
ముంబై: ఆన్‌లైన్‌లో కేవైసీ (ఖాతాదారుల వివరాలు) వెరిఫికేషన్ పూర్తి చేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయొచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
కేవైసీ ధృవీకరణ లేదా అప్‌డేషన్ కోసం కస్టమర్లు కచ్చితంగా శాఖకు రావాలంటూ బ్యాంకులు డిమాండ్ చేయజాలవని, అలాంటి నిబంధనేదీ పెట్టలేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అలాగే సెంట్రల్–కేవైసీ (సీ–కేవైసీ) పోర్టల్‌లో తమ వివరాలను అప్‌లోడ్ చేసిన కస్టమర్లను కూడా బ్యాంకులు.. వెరిఫికేషన్ కోసం అడగనక్కర్లేదని తెలిపారు.
అలాంటి సందర్భాల్లో కస్టమర్లు తమ కేవైసీ వివరాలను సీ–కేవైసీ పోర్టల్ నుంచి యాక్సెస్ చేసుకోవాలంటూ అధికారిక ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబరు ద్వారా బ్యాంకుకు మెయిల్ లేదా మెసేజీ పంపించవచ్చని దాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment