న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ తాజాగా తన ప్రీమియం ఎస్‌యూవీ ‘టక్సన్’లో 4–వీల్‌డ్రైవ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.25.19 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). టక్సన్ టాప్–ఎండ్ డీజిల్ వేరియంట్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
కస్టమర్లకు అందుబాటు ధరల్లో ప్రొడక్టులను అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో వై.కె.కో పేర్కొన్నారు. తాజా కొత్త వేరియంట్ బుకింగ్స్‌ను ప్రారంభించామని తెలిపారు.
ఇక టక్సన్ ఏజీ జీఎల్ వేరియంట్స్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (వీఎస్‌ఎం), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్‌ఏసీ), డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్ (డీబీసీ), బ్రేక్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లను పొందుపరిచామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment