వైద్య సేవల్లో నిర్లక్ష్యంపై విచారణ
Published Tue, Jan 31 2017 1:55 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
కొవ్వూరు: కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో గర్భిణికి వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనంపై వైద్యవిధాన పరిషత్ అధికారులు విచారణ చేపట్టారు. డీసీహెచ్‌ఎస్ కె.శంకర్రావు ఆదేశాల మేరకు తణుకు ఏరియా ఆస్పత్రి సివిల్ సర్జన్ సెష్పలిస్ట్ (సీఎస్‌ఎస్) ఎస్.శ్రీనివాసరావు సోమవారం కొవ్వూరు ఆస్పత్రికి వచ్చి విచారణ చేశారు. ‘వైద్యం అందక నిండు గర్భిణి అవస్థ’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందిం చారు. ఆస్పత్రిలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను సేకరిం చారు. శనివారం రాత్రి విధుల్లో ఉన్న ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ పి.సుధీర్‌తో పాటు మెటర్నరీ అసిస్టెంట్, స్టాఫ్‌నర్సు, సెక్యూరిటీ గార్డును విచారించి రాత పూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అంబులెన్స్ గురించి ఆరా తీశారు. అంబులెన్స్ డ్రైవర్ దీర్ఘకాలిక సెలవు పెట్టినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై కూడా నివేదిక పంపనున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు. విచారణ నివేదికను డీసీహెచ్‌ఎస్‌కు అందజేస్తామని చెప్పారు.
Advertisement
Advertisement