troubled
-
డయాగ్నస్టిక్ కంపెనీలకు ఇబ్బందే
ముంబై: వ్యాధి నిర్ధారణ సేవల్లోని కంపెనీల (డయాగ్నస్టిక్స్) ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం తగ్గొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. కరోనా పరీక్షలు గణనీయంగా తగ్గిపోవడం ఆదాయాల క్షీణతకు దారితీస్తుందని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున ఉండడంతో కంపెనీలు ఆదాయంలో 30 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు గుర్తు చేసింది. వైరస్ ప్రభావం క్షీణించడం, స్వయంగా పరీక్షించుకునే కిట్లకు ప్రాధాన్యం ఇస్తుండడం డయాగ్నస్టిక్స్ కంపెనీల ఆదాయాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సంరలో ప్రభావితం చేస్తుందన్నది క్రిసిల్ విశ్లేషణగా ఉంది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో కంపెనీల లాభాల మార్జిన్లు దశాబ్ద గరిష్టమైన 28 శాతానికి చేరుకోగా, అవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 24–25 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్ తెలిపింది. ఆదాయం తగ్గడానికితోడు అధిక నిర్వహణ వ్యయాలు, ప్రకటనలు, మార్కెటింగ్‌పై అధిక వ్యయాలు లాభాల మార్జిన్లపై ప్రభావం చూపిస్తాయని వివరించింది. అయినప్పటికీ మెరుగైన నగదు ప్రవాహాలు, పటిష్ట మూలధన వ్యయ విధానాలు (ఎక్విప్మెంట్ తదితర), రుణ భారం తక్కువగా ఉండడం వంటివి ఈ రంగంలోని కంపెనీల బ్యాలన్స్ షీట్లను ఆరోగ్యంగానే ఉంచుతాయని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. ఈ రంగంలోని 11 సంస్థల బ్యాలన్స్ షీట్లను క్రిసిల్ విశ్లేషించింది. పెరిగిన పోటీ.. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా టెస్ట్‌ల ద్వారా ఆదాయం మొత్తం ఆదాయంలో 20 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైనట్టు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. కాకపోతే ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షల రూపంలో ఆదాయం 12–14 శాతం మేర పెరగడంతో ఈ ప్రభావాన్ని చాలా వరకు అవి అధిగమిస్తాయని చెప్పారు. ఆన్లైన్ ఫార్మసీ సంస్థలు ల్యాబ్ టెస్ట్‌లను కూడా ఆఫర్ చేస్తుండడంతో ఈ రంగంలో పోటీ పెరిగినట్టు క్రిసిల్ వెల్లడించింది. కాకపోతే వైద్యులు సూచించే పరీక్షలకు ఆన్లైన్ సంస్థల నుంచి పోటీ ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ‘‘ఆన్లైన్ సంస్థలు సొంతంగా సదుపాయాలపై పెట్టుబడులు పెట్టుకుండా, స్థానిక వ్యాధి నిర్ధారణ కేంద్రాలతో టైఅప్ పెట్టుకుని కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే మార్కెట్లో నిలదొక్కుకున్న సంప్రదాయ డయాగ్నస్టిక్ సంస్థలు డిజిటల్ సదుపాయాలు, రోగి ఇంటికి వెళ్లి నమూనాల సేకరణకు పెట్టుబడులు పెంచాల్సిన పరిస్థితులను కల్పిస్తోంది’’అని క్రిసిల్ నివేదిక వివరించింది. భవిష్యత్తులో మరోసారి కరోనా వైరస్ మరింత తీవ్రరూపం దాల్చడం, ఆన్లైన్ సంస్థల నుంచి పెరిగే పోటీ, మార్కెట్ వాటా పెంచుకోవడాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. -
ఏపీని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది: చంద్రబాబు
అమరావతి : పార్లమెంటు, అసెంబ్లీ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీపి ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘ అవిశ్వాసం చేపట్టకుండా కేంద్రం పదేపదే కావాలనే వాయిదాలు వేస్తోంది. కేంద్రం ప్రవర్తన కొంతకాలంగా భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. రాష్ట్రానికి న్యాయం చేయాలని వారికి ఏ కోశానాలేదు. గతంలో ప్రత్యేక ఆర్ధిక సహాయానికి ఎందుకు ఒప్పుకున్నాం,ఇప్పుడెందుకు హోదాయే కావాలని అడుగుతున్నాం అనే దానిపై ప్రజలకు వివరించాలి. ఎవరికీ హోదా ఇవ్వం అంటేనే అప్పుడు ఆర్ధిక సహాయానికి అంగీకరించాం. తరువాత కేంద్రం మాట తప్పింది. హోదా రాష్ట్రాలకు 90:10 కింద నిధులు, ప్రోత్సాహకాలు కొనసాగిస్తోంది. వేరే రాష్ట్రాలకు ఇచ్చేటట్లయితే మనకూ అదేపేరుతో ఇవ్వాలనేది మన డిమాండ్ ’ అని స్పష్టం చేశారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. అందుకే టీడీపీకి మద్దతుగా అన్నివర్గాల ప్రజలు ఉన్నారని, తొలి ఏడాది నుంచే గొడవలు పెట్టుకుంటే రాష్ట్రం దెబ్బతింటుందని, అందుకే ఇన్నాళ్లూ ఓపికపట్టామని వివరించారు.రాష్ట్రానికి నిధులివ్వమని కోరితే తనపై కేంద్రం ఎదురుదాడి చేయిస్తోందని మొసలి కన్నీరు పెట్టారు. మూడు పార్టీలు కలిసి తనపై ముప్పేట దాడి చేస్తున్నారని విమర్శించారు. అయినా వెనుకంజ వేసేది ప్రసక్తే లేదని,రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడేది లేదన్నారు. ప్రజలే మాకు కొండంత అండ అని, తనను,లోకేష్‌ను, మంత్రులను, టీడీపీని టార్గెట్ చేస్తున్నారనిఆరోపించారు. కక్ష సాధింపు చర్యలు ఇంకా పెరుగుతాయని, టీడీపీ నాయకులు, కార్యాకర్తలందరూ సిధ్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. -
వైద్య సేవల్లో నిర్లక్ష్యంపై విచారణ
కొవ్వూరు: కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో గర్భిణికి వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనంపై వైద్యవిధాన పరిషత్ అధికారులు విచారణ చేపట్టారు. డీసీహెచ్ఎస్ కె.శంకర్రావు ఆదేశాల మేరకు తణుకు ఏరియా ఆస్పత్రి సివిల్ సర్జన్ సెష్పలిస్ట్ (సీఎస్ఎస్) ఎస్.శ్రీనివాసరావు సోమవారం కొవ్వూరు ఆస్పత్రికి వచ్చి విచారణ చేశారు. ‘వైద్యం అందక నిండు గర్భిణి అవస్థ’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందిం చారు. ఆస్పత్రిలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను సేకరిం చారు. శనివారం రాత్రి విధుల్లో ఉన్న ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ పి.సుధీర్‌తో పాటు మెటర్నరీ అసిస్టెంట్, స్టాఫ్‌నర్సు, సెక్యూరిటీ గార్డును విచారించి రాత పూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అంబులెన్స్ గురించి ఆరా తీశారు. అంబులెన్స్ డ్రైవర్ దీర్ఘకాలిక సెలవు పెట్టినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై కూడా నివేదిక పంపనున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు. విచారణ నివేదికను డీసీహెచ్ఎస్కు అందజేస్తామని చెప్పారు. -
స్మార్ట్‌ఫోన్ షాకింగ్ వీడియో...
గెలాక్సీ నోట్ 7 రూపంలో శాంసంగ్ ను వెన్నాడిన కష్టాలుఅన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ లిథియం-అయాన్ బ్యాటరీ పేలుడు ఫిర్యాదులు చేయడంతో మొదలైన కష్టాలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియా ఇంచియాన్ నగరంలో ఒక బర్గర్ కింగ్ అవుట్ లెట్ లో స్మార్ట్ ఫోన్ పేలిన వీడియో ఒకటి నెట్ లో హల్ చేస్తోంది. గ్లోబల్ గా ఈ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడానికి రెండు రోజులు ముందు ఈ వీడియో అప్ లోడ్ అయింది. అంతే క్షణాల్లో వైరల్ గా మారింది. దాదాపు 10 లక్షల మంది దీన్ని వీక్షించారు. బర్గర్ కింగ్ అవుట్ లెట్ లో పేలిన ఫోను పట్టుకోవడానికి ఆ కార్యాలయ ఉద్యోగి పవర్ ఫుల్ గ్లౌజ్ వేసుకొని కూడా పడిన పాట్లు నెటిజన్లకు షాకిస్తోంది. ఈ సంఘటను శాంసంగ్ ఉద్యోగి కూడా ధృవీకించారు. మరోవైపు ఈఘటనపై సదరు బర్గర్ యజమాని కూడా పరిహారం కోరినట్టు ఒక ఆన్లైన్ వార్తా వెబ్సైట్ వికీ ట్రీ నివేదించింది. కాగా దక్షిణ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ తాజా స్మార్ట్ ఫోన్ చార్జింగ్ సమయంలో పేలుతున్న ఘటనలతో వివాదం చెలరేగింది. ఆ తర్వాత విమానాల్లో కూడా మంటలు, పొగలు వ్యాపించిన ఘటనలతో మరిన్ని ఇబ్బందుల్లోచిక్కుక్కుంది. ఈ నేపథ్యంలోప్రపంచ వ్యాప్తంగా ముందు రీకాల్,రీప్లేస్ మెంటు వంటి చర్యలకు దిగినా ఫలితం లేదు. చివరికి దీన్ని పూర్తిగా విరమించుకోవాల్సిని పరిస్థితికి నెట్టబడిన సంగతి తెలిసిందే. -
స్మార్ట్‌ఫోన్ షాకింగ్ వీడియో...
-
మల్లన్న మంటలు