Hyundai Grand
-
కొత్త కారు కొనే వారికి బంపర్ ఆఫర్.. భారీగా తగ్గింపు!
మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ ఎంపిక చేసిన మోడల్స్ మీద భారీగా డిస్కౌంట్ అందిస్తుంది. ఇయర్ ఎండ్ సేల్ పేరుతో కార్ల మీద డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెలలో కారు కొనుగోలు చేసే వారికి ₹50,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమేనని గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ నెల చివరి వరకే ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ క్రింద పేర్కొన్న కార్ల మీద రూ.50 వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. హ్యుందాయ్ శాంట్రో (పెట్రోల్): ₹40,000 వరకు హ్యుందాయ్ ఐ20 (పెట్రోల్/డీజిల్): ₹40,000 వరకు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఎన్ఐఓఎస్ (పెట్రోల్/డీజిల్): ₹50,000 వరకు హ్యుందాయ్ ఆరా(పెట్రోల్/డీజిల్): ₹50,000 వరకు కార్లపై తగ్గింపు ఆఫర్లు అనేవి ప్రాంతం, డీలర్షిప్, కారు మోడల్, వేరియంట్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల మీరు కారు కొనుగోలు చేయడానికి ముందుగానే ఆఫర్ వివరాలు పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. అలాగే, వచ్చే నెల నుంచి కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. మీరు కొత్త కారు కొనుగోలు చేయలని చూస్తుంటే? ఇది ఉత్తమ సమయం. -
3 నెలల్లో 30 వేల హ్యుందాయ్ గ్రాండ్ విక్రయాలు
న్యూఢిల్లీ: హ్యుందాయ్ గ్రాండ్ కార్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయని కంపెనీ గురువారం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ కారును మార్కెట్లోకి తెచ్చామని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. విడుదల చేసిన మూడు నెలల్లోనే 33 వేల కార్లను విక్రయించామని తెలిపారు. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా మెట్రో, టైర్ టూ నగరాల్లో యువ కొనుగోలుదారుల నుంచి అధిక ఎంక్వైరీలు వచ్చాయని వివరించారు. అధికంగా విక్రయమైన 5 కార్ బ్రాండ్లలో ఇదొకటిగా నిలిచిందని పేర్కొన్నారు. యూ2 సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్తో లభిస్తున్న గ్రాండ్ కారు 24 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. -
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఆటోమేటిక్ వేరియంట్లు
న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ గ్రాండ్ ఐ10 మోడల్లో రెండు ఆటోమేటిక్ వేరియంట్లను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారుల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ రెండు వేరియంట్లను-గ్రాండ్ స్పోర్ట్జ్ ఏటీ(ధర రూ.5.64 లక్షలు), గ్రాండ్ ఆస్టా ఏటీ(ధర రూ.5.92 లక్షలు-ఈ రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అందిస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్లో గ్రాండ్ ఐ10ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా 20 వేల బుకింగ్స్ వచ్చాయని వివరించారు. గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ ఏటీలో ఇంటిగ్రేటెడ్ 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, పవర్ విండోస్, ఎలక్ట్రిక్ అవుటర్ రియర్ వ్యూ మిర్రర్స్, పవర్ స్టీరింగ్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, పుష్-స్టార్ట్ బటన్, టిల్ట్ స్టీరింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. గ్రాండ్ ఐ10 ఆస్టా ఏటీలో వీటితో పాటు అదనంగా రియర్ డిఫాగర్, బ్లూటూత్ వంటి ప్రత్యేకతలున్నాయి. హ్యుందాయ్ కంపెనీ త్వరలోనే గ్రాండ్ ఐ10 డీజిల్ మోడల్లో కూడా ఆటోమాటిక్ వేరియంట్లను తెస్తుందని సమాచారం.