భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లపై భారీ ప్రణాళికలను రచిస్తోంది. వచ్చే ఆరేళ్లలో సుమారు ఆరుకు పైగా ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనుంది. 2022లో హ్యుందాయ్ మోటార్స్ ‘కొనా’ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. దీంతో పాటుగా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ కార్లలో Ioniq 5 కారును కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 23 ఎలక్ట్రిక్ కార్లను, ఒక మిలియన్ ఈవీలను విక్రయించాలని హ్యుందాయ్ ప్రణాళికలు రచిస్తోంది.
చదవండి: అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతీ సుజుకీ బాలెనో కారు!
హ్యుందాయ్ Ioniq 5 రేంజ్ ఎంతంటే..!
హ్యుందాయ్ Ioniq 5 SUV ఫ్లాగ్‌షిప్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 480 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. Ioniq 5 కారు కియాలోని EV6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది.
హ్యుందాయ్ Ioniq 5 ఫీచర్స్..!
హ్యుందాయ్ Ioniq 5 కారు 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. సింగిల్-మోటార్ లేదా డ్యూయల్-మోటార్ సెటప్‌తో అందుబాటులో ఉంది. టాప్-ఆఫ్-ది-లైన్ డ్యూయల్ మోటార్ సెటప్, ఆల్-వీల్ డ్రైవ్ ఎంపికతో రానుంది. ఈ కారు 320 హార్స్‌పవర్ సామర్థ్యంతో, 604 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇది సుమారు 0 నుండి 100 kmph వేగాన్ని కేవలం ఐదు సెకండ్లలో అందుకోనుంది. ఈ కారు గరిష్ట వేగం 185 kmph. 350 kW ఛార్జర్ సహాయంతో కేవలం 18 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయగలదు.
చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు హ్యుందాయ్ మోటార్ తీపికబురు..!
Comments
Please login to add a commentAdd a comment