భారతదేశంలో వాహన వినియోగం పెరగటమే కాకుండా.. ఎగుమతులు కూడా పెరిగాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఎగుమతులు ఏకంగా 2,68,000 యూనిట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సమయంలోనే మారుతి సుజుకి దాదాపు 70 శాతం షిప్‌మెంట్‌లను కలిగి ఉంది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహనాల ఎగుమతులు 4,04,397 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సంఖ్య 2021-22 ఆర్థిక సంవత్సరంలో 577,875 యూనిట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 662,703 యూనిట్లగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో, ఎగుమతులు 672,105 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 2020-21 కంటే 2,67,708 యూనిట్లు ఎక్కువ. ఎగుమతుల్లో మారుతి సుజుకి రికార్డ్ క్రియేట్ చేసింది.
మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి మాట్లాడుతూ.. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల మీద పనిచేస్తుంది. అంతే కాకుండా టయోటాతో ఏర్పరచుకున్న భాగస్వామ్యం ప్రపంచ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించడంలో సహాయపడింది.
కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు తమ కార్లను ఎగుమతి చేస్తోందని.. ప్రస్తుతం కంపెనీకి దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, చిలీ, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలు ప్రధాన మార్కెట్. భారత్ నుంచి బాలెనొ, డిజైర్, ఎస్-ప్రెస్సో, గ్రాండ్ విటారా, జిమ్నీ, సెలెరియో, ఎర్టిగా వంటి కార్లను మారుతి సుజుకి ఎగుమతి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment