దక్షిణ కొరియన్ ఆటో మొబైల్ దిగ్గజం హ్యుందాయ్ భారత మార్కెట్లలోకి సరికొత్త క్రెటా నైట్(Knight Edition) ఎడిషన్ వేరియంట్న్ త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ కారుకు సంబంధిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్సైట్లో హ్యుందాయ్ పొందుపర్చింది. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్‌కు సంబంధించిన చిత్రాలు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి.
హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ పెట్రోల్, డిజీల్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ అధికారిక వెబ్సైట్ ప్రకారం...నైట్ ఎడిషన్ మోడల్ 1.5-లీటర్ MPI, 1.5-లీటర్ CRDi పవర్ట్రెయిన్లలో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ధరలు రూ. 13.35 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభంకానున్నాయి.
లుక్స్‌లో బ్లాక్ బీస్ట్..!
హ్యుందాయ్ నైట్ ఎడిషన్ కారు పూర్తిగా బ్లాక్ కలర్ బ్లాక్ బీస్ట్‌గా కన్పించనుంది. డార్క్ మెటల్ అల్లాయ్ వీల్స్, రెడ్ ఇన్సర్ట్లతో బ్లాక్ రేడియేటర్ గ్రిల్, బ్లాక్ కలర్ ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్లు, రూఫ్ రెయిల్లకు గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్, సైడ్-వ్యూ మిర్రర్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ , నైట్ ఎడిషన్ బ్యాడ్జ్‌తో వస్తుంది. నయా క్రెటా నైట్ మొత్తం-బ్లాక్ కలర్ ఇంటీరియర్ స్కీమ్‌ను పొందుతుంది.
ఇంజన్ విషయానికి వస్తే...!
హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ పెట్రోల్, డిజీల్ వేరియంట్లలో రానుంది. 1.5-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 113bhp శక్తిని, 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. మరో వేరియంట్ 1.5-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 113bhp శక్తిని 250Nm టార్క్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ కారు మూడు గేర్‌బాక్స్ ఎంపికల్లో రానుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్-కన్వర్టర్, ఐవీటీ IVT గేర్ బాక్స్‌తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.
చదవండి: తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్..రేంజ్లో కూడా అదుర్స్..! ధర ఎంతంటే...?
Comments
Please login to add a commentAdd a comment