్లూటూత్ వంటి ప్రత్యేకతలున్నాయి. హ్యుందాయ్ కంపెనీ త్వరలోనే గ్రాండ్ ఐ10 డీజిల్ మోడల్‌లో కూడా ఆటోమాటిక్ వేరియంట్‌లను తెస్తుందని సమాచారం.