
ముంబై: దేశంలోని రెండో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ తాజాగా యాభై లక్షవ కారును తయారు చేసింది. ఇది కొత్త జనరేషన్ వెర్నా కారు. దేశీ కార్ల విభాగంలో ఇది అత్యంత వేగవంతమైన వృద్ధి అని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వై.కె.కో తెలిపారు. ‘ఈ రోజు మేం సంతోషంగా ఉన్నాం. యాభై లక్షవ కారు కొత్త జనరేషన్ వెర్నాను తయారు చేశాం. పరిశ్రమలో ఇది అత్యంత వేగవంతమైన వృద్ధి. దీన్ని ఇలాగే కొనసాగిస్తాం’ అన్నారు.