అత్యంత ప్రభావిత బ్రాండ్ మారుతీ
న్యూఢిల్లీ : భారత్‌లో మారుతీ సుజుకీ అత్యంత ప్రభావిత బ్రాండ్ అని ప్రముఖ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జేడీ పవర్ తన నివేదికలో తెలిపింది. దీని తర్వాతి స్థానాల్లో హ్యుండయ్ మోటార్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ ఉన్నాయని పేర్కొంది. జేడీ పవర్ ఆసియా పసిఫిక్ 2015 ప్రభావిత బ్రాండ్ సర్వే ప్రకారం.. మారుతీ సుజుకీ 839 పాయింట్లతో (1,000 పాయింట్లకు గానూ) అత్యంత ప్రభావిత బ్రాండ్ విషయంలో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. హ్యుండయ్ 767 పాయింట్లతో రెండో స్థానంలో, టయోటా 744 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నాయి.