Hyundai i20 Active crossover
-
కొత్త కారు కొనేవారికి హ్యుందాయ్ అదిరిపోయే ఆఫర్!
మీరు గనుక కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. హ్యుందాయ్ మోటార్ ఇండియా సెప్టెంబర్ 2021లో ఎంపిక చేసిన మోడల్స్ పై రూ.50,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. హ్యుందాయ్ శాంట్రో, గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ ఐ20 కార్లపై ఈ నెలలో భారీ ఆఫర్లను ప్రకటించింది. దీనికి సంబంధించి వివరాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే ఉంటుంది. (చదవండి: మహారాష్ట్రలో భారీగా తగ్గనున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర!) హ్యుందాయ్ సాంట్రో మారుతి సుజుకి వ్యాగన్ఆర్, టాటా టియాగో ప్రత్యర్థి అయిన హ్యుందాయ్ సాంట్రో కారు అసలు ధర రూ.4,76,690 నుంచి రూ.6,44,690(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. అయితే, మీరు ఎంచుకున్న వేరియంట్ కార్లపై రూ.40,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది. డిస్కౌంట్ - రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000 మొత్తం - రూ.40,000 వరకు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మారుతి సుజుకి స్విఫ్ట్ కు ప్రధాన ప్రత్యర్ధి హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు అసలు ధర రూ.5,28,590 నుంచి రూ.8,50,050 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా నియోస్ కార్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది. డిస్కౌంట్ - రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000 మొత్తం - రూ.50,000 వరకు హ్యుందాయ్ ఆరా మారుతి సుజుకి డిజిర్, హోండా అమేజ్ ప్రత్యర్థి అయిన హ్యుందాయ్ ఆరా కారు అసలు ధర రూ.5,99,900 నుంచి రూ.9,36,300(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా కాంపాక్ట్ సెడాన్ కార్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది. డిస్కౌంట్ - రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000 మొత్తం - రూ.50,000 వరకు హ్యుందాయ్ ఐ20 మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి వాటి ప్రధాన ప్రత్యర్ధి హ్యుందాయ్ ఐ20 కారు అసలు ధర రూ.6,91,200 వద్ద ప్రారంభమై రూ.11,40,200 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ బట్టి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారుపై రూ.40,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది. డిస్కౌంట్ - రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000 మొత్తం - రూ.40,000 వరకు -
ఈ కంపెనీ కార్లపై రూ.1.5 లక్షల వరకు ధర తగ్గింపు!
హ్యుందాయ్ ఇండియా కొన్ని ప్రత్యేక మోడళ్లపై ఈ నెలలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద కారు మోడల్, వేరియంట్లను బట్టి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు లాభం పొందవచ్చు. సాంట్రో, ఆరా, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, కోనా ఎలక్ట్రిక్ వెహికల్ కు సంబందించిన మోడళ్లపై డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో డిస్కౌంట్ తో పాటు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉంటాయి. మే 1 నుండి మే 31 మధ్య కొన్న కార్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు ఈ ఆఫర్‌ను ఆన్లైన్లో లేదా దగ్గరలో ఉన్న షో రూమ్ లో ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో తెలుసుకోవచ్చు. హ్యుందాయ్ సాంట్రో: హ్యుందాయ్ సాంట్రోపై వినియోగదారులు రూ.35,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పెట్రోల్ మోడల్ కార్లపై మాత్రమే వర్తిస్తుంది. సాన్ట్రోకు గరిష్టంగా రూ .20,000 నగదు తగ్గింపు, రూ.10,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ .5 వేలకు మంచి కార్పొరేట్ డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: నియోస్ హ్యాచ్‌బ్యాక్‌పై గరిష్టంగా 50 వేలు ఆదా చేయవచ్చు. ఈ కారుపై రూ.35,000నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5 వేలు వరకు లభిస్తుంది. హ్యుందాయ్ ఆరా: హ్యుందాయ్ ప్రస్తుతం ఆరాపై రూ.45,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.30,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. హ్యుందాయ్ ఐ20: భారత మార్కెట్లో హ్యుందాయ్ ఐ20ను 2020 ఏడాది చివరలో విడుదల చేశారు. మొదటిసారిగా దీనిపై డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో రూ.15 వేల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .5 వేల కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. హ్యుందాయ్ కోనా ఈవీ: హ్యుందాయ్ రూ.1.5 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్న కారు హ్యుందాయ్ కోనా ఈవీ. హ్యుందాయ్ నుంచి భారత మార్కెట్లో వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే. ఈ క్రాస్ఓవర్ ఈవీకి రూ .1.5 లక్షల నగదు తగ్గింపు లభిస్తుంది. ఈ కారును హ్యుందాయ్ దేశంలో లభించే మొత్తం వాహన శ్రేణిలో 60 శాతానికి పైగా ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. సంస్థ ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాన్ని కూడా అందిస్తోంది. చదవండి: డీమార్ట్ లాభాలు ఎంత పెరిగాయో తెలుసా? -
హ్యాచ్‌బ్యాక్ మోడల్స్‌లో టాప్-3 కార్లు
ముంబై, సాక్షి: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతీ సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్‌కు చెందిన కార్లు టాప్-3 జాబితాలో చేరాయి. గత నెలలో అమ్మకాల రీత్యా మారుతీ తయారీ బాలెనో అగ్రస్థానంలో నిలవగా.. హ్యుండాయ్ ఐ 20 రెండో ర్యాంకును పొందింది. ఇక ఇటీవలే మార్కెట్లో విడుదలైన టాటా మోటార్స్ ప్రీమియం కారు ఆల్ట్రోజ్ మూడో ర్యాంకును దక్కించుకుంది. కాగా.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో టయోటా గ్లాంజా, హోండా తయారీ జాజ్, ఫోక్స్‌వేగన్ పోలో సైతం వినియోగదారులను ఆకట్టుకుంటున్నట్లు ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇతర వివరాలు ఇలా.. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) బాలెనో భళా నవంబర్‌లో మారుతీ తయారీ బాలెనో 17,872 యూనిట్లు విక్రయమయ్యాయి. బాలెనో కారు రూ. 5.64 లక్షలు- 8.96 లక్షల (ఎక్స్‌షోరూమ్- ఢిల్లీ) ధరల్లో లభిస్తోంది. రెండు రకాల ఇంజిన్లతో రూపొందుతోంది. 5 స్పీడ్ ఎంటీ, సీవీటీతో కూడిన 1.2 లీటర్ వీవీటి పెట్రోల్ వెర్షన్ ఒక మోడల్కాగా.. 1.2 లీటర్ డ్యూయల్ వీవీటీ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ వెర్షన్ సైతం అందుబాటులో ఉంది. (మళ్లీ పసిడి, వెండి.. మెరుపులు) హ్యుండాయ్ ఐ20 గత నెలలో హ్యుండాయ్ తయారీ ఐ20 మోడల్ 9,096 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఐ20 మోడల్ కారు రూ. 6.8 లక్షలు- 11.33 లక్షల (ఎక్స్‌షోరూమ్- ఢిల్లీ) ధరల్లో లభిస్తోంది. మూడు రకాల ఇంజిన్లతో వెలువడుతోంది. 5 స్పీడ్ ఎంటీ, ఐవీటీ ఆటోమ్యాటిక్తో కూడిన 1.2 లీటర్ కప్పా పెట్రోల్ వెర్షన్ ఒక మోడల్కాగా.. 6 స్పీడ్ ఐఎంటీ, 7 స్పీడ్ డీసీటీ ఆటోమ్యాటిక్ ఆప్సన్స్‌తో కూడిన 1 లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ వెర్షన్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. ఇదే విధంగా 6 స్పీడ్ ఎంటీతో 1.5 లీటర్ యూ2 సీఆర్డీఐ డీజిల్ మోడల్ సైతం లభిస్తోంది. టాటా ఆల్ట్రోజ్ టాటా మోటార్స్ తయారీ ఆల్ట్రోజ్ కార్లు నవంబర్ నెలలో 6,260 యూనిట్లు విక్రమయ్యాయి. ఆల్ట్రోజ్ మోడల్ కార్లు రూ. 5.44 లక్షలు- 9.09 లక్షల (ఎక్స్‌షోరూమ్- ఢిల్లీ) ధరల్లో లభిస్తున్నాయి. రెండు రకాల ఇంజిన్లతో రూపొందుతోంది. 5 స్పీడ్ ఎంటీ 1.2 లీటర్ రెవట్రాన్ పెట్రోల్ వెర్షన్ ఒక మోడల్కాగా.. 5 స్పీడ్ ఎంటీతో కూడిన 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ రెవోటార్క్ డీజిల్ వెర్షన్ సైతం అందుబాటులో ఉంది. -
హ్యుందాయ్ ఐ20.. స్పోర్ట్స్ స్టైల్ వేరియంట్
న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బాక్ ఐ20లో స్పోర్ట్స్-స్టైల్ వేరియంట్, ఐ20 యాక్టివ్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఈ మోడల్లో పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.38-7.09 లక్షలు, డీజిల్ వేరియంట్ ధర రూ.7.63-8.89 లక్షల రేంజ్లో ఉన్నాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. తమ కారు స్పోర్టీగా, స్టైల్‌గా ఉండాలనుకునే వినియోగదారుల కోసం ఈ ఐ20 ఆక్టివ్‌ను అందిస్తున్నామని వివరించారు. పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఐఎక్స్25 ఎస్‌యూవీని మార్కెట్లోకి తెస్తామని శ్రీవాత్సవ వివరించారు. భారత్‌లో ఈ ఏడాది 60 లక్షల వాహన ఉత్పత్తి మైలురాయిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ధర రూ.6.38-8.89 లక్షల రేంజ్లో