న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండ్ కంపెనీ రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియాలో 25.36 శాతం వాటాను ప్రమోటర్ సంస్థ విక్రయించింది. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ క్యూఎస్‌ఆర్ ఏషియా పీటీఈ ద్వారా ఎవర్‌స్టోన్ క్యాపిటల్ రూ. 1,494 కోట్లకు ఈ వాటాను అమ్మివేసింది. షేరుకి రూ. 119.1 సగటు ధరలో 25.3 శాతం వాటాకు సమానమైన 12,54,41,820 షేర్లను విక్రయించింది.
ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం అమల్ ఎన్ పారిఖ్, టాటా ఎంఎఫ్, క్వాంట్ ఎంఎఫ్, ప్లూటస్ వెల్త్ మేనేజ్‌మెంట్, ఫ్రాంక్లిన్ సింగపూర్3 బ్యాంకెన్ ఏషియా స్టాక్‌మిక్స్, ఐసీఐసీఐ ప్రు లైఫ్ తదితరాలు షేర్లను కొనుగోలు చేశాయి. కాగా.. తాజా లావాదేవీ తదుపరి రెస్టారెంట్ బ్రాండ్స్‌లో ఎవర్‌స్టోన్ వాటా 40.8 శాతం నుంచి 15.44 శాతానికి క్షీణించింది. రెస్టారెంట్ బ్రాండ్స్ దేశీయంగా బర్గర్ కింగ్ ఇండియా, పోపియస్ బ్రాండ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో రెస్టారెంట్ బ్రాండ్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6.4 శాతం జంప్‌చేసి రూ. 128 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment