హ్యుందాయ్ ఐ20.. స్పోర్ట్స్ స్టైల్ వేరియంట్ | Hyundai i20 Active crossover launched in India at Rs 6.38 lakh onwards | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్ ఐ20.. స్పోర్ట్స్ స్టైల్ వేరియంట్

Published Wed, Mar 18 2015 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

హ్యుందాయ్ ఐ20.. స్పోర్ట్స్ స్టైల్ వేరియంట్

హ్యుందాయ్ ఐ20.. స్పోర్ట్స్ స్టైల్ వేరియంట్

 న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బాక్ ఐ20లో స్పోర్ట్స్-స్టైల్ వేరియంట్, ఐ20 యాక్టివ్‌ను మంగళవారం ఆవిష్కరించింది.  ఈ మోడల్‌లో పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.38-7.09 లక్షలు, డీజిల్ వేరియంట్ ధర రూ.7.63-8.89 లక్షల రేంజ్‌లో ఉన్నాయని  హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. తమ కారు స్పోర్టీగా, స్టైల్‌గా ఉండాలనుకునే వినియోగదారుల కోసం ఈ ఐ20 ఆక్టివ్‌ను అందిస్తున్నామని వివరించారు. పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఐఎక్స్25 ఎస్‌యూవీని మార్కెట్లోకి తెస్తామని శ్రీవాత్సవ వివరించారు. భారత్‌లో ఈ ఏడాది  60 లక్షల వాహన ఉత్పత్తి మైలురాయిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
 ధర రూ.6.38-8.89 లక్షల రేంజ్‌లో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement