Hyundai Offers September 2021: Hyundai Rolls Out Discounts Of Up To RS 150000 On Select Cars - Sakshi
Sakshi News home page

కొత్త కారు కొనేవారికి హ్యుందాయ్ అదిరిపోయే ఆఫర్‌!

Published Mon, Sep 13 2021 6:13 PM | Last Updated on Tue, Sep 14 2021 9:09 AM

Hyundai Rolls Out Discounts Of Up To RS 150000 On Select Cars - Sakshi

మీరు గనుక కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. హ్యుందాయ్ మోటార్ ఇండియా సెప్టెంబర్ 2021లో ఎంపిక చేసిన మోడల్స్ పై రూ.50,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. హ్యుందాయ్ శాంట్రో, గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ ఐ20 కార్లపై ఈ నెలలో భారీ ఆఫర్లను ప్రకటించింది. దీనికి సంబంధించి వివరాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే ఉంటుంది. (చదవండి: మహారాష్ట్రలో భారీగా తగ్గనున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర!)

హ్యుందాయ్ సాంట్రో
మారుతి సుజుకి వ్యాగన్ఆర్, టాటా టియాగో ప్రత్యర్థి అయిన హ్యుందాయ్ సాంట్రో కారు అసలు ధర రూ.4,76,690 నుంచి రూ.6,44,690(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. అయితే, మీరు ఎంచుకున్న వేరియంట్ కార్లపై రూ.40,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది.

  • డిస్కౌంట్ - రూ.25,000 వరకు
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000
  • మొత్తం - రూ.40,000 వరకు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
మారుతి సుజుకి స్విఫ్ట్ కు ప్రధాన ప్రత్యర్ధి హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు అసలు ధర రూ.5,28,590 నుంచి రూ.8,50,050 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా నియోస్ కార్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది.

  • డిస్కౌంట్ - రూ.35,000 వరకు
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000
  • మొత్తం - రూ.50,000 వరకు

హ్యుందాయ్ ఆరా
మారుతి సుజుకి డిజిర్, హోండా అమేజ్ ప్రత్యర్థి అయిన హ్యుందాయ్ ఆరా కారు అసలు ధర రూ.5,99,900 నుంచి రూ.9,36,300(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా కాంపాక్ట్ సెడాన్ కార్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది.

  • డిస్కౌంట్ - రూ.35,000 వరకు
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000
  • మొత్తం - రూ.50,000 వరకు

హ్యుందాయ్ ఐ20
మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి వాటి ప్రధాన ప్రత్యర్ధి హ్యుందాయ్ ఐ20 కారు అసలు ధర రూ.6,91,200 వద్ద ప్రారంభమై రూ.11,40,200 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ బట్టి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారుపై రూ.40,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది.

  • డిస్కౌంట్ - రూ.25,000 వరకు
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000
  • మొత్తం - రూ.40,000 వరకు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement