మిశ్రమంగా వాహన విక్రయాలు
• మారుతీ, టయోటా, రెనో అమ్మకాల్లో రెండంకెల వృద్ధి
• మహీంద్రా, ఫోర్డ్, హోండా విక్రయాల్లో క్షీణత
• రెండు రెట్లు పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశీ వాహన విక్రయాలు నవంబర్ నెలలో మిశ్రమంగా ఉన్నారుు. మారుతీ సుజుకీ, టయోటా, రెనో కంపెనీల వాహన అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదరుు్యంది. ఇక మహీంద్రా, ఫోర్డ్, హోండా కంపెనీల విక్రయాలు తగ్గారుు. వాహన విక్రయాల తగ్గుదలపై డీమానిటైజేషన్ ప్రభావం చూపింది. కాగా ఫోక్స్‌వ్యాగన్ వాహన అమ్మకాలు ఏకంగా రెండు రెట్లు పెరిగారుు.
⇔ మారుతీ సుజుకీ విక్రయాలు 14.2% వృద్ధితో 1,10,599 యూనిట్ల నుంచి 1,26,325 యూనిట్లకు పెరిగారుు.
⇔ టయోటా కిర్లోస్కర్ వాహన అమ్మకాల్లో 10.03% వృద్ధి నమోదయ్యింది. ఇవి 10,278 యూనిట్ల నుంచి 11,309 యూనిట్లకు ఎగశారుు.
హా టాటా మోటార్స్ దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాలు 22% వృద్ధితో 10,470 యూనిట్ల నుంచి 12,736 యూనిట్లకు పెరిగారుు.
⇔ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా వాహన అమ్మకాల్లో రెండు రెట్ల వృద్ధి నమోదరుు్యంది. ఇవి 1,942 యూనిట్ల నుంచి 4,014 యూనిట్లకు ఎగశారుు.
⇔ రెనో వాహన విక్రయాలు 23% వృద్ధితో 7,819 యూనిట్ల నుంచి 9,604 యూనిట్లకు చేరారుు.
⇔ మహీంద్రా వాహన విక్రయాలు 24% క్షీణించారుు. ఇవి 39,383 యూనిట్ల నుంచి 29,814 యూనిట్లకు పడ్డారుు.
⇔ ఫోర్డ్ ఇండియా వాహన అమ్మకాలు కూడా 22% క్షీణతతో 8,773 యూనిట్ల నుంచి 6,876 యూనిట్లకు తగ్గారుు.
⇔ హోండా కార్స్ ఇండియా విక్రయాలు 45% పడ్డారుు.