![Jio Revises Disney Hotstar Mobile Prepaid Plans - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/6/jio.jpg.webp?itok=huA7mO2K)
జియో యూజర్లకు మరో షాకింగ్ న్యూస్..! ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థలు ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా టారిఫ్ రేట్లను పెంచడంతో జియో కూడా తన యూజర్లకు షాకిస్తూ టారిఫ్ ప్లాన్లను ధరలను పెంచింది. ఈ పెరిగిన ప్లాన్స్ ధరలు డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. సాధారణ ప్లాన్ల ధరలతో పాటుగా ఓటీటీ సేవల ధరలను జియో పెంచింది.
డిస్నీ+హాట్‌స్టార్ ప్లాన్స్ ధరల పెంపు..!
ఓటీటీ ప్రేక్షకుల కోసం పలు టెలికాం సంస్థలు ఓటీటీ రీచార్జ్ ప్లాన్లను యూజర్లకు అందుబాటులో ఉంచాయి. ఈ ఏడాది ఆగస్టు చివరిలో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సేవల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను జియో తీసుకువచ్చింది. గతవారం సాధారణ టారిఫ్ ప్లాన్ల ధరలను 20 శాతం మేర జియో పెంచింది. దీంతో డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సేవల ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరల పెంపు అనివార్యమైంది.
చదవండి: జియో యూజర్లకు గుడ్‌న్యూస్..! 20 శాతం క్యాష్‌బ్యాక్..! ఎలా పొందాలంటే..!
పెరిగిన ప్లాన్ ధరలు ఇవే..!
రిలయన్స్ జియో ఐదు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లపై డిస్నీ+హాట్‌స్టార్ సేవలను అందిస్తోంది. వీటితో రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా, సాధారణ ప్లాన్స్ లాగే ఆన్‌లిమిటెడ్ డేటా, ఎస్‌ఎంఎస్‌లను యూజర్లు పొందుతారు. రూ. 499 ప్లాన్ ధరను రూ. 601గా, రూ. 666 ప్లాన్ ధరను రూ. 799గా, రూ.888 ప్లాన్ ధరను రూ. 1,066గా, రూ.2599 ప్లాన్ ధరను రూ. 3,119గా, రూ.549 ప్లాన్ ధరను రూ. 659 గా జియో సవరించింది.
చదవండి: ఐఫోన్ 12 ప్రో కొనుగోలుపై రూ. 25 వేల వరకు తగ్గింపు..!
Comments
Please login to add a commentAdd a comment