ముంబై, సాక్షి: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతీ సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్‌కు చెందిన కార్లు టాప్-3 జాబితాలో చేరాయి. గత నెలలో అమ్మకాల రీత్యా మారుతీ తయారీ బాలెనో అగ్రస్థానంలో నిలవగా.. హ్యుండాయ్ ఐ 20 రెండో ర్యాంకును పొందింది. ఇక ఇటీవలే మార్కెట్లో విడుదలైన టాటా మోటార్స్ ప్రీమియం కారు ఆల్ట్రోజ్ మూడో ర్యాంకును దక్కించుకుంది. కాగా.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో టయోటా గ్లాంజా, హోండా తయారీ జాజ్, ఫోక్స్‌వేగన్ పోలో సైతం వినియోగదారులను ఆకట్టుకుంటున్నట్లు ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇతర వివరాలు ఇలా.. (30 రోజుల్లో 100 శాతం లాభాలు)
బాలెనో భళా
నవంబర్‌లో మారుతీ తయారీ బాలెనో 17,872 యూనిట్లు విక్రయమయ్యాయి. బాలెనో కారు రూ. 5.64 లక్షలు- 8.96 లక్షల (ఎక్స్‌షోరూమ్- ఢిల్లీ) ధరల్లో లభిస్తోంది. రెండు రకాల ఇంజిన్లతో రూపొందుతోంది. 5 స్పీడ్ ఎంటీ, సీవీటీతో కూడిన 1.2 లీటర్ వీవీటి పెట్రోల్ వెర్షన్ ఒక మోడల్‌కాగా.. 1.2 లీటర్ డ్యూయల్ వీవీటీ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ వెర్షన్ సైతం అందుబాటులో ఉంది. (మళ్లీ పసిడి, వెండి.. మెరుపులు)
హ్యుండాయ్ ఐ20
గత నెలలో హ్యుండాయ్ తయారీ ఐ20 మోడల్ 9,096 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఐ20 మోడల్ కారు రూ. 6.8 లక్షలు- 11.33 లక్షల (ఎక్స్‌షోరూమ్- ఢిల్లీ) ధరల్లో లభిస్తోంది. మూడు రకాల ఇంజిన్లతో వెలువడుతోంది. 5 స్పీడ్ ఎంటీ, ఐవీటీ ఆటోమ‍్యాటిక్‌తో కూడిన 1.2 లీటర్ కప్పా పెట్రోల్ వెర్షన్ ఒక మోడల్‌కాగా.. 6 స్పీడ్ ఐఎంటీ, 7 స్పీడ్ డీసీటీ ఆటోమ్యాటిక్ ఆప్సన్స్‌తో కూడిన 1 లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ వెర్షన్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. ఇదే విధంగా 6 స్పీడ్ ఎంటీతో 1.5 లీటర్ యూ2 సీఆర్‌డీఐ డీజిల్ మోడల్ సైతం లభిస్తోంది.
టాటా ఆల్ట్రోజ్
టాటా మోటార్స్ తయారీ ఆల్ట్రోజ్ కార్లు నవంబర్ నెలలో 6,260 యూనిట్లు విక్రమయ్యాయి. ఆల్ట్రోజ్ మోడల్ కార్లు రూ. 5.44 లక్షలు- 9.09 లక్షల (ఎక్స్‌షోరూమ్- ఢిల్లీ) ధరల్లో లభిస్తున్నాయి. రెండు రకాల ఇంజిన్లతో రూపొందుతోంది. 5 స్పీడ్ ఎంటీ 1.2 లీటర్ రెవట్రాన్ పెట్రోల్ వెర్షన్ ఒక మోడల్‌కాగా.. 5 స్పీడ్ ఎంటీతో కూడిన 1.5 లీటర్ టర్బోచార్జ్‌డ్ రెవోటార్క్ డీజిల్ వెర్షన్ సైతం అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment