భారతదేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌లలో ఒకటైన 'భారతి ఎయిర్‌టెల్'.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కొన్ని మార్పులు చేసింది. ఇవి వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్‌ల కోసం ఉపయోగపడతాయి.
రూ.509 ప్లాన్
ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ. 509 ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. అపరిమిత వాయిస్ కాల్స్, 900 ఉచిత ఎస్ఎమ్ఎస్‌ల మాత్రమే ఈ రీఛార్జ్ ద్వారా పొందవచ్చు. అయితే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కి ఉచిత యాక్సెస్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, ఉచిత హలో ట్యూన్‌లు వంటి కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే డేటా లభించదు.
రూ.1999 ప్లాన్
ఎయిర్‌టెల్ తన రూ. 1,999 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా సవరించింది. గతంలో ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్‌లు, 3000 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు, 24GB మొబైల్ డేటా ఉండేవి. ఇప్పుడు మొబైల్ డేటా ప్రయోజనాలను ఎయిర్‌టెల్ పూర్తిగా తొలగించింది. కాగా ఇప్పుడు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, ఉచిత హలో ట్యూన్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
ఇదీ చదవండి: ట్రాయ్ కొత్త రూల్స్.. రూ.10తో రీఛార్జ్
గతంలో పైన పేర్కొన్న రెండు ప్లాన్‌లలో డేటా సదుపాయం కూడా లభించేది. ఇప్పుడు డేటాను పూర్తిగా తొలగించింది. అయితే ఈ రెండు ప్లాన్స్ స్పామ్ ఫైటింగ్ నెట్‌వర్క్ సొల్యూషన్‌తో వస్తాయి. డేటాను ఉపయోగించని కస్టమర్లకు వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ సర్వీసుల కోసం విడిగా ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిన తరువాత ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment