![HDFC Bank revises fixed deposit rates. Check latest FD rates here - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/31/hdfc.jpg.webp?itok=LWlZidG8)
సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను మరోసారి సవరించింది. అలాగే సీనియర్ సిటిజెన్ కేర్ ఎఫ్‌డి పథకం కింది సాధారణ ప్రజల కంటే 75 బీపీఎస్ పాయింట్ల అధిక వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లకు అందిస్తుంది. మే 21 నుంచి ఈ సవరించిన వడ్డీరేట్లు అమలు చేయనుంది. 7 నుండి 29 రోజుల కాల పరిమితి గల డిపాజిట్లపై 2.50 శాతం వడ్డీని, 30 నుండి 90 రోజుల డిపాజిట్లపై 3 శాతం వడ్డీని అందిస్తుంది.
ఇక 91 రోజుల నుండి 6 నెలల వరకు 3.5 శాతం, 6 నెలల 1 రోజు నుండి 4.4 శాతం, ఒక సంవత్సరం ఎఫ్‌డిలపై 4.9 శాతం వడ్డీని అందిస్తుంది. 2 నుండి 3 సంవత్సరాల ఎఫ్‌డిలపై వడ్డీ 5.15 శాతం, 3 నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై 5.30 శాతం, 5 -10 సంవత్సరాల డిపాజిట్లు 5.50 శాతం వడ్డీని వర్తింప జేస్తుంది. మరోవైపు సీనియర్ సిటిజన్స్ ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య ఉన్న డిపాజిట్లపై 75 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ లభిస్తుంది. ఇతర డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను సీనియర్ సిటిజనులకు ఆఫర్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment