స్మార్ట్ఫోన్ షాకింగ్ వీడియో... | YouTube Video Showing Samsung Galaxy Note 7 'Flamer' In Burger King Goes Viral | Sakshi
Sakshi News home page

స్మార్ట్ఫోన్ షాకింగ్ వీడియో...

Published Tue, Oct 11 2016 12:22 PM | Last Updated on Mon, Sep 4 2017 4:59 PM

స్మార్ట్ఫోన్ షాకింగ్ వీడియో...

స్మార్ట్ఫోన్ షాకింగ్ వీడియో...

గెలాక్సీ నోట్ 7 రూపంలో శాంసంగ్  ను వెన్నాడిన కష్టాలుఅన్నీ ఇన్నీ కావు.  ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ  శాంసంగ్ లిథియం-అయాన్ బ్యాటరీ పేలుడు  ఫిర్యాదులు చేయడంతో మొదలైన కష్టాలు  ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి.  తాజాగా  దక్షిణ కొరియా ఇంచియాన్ నగరంలో ఒక బర్గర్ కింగ్ అవుట్ లెట్  లో  స్మార్ట్ ఫోన్ పేలిన వీడియో ఒకటి నెట్ లో హల్ చేస్తోంది.  గ్లోబల్ గా ఈ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడానికి  రెండు రోజులు ముందు   ఈ వీడియో అప్ లోడ్ అయింది. అంతే క్షణాల్లో వైరల్ గా మారింది. దాదాపు 10 లక్షల మంది దీన్ని వీక్షించారు.
 
బర్గర్ కింగ్ అవుట్ లెట్  లో పేలిన ఫోను పట్టుకోవడానికి ఆ కార్యాలయ ఉద్యోగి  పవర్ ఫుల్ గ్లౌజ్ వేసుకొని కూడా పడిన పాట్లు నెటిజన్లకు షాకిస్తోంది.  ఈ సంఘటను శాంసంగ్ ఉద్యోగి కూడా ధృవీకించారు.  మరోవైపు ఈఘటనపై సదరు బర్గర్ యజమాని కూడా పరిహారం కోరినట్టు ఒక ఆన్లైన్ వార్తా వెబ్సైట్ వికీ ట్రీ నివేదించింది.  

కాగా దక్షిణ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ తాజా  స్మార్ట్ ఫోన్  చార్జింగ్ సమయంలో పేలుతున్న ఘటనలతో వివాదం చెలరేగింది. ఆ తర్వాత విమానాల్లో కూడా మంటలు,   పొగలు వ్యాపించిన ఘటనలతో మరిన్ని ఇబ్బందుల్లోచిక్కుక్కుంది. ఈ  నేపథ్యంలోప్రపంచ వ్యాప్తంగా  ముందు రీకాల్,రీప్లేస్ మెంటు వంటి చర్యలకు దిగినా  ఫలితం లేదు. చివరికి దీన్ని పూర్తిగా విరమించుకోవాల్సిని పరిస్థితికి నెట్టబడిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement