
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) చవక ధరలో దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లతో ప్రైవేట్ టెల్కోలకు సవాలు విసురుతోంది. ప్రైవేట్ ఆపరేటర్లు ఇటీవల ధరలను పెంచిన తరువాత బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ప్లాన్లు దాని వినియోగదారుల సంఖ్య పెరగడానికి దారితీశాయి. గత కొన్ని నెలల్లో మిలియన్ల మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారారు.
బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 70 రోజులు, 90 రోజులు, 150 రోజులు, 160 రోజులు, 336 రోజులు, 365 రోజులు, 425 రోజుల ఎంపికలతో సహా కొన్ని సుదీర్ఘ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. ఇప్పుడు 180 రోజుల ప్లాన్ ప్రవేశపెట్టింది. తరచూ రీచార్జ్ చేసుకునే ఇబ్బందిని తొలగించే లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఈ కొత్త ఆరు నెలల ప్లాన్ అత్యంత అనువుగా ఉంటుంది.
రూ.897 రీఛార్జ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ కొత్త రూ .897 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్‌తో పూర్తి ఆరు నెలలు (180 రోజులు) వ్యాలిడిటీని అందిస్తుంది. వినియోగదారులు ఇకపై నెలవారీ రీఛార్జ్‌ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మార్కెట్లో అత్యంత చౌకైన ప్లాన్లలో ఒకటి. ఇక మిగతా ప్రయోజనాల విషయానికి వస్తే మొత్తంగా 90 జీబీ లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment