న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ తాజాగా తన పాపులర్ ఎస్‌యూవీ ‘క్రెటా’లో కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.9.43 లక్షలు– రూ.15.03 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. కొత్త అప్‌డేటెడ్ క్రెటాలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 6–వే పవర్ డ్రైవర్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్ వంటి పలు అదనపు ఫీచర్లను పొందుపరిచామని కంపెనీ తెలిపింది.
‘2015లో తొలిసారి క్రెటాను మార్కెట్‌లోకి తీసుకువచ్చాం. ఎస్‌యూవీ విభాగంలో పేరొందిన బ్రాండ్‌గా అవతరించాం. తాజా 2018 క్రెటాతో ఎస్‌యూవీ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తాం’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో వై.కె.కో తెలిపారు. క్రెటా పెట్రోల్ వేరియంట్ ధర రూ.9.43 లక్షలు– రూ.13.59 లక్షలు శ్రేణిలో, డీజిల్ వేరియంట్ ధర రూ.9.99 లక్షలు రూ.15.03 లక్షల శ్రేణిలో ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment