దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్‌కు భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గట్టి షాక్‌ను ఇచ్చింది. వాహనాల విక్రయాల్లో టాటా మోటార్స్ దుమ్మురేపింది.
రెండో స్థానం టాటా కైవసం..!
2021 డిసెంబర్ నెలలో వాహనాల విక్రయాల్లో హ్యుందాయ్ మోటార్స్‌ను వెనక్కి నెట్టి టాటామోటార్స్ రెండో సానంలో నిలిచింది. టాటా మోటార్స్ డిసెంబర్ 2021లో ఏడాది ప్రాతిపదికన భారత్‌లో అమ్మకాలు 24 శాతం పెరిగాయని నివేదించింది. డిసెంబర్ 2020లో విక్రయించబడిన 53,430 యూనిట్ల కంటే అధికంగా ఈ నెలలో సుమారు 66,307 యూనిట్లను విక్రయించినట్లు పేర్కొంది. గడిచిన డిసెంబర్ నెలలో వాణిజ్య వాహనాల అమ్మకాల్లో 31,008 యూనిట్లను సేల్ చేసినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. గత ఏడాది 2020 డిసెంబర్ నెలతో పోలిస్తే 2021 డిసెంబర్ నెలలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు గణనీయంగా 50 శాతం మేర పెరిగాయి. 2021 డిసెంబర్‌గాను 35,299 యూనిట్ల అమ్మకాలను టాటామోటార్స్ జరిపింది.
నెక్సాన్, టాటా పంచ్ అదుర్స్..!
గత ఏడాది అక్టోబర్ 21న ప్రారంభించిన టాటా పంచ్‌కు మార్కెట్‌లో విపరీతమైన స్పందన వచ్చింది. ఎస్‌యూవీల్లో టాటా పంచ్‌ను కొనేందుకు కొనుగోలుదారులు మొగ్గుచూపారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల్లో నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ గణనీయమైన డిమాండ్‌ను కల్గి ఉంది. దీంతో గత ఏడాది డిసెంబర్ నెలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు.
చదవండి: చైనా కంపెనీ కొంపముంచిన ట్రంప్ సంతకం..!
Comments
Please login to add a commentAdd a comment