హ్యుందాయ్ నుంచి ఆటోమేటిక్ ‘ఎలైట్ ఐ20’
ధర రూ.9.01 లక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20లో ఆటోమేటిక్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధరను రూ.9.01 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త వేరియంట్‌లో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హైట్ అడ్జెస్టబుల్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్, తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.