కార్ ఆఫ్ ద ఇయర్‌గా హ్యుందాయ్ ఎలీట్ ఐ20 | Hyundai Elite i20 is the Indian Car of the Year 2015 | Sakshi
Sakshi News home page

కార్ ఆఫ్ ద ఇయర్‌గా హ్యుందాయ్ ఎలీట్ ఐ20

Published Fri, Dec 19 2014 1:13 AM | Last Updated on Tue, Aug 14 2018 3:26 PM

కార్ ఆఫ్ ద ఇయర్‌గా హ్యుందాయ్ ఎలీట్ ఐ20 - Sakshi

కార్ ఆఫ్ ద ఇయర్‌గా హ్యుందాయ్ ఎలీట్ ఐ20

హైదరాబాద్: ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్(ఐకోటి) 2015 అవార్డు హ్యుందాయ్ ఎలీట్ ఐ20కు లభించింది. మార్కెట్లోకి తెచ్చిన రెండో నెలలోనే అధికంగా అమ్ముడవుతున్న అగ్రశ్రేణి పది కార్లలో ఒకటిగా ఎలీట్ ఐ20 నిలిచిందని హ్యుందాయ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆటోమొబైల్ మ్యాగజైన్లు-టాప్‌గేర్, మోటరింగ్ వరల్డ్, కార్ ఇండియా, ఓవర్‌డ్రైవ్, ఆటో బిల్డ్, ఆటో ఎక్స్,  హిందూ బిజినెస్ లైన్, ఈవీఓల సీనియర్ ఎడిటర్లతో కూడిన జ్యూరీ ఈ అవార్డుకు ఎలీట్ ఐ20ని ఎంపిక చేసిందని వివరించింది.

గత ఏడాది కూడా హ్యుందాయ్ గ్రాండ్ కారుకు ఈ అవార్డును గెల్చుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ బిఎస్ సియో పేర్కొన్నారు. వరుసగా రెండు ఐకోటి అవార్డులు గెల్చుకున్న ఏకైక కంపెనీ తమదేనని వివరించారు. పదేళ్లలో మూడు ఐకోటీ అవార్డులను సాధించామని తెలిపారు. తమకు భారత్ కీలకమైన మార్కెట్ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement