Axis Bank Revises Interest Rate on FDs - Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..!

Published Mon, Mar 21 2022 5:21 PM | Last Updated on Mon, Mar 21 2022 5:59 PM

Axis Bank Revises Interest Rate on Fds - Sakshi

గత కొద్ది రోజుల క్రితం బ్యాంకింగ్‌ సంస్థలు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కాగా తాజాగా యాక్సిస్‌ బ్యాంకు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించాయి. ఈ వడ్డీరేట్ల పెంపు మార్చి 17, 2022 నుంచి అమలులోకి రానుంది.  7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ కాల వ్యవధిలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను యాక్సిస్‌ బ్యాంకు అందిస్తోంది. ఈ వడ్డీరేట్లు  2 కోట్లకు కంటే తక్కువ డిపాజిట్లపై వర్తించనుంది. ఇక 18 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధి గల టర్మ్‌ డిపాజిట్లకు యాక్సిస్‌ బ్యాంక్‌ 5.25 శాతం వడ్డీను అందిస్తోంది. 

యాక్సిస్‌ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు..!

7 రోజుల నుంచి 14 రోజుల వరకు:  సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.90 శాతం

15 రోజుల నుంచి 29 రోజుల వరకు:  సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.90 శాతం

 30 రోజుల నుంచి 45 రోజుల వరకు:  సాధారణ ప్రజలకు - 3 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

 46 రోజుల నుంచి 60 రోజుల వరకు:  సాధారణ ప్రజలకు - 3 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

 61 రోజుల నుంచి 90 రోజుల వరకు:  సాధారణ ప్రజలకు - 3 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

 91 రోజుల నుంచి 120 రోజుల వరకు:  సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం

 1 రోజుల నుంచి 9 నెలల వరకు(6 నెలలగాను ):  సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ(9 నెలల  గాను):  సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

 ఒక ఏడాది గాను:  సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం

 5 ఏళ్ల వరకు:  సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం

 5 ఏళ్ల  నుంచి 10 సంవత్సరాల వరకు:  సాధారణ ప్రజలకు - 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.25 శాతం

చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement