Maruti Suzuki Baleno RS
-
బాలెనో ధరల పెంపు
పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య మారుతీ సుజుకి(Maruti Suzuki) తన కార్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ పాపులర్ మోడల్ అయిన బాలెనో(Baleno) ధరను పెంచుతున్నట్లు మారుతీ సుజుకి నిర్ణయం తీసుకుంది. వేరియంట్‌ను అనుసరించి రూ.9,000 ధరలో పెరుగుదల ఉంటుందని స్పష్టం చేసింది. సవరించిన ధరలతో బాలెనో రూ.6.70 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.92 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం ధర త్వరలో ‘లకారం’! తులం ఎంతంటే..బాలెనో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో పెట్రోల్, సీఎన్జీ మోడళ్లు కూడా ఉన్నాయి. ఈ కారు 88 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది. 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ) లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ)తో వస్తుంది. ఎంటీ కలిగిన పెట్రోల్ వేరియంట్లు లీటరుకు 22.35 కిలోమీటర్లు, ఏఎంటీతో ఉన్న కార్లు 22.94 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయని కంపెనీ పేర్కొంది. సీఎన్జీ ఆధారిత వర్షన్ కిలోకు 30.61 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని చెప్పింది. ధరల పెరుగుదల డెల్టా ఏజీస్, జీటా ఏజీఎస్, ఆల్ఫా ఏజీఎస్ వేరియంట్లపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని మోటార్ నిపుణులు అంటున్నారు. -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతీ సుజుకీ బాలెనో కారు!
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీకి చెందిన బాలెనో కారు అమ్మకాల్లో దూసుకెళ్తుంది. మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో ఈ ఏడాది 10లక్షల మైలు రాయిని దాటినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ కారు మార్కెట్ వాటాలో 25 శాతం వాటాను కలిగి ఉంది. నెక్సా కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బాలెనో 248 నగరాల్లోని 399 అవుట్ లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. మారుతి సుజుకి బాలెనోను 2015 అక్టోబర్ నెలలో లాంచ్ చేశారు. ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే 1 లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ మోడల్ 2018 నాటికి ఈ కారు విక్రయాలు 5 లక్షలు దాటేశాయి. ఆ తర్వాత ఐదులక్షల విక్రయాలను మూడేళ్లలోనే పూర్తి చేసుకోవడం విశేషం. "లాంఛ్ చేసినప్పటి నుంచి బాలెనో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కార్లలో తన సత్తా చాటుతుంది. ఇది డిజైన్, భద్రత, ఆవిష్కరణలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. 25 శాతానికి పైగా మార్కెట్ వాటాతో "బాలెనో" ప్రీమియం హ్యాచ్ బ్యాక్ విభాగంలో నాయకత్వం వహిస్తున్నట్లు" అని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. (చదవండి: 2021లో వచ్చిన బెస్ట్ సూపర్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!) బాలెనో 1.2 లీటర్ డ్యూయల్ జెట్, సెగ్మెంట్-ఫస్ట్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేసే డ్యూయల్ వీవీటి ఇంజిన్ కలిగి ఉంది. ఇది, ఐడిల్ స్టార్ట్-స్టాప్, సివిటి ట్రాన్స్ మిషన్ కలిగి ఉంది. పెట్రోల్ యూనిట్ 1.2-లీటర్ ఇంజిన్ రూపంలో 82 బిహెచ్పి, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండవ పెట్రోల్ ఇంజన్ కొత్త 1.2-లీటర్ డ్యూయల్ జెట్ స్మార్ట్ హైబ్రిడ్ యూనిట్ రూపంలో ఉంది. ఇది 89 బిహెచ్పి & 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. (చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త రూల్స్ పాటించాల్సిందే!) -
హ్యాచ్‌బ్యాక్ మోడల్స్‌లో టాప్-3 కార్లు
ముంబై, సాక్షి: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతీ సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్‌కు చెందిన కార్లు టాప్-3 జాబితాలో చేరాయి. గత నెలలో అమ్మకాల రీత్యా మారుతీ తయారీ బాలెనో అగ్రస్థానంలో నిలవగా.. హ్యుండాయ్ ఐ 20 రెండో ర్యాంకును పొందింది. ఇక ఇటీవలే మార్కెట్లో విడుదలైన టాటా మోటార్స్ ప్రీమియం కారు ఆల్ట్రోజ్ మూడో ర్యాంకును దక్కించుకుంది. కాగా.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో టయోటా గ్లాంజా, హోండా తయారీ జాజ్, ఫోక్స్‌వేగన్ పోలో సైతం వినియోగదారులను ఆకట్టుకుంటున్నట్లు ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇతర వివరాలు ఇలా.. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) బాలెనో భళా నవంబర్‌లో మారుతీ తయారీ బాలెనో 17,872 యూనిట్లు విక్రయమయ్యాయి. బాలెనో కారు రూ. 5.64 లక్షలు- 8.96 లక్షల (ఎక్స్‌షోరూమ్- ఢిల్లీ) ధరల్లో లభిస్తోంది. రెండు రకాల ఇంజిన్లతో రూపొందుతోంది. 5 స్పీడ్ ఎంటీ, సీవీటీతో కూడిన 1.2 లీటర్ వీవీటి పెట్రోల్ వెర్షన్ ఒక మోడల్కాగా.. 1.2 లీటర్ డ్యూయల్ వీవీటీ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ వెర్షన్ సైతం అందుబాటులో ఉంది. (మళ్లీ పసిడి, వెండి.. మెరుపులు) హ్యుండాయ్ ఐ20 గత నెలలో హ్యుండాయ్ తయారీ ఐ20 మోడల్ 9,096 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఐ20 మోడల్ కారు రూ. 6.8 లక్షలు- 11.33 లక్షల (ఎక్స్‌షోరూమ్- ఢిల్లీ) ధరల్లో లభిస్తోంది. మూడు రకాల ఇంజిన్లతో వెలువడుతోంది. 5 స్పీడ్ ఎంటీ, ఐవీటీ ఆటోమ్యాటిక్తో కూడిన 1.2 లీటర్ కప్పా పెట్రోల్ వెర్షన్ ఒక మోడల్కాగా.. 6 స్పీడ్ ఐఎంటీ, 7 స్పీడ్ డీసీటీ ఆటోమ్యాటిక్ ఆప్సన్స్‌తో కూడిన 1 లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ వెర్షన్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. ఇదే విధంగా 6 స్పీడ్ ఎంటీతో 1.5 లీటర్ యూ2 సీఆర్డీఐ డీజిల్ మోడల్ సైతం లభిస్తోంది. టాటా ఆల్ట్రోజ్ టాటా మోటార్స్ తయారీ ఆల్ట్రోజ్ కార్లు నవంబర్ నెలలో 6,260 యూనిట్లు విక్రమయ్యాయి. ఆల్ట్రోజ్ మోడల్ కార్లు రూ. 5.44 లక్షలు- 9.09 లక్షల (ఎక్స్‌షోరూమ్- ఢిల్లీ) ధరల్లో లభిస్తున్నాయి. రెండు రకాల ఇంజిన్లతో రూపొందుతోంది. 5 స్పీడ్ ఎంటీ 1.2 లీటర్ రెవట్రాన్ పెట్రోల్ వెర్షన్ ఒక మోడల్కాగా.. 5 స్పీడ్ ఎంటీతో కూడిన 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ రెవోటార్క్ డీజిల్ వెర్షన్ సైతం అందుబాటులో ఉంది. -
పండుగ సీజన్‌కు మార్కెట్లో కొత్త కార్లు!
పండుగల శోభ అంటే కేవలం స్వీట్లు, చాక్లెట్లు, కుటుంబసభ్యుల హడావుడి మాత్రమే కాదు. కొత్త కారు ఇంటికి తీసుకొచ్చి షికారుకు వెళ్లడం కూడా ప్రత్యేకతే. పండుగల సీజన్లో కొత్త కార్ల కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ ఆసక్తినే అనువుగా తీసుకుని పండుగల సీజన్లో ఊరించే ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చేందుకు కారు తయారీదారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే జోరుమీదున్న వాహన పరిశ్రమ, భారీ డిస్కౌంట్ ఆఫర్లతో వచ్చే ఐదు నెలల్లో కొత్త కొత్త కార్లను ఆవిష్కరించనున్నాయట.. అయితే ఈ పండుగ సీజన్లో వినియోగదారుల ముందుకు వచ్చి చక్కర్లు కొట్టనున్న టాప్-5 కార్లు ఏమిటో ఓ సారి చూద్దామా.. రెనాల్ట్ క్విడ్ ఏఎంటీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిన్న కారును అత్యంత శక్తిమంతమైన 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ సామర్థ్యంతో ఈ పండుగ సీజన్లోనే రెనాల్ట్ లాంచ్ చేయనుందట. కేవలం మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ మాత్రమే కాక, ఈజీ-ఆర్ ఏఎంటీ (ఆటోమేటడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) కూడా క్విడ్ కొత్త మోడల్ ప్రత్యేకత. ఈ ఆవిష్కరణతో దేశీయ మార్కెట్లో ఇప్పటికే క్విడ్ మోడల్కున్న పాపులారిటీని మరింత విస్తరించాలని రెనాల్ట్ ఆశిస్తోంది. 1.0 లీటర్ ఇంజన్ సామర్థ్యమున్న ఈ కారు 67 పీఎస్ పీక్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుందని రెనాల్ట్ చెబుతోంది. మెకానికల్ మార్పులు మినహాయిస్తే మిగతా ఫీచర్లన్నీ ఈ మోడల్లో క్విడ్‌కు సమానంగా ఉంటాయట. భద్రతాపరమైన విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్న రెనాల్ట్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రెండు ఎయిర్‌బ్యాగ్స్‌ను ఈ కారులో పొందుపర్చిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ కారు ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తున్నారా..? ఈ దీపావళి కానుకగా రెనాల్ట్ దీన్ని ప్రవేశపెట్టనుంది. ఎక్స్ షోరూం ఢిల్లీలో దీన్ని ధర రూ.4 లక్షలుగా ఉంటున్నట్టు అంచనా. టాటా కైట్ 5 సెడాన్.. టియాగో మోడల్ విజయంతో ఊపుమీదున్న టాటా.. కైట్ 5 సెడాన్ కారును వినియోగదారుల ముందుకు తీసుకురావడానికి ఉవ్విళ్లూరుతోందట. టియాగో ఆధారంతో రూపొందించిన ఈ కైట్ 5 సెడాన్‌ను, అక్టోబర్‌లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ కారులో ప్రధానమైన ప్రత్యేకత అత్యధిక బూట్ స్పేస్. ఇతర ఉత్పత్తులతో పోలిస్తే ఈ కారు గరిష్టంగా 420 లీటర్ల వరకు బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. లాంగ్ డ్రైవ్, ఫ్యామిలీ అవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వినియోగదారులు ఎంచకునేలా పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్లు ఉన్నాయి. ఈ కారు ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో 4.5లక్షలుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హ్యుందాయ్ ఇయాన్ ఫేస్‌లిప్ట్... 2011 నుంచి ఇయాన్ ఎలాంటి మార్పులు లేకుండా భారత రోడ్లపై చక్కర్లు కొడుతోంది. దీంతో పాత చింతకాయ పచ్చడిలాగా ఈ మోడల్ వినియోగదారులకు బోరుకొట్టి, కొనుగోలు తగ్గించేశారట. ఈ ప్రభావం అమ్మకాలపై పడి, ఒక్కసారిగా క్షీణతను నమోదుచేశాయి. అమ్మకాల క్షీణతను సీరియస్‌గా తీసుకున్న హ్యుందాయ్, ఈ ఎంట్రీ లెవల్ మోడల్‌కు అప్గ్రేట్ చేసి ఫేస్‌లిప్ట్ పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కొత్త చిన్, రీవర్క్డ్ రియర్తో అప్డేటడ్ గ్రిల్‌ను ఫేస్లిప్ట్లో హ్యుందాయ్ పొందుపరిచింది. అడ్వాన్స్డ్ మల్టీమీడియా యూనిట్‌తో ఇది రాబోతుంది. ఇయాన్ కారు ఇప్పటికే 800సీసీ యూనిట్ ఆప్షన్‌తో 1.0 లీటర్ ఇంజన్ ఆప్షన్‌ను కలిగిఉంది. ప్రస్తుతం హ్యుందాయ్ ఆప్షనల్ ఆటోబాక్స్ను హ్యాచ్‌బ్యాక్‌లో పొందుపరుస్తోందట. అక్టోబర్‌లో వినియోగదారుల ముందుకు రాబోతున్న ఈ ఫేస్‌లిప్ట్, రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఉంటుందని అంచనా. మారుతీ సుజుకీ బాలెనో ఆర్ఎస్... భారత మార్కెట్లో బాలెనో హ్యాచ్‌బ్యాక్ మోడల్‌తో మెరుపులు మెరిపించిన మారుతీ మరో సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ఆసక్తి చూపుతోంది. బాలెనో ఆర్ఎస్ పేరుతో దీన్ని ప్రవేశపెట్టనుందట. ఫ్రంట్ లిప్ స్పాయిలర్, సైడ్ స్కర్ట్స్, నల్లని గ్రిల్, కొత్త అలాయ్స్, మరీ ముఖ్యంగా 1.0 లీటర్ టర్బో "బూస్టర్ జెట్" ఇంజన్ ల్లో కొన్ని మార్పులతో ఈ హ్యాచ్ బ్యాక్‌ను మారుతీ డిజైన్ చేసింది. ఆశ్చర్యమేమిటంటే.. దీపావళి వరకు ఈ కారును వినియోగదారులు ముంగిట్లోకి ప్రవేశపెట్టాలని మారుతీ ప్రిపేర్ అవుతోందట. దీని ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.9లక్షలుగా ఉంటుందని మార్కెట్ వర్గాల టాక్. ఫోక్స్‌వాగన్ అమియో డీజిల్... హోండా అమేజ్, టాటా జిస్ట్, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్, హ్యుందాయ్ అసెంట్లకు గట్టిపోటీగా వచ్చిన ఫోక్స్ వాగన్ అమియో పెట్రోల్ వెర్షన్‌కు.. తోబుట్టువుగా డీజిల్ వెర్షన్నూ తీసుకొచ్చేందుకు ఫోక్స్ వాగన్ అన్నీ సెట్ చేసుకుందట. చాలా ఉత్తమమైన లక్షణాలతో, హై క్వాలిటీ క్యాబిన్‌ను ఈ కారు కలిగి ఉంది. ఈ సెగ్మెంట్లో డీజిల్ ఇంజిన్ పరిపూర్ణమైన ఎంపికగా నిలుస్తుందని ఫోక్స్ వాగన్ చెబుతోంది. పోలో హ్యాచ్ బ్యాక్ మాదిరిగానే దీన్ని రూపొందించారు. ఇంజన్ కూడా ఒకే యూనిట్ చెందిదట. 230ఎన్ఎమ్ టార్క్ తో 90పీఎస్ పవర్‌ను 1.5 లీటర్ టీడీఐ ప్రొడ్యూస్ చేసేలా ఫోక్స్ వాగన్ ఈ కారును మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ కారును సెప్టెంబర్‌లో ఫోక్స్ వాగన్ లాంచ్ చేయనుంది. ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.6.3 లక్షల నుంచి రూ.8.3 లక్షల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది. ఎప్పటినుంచో ఈ కార్లు ఆవిష్కరణలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న కస్టమర్లను మురిపించేందుకు ఈ పండుగల సీజన్ వచ్చేస్తోందట. బ్రాండ్ న్యూ కార్లతో ఈ పండుగల సీజన్‌ను వినియోగదారులు ఎంజాయ్ చేసేలా ఆటోమేకర్స్ తెగ సన్నద్ధమవుతున్నాయి.