అంకిత భావంతో చేసే పని నలుగురిచే గుర్తించేలా చేస్తుందన్న మాటలు మళ్ళీ ఋజువయ్యాయి. లాస్ వెగాస్‌లోని బర్గర్ కింగ్‌లోని మెక్‌కారన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాషియర్ అండ్ కుక్‌గా పనిచేస్తున్న 'కెవిన్ ఫోర్డ్' 27 సంవత్సరాలు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పని చేస్తే ఆ సంస్థ అతనికి మిఠాయిలు, పెన్నులు, స్టార్‌బక్స్ కప్ వంటి వాటితో కూడిన మంచి బ్యాగ్‌ని అందుకున్నాడు.
అన్ని సంవత్సరాలు ఎంతో నిబద్దతతో పనిచేస్తే సరైన గుర్తింపు లభించలేదని, దానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ తర్వాత అతని కుమార్తె సెరీనా GoFundMe పేజీ స్టార్ట్ చేసింది. దీనికి అతి తక్కువ కాలంలోనే అన్యూహ్య స్పందన లభించింది. దీని ద్వారా ఏకంగా నాలుగు లక్షల డాలర్లు.. అంటే సుమారు రూ. 3.48 కోట్లు విరాళాలుగా సమకూరాయి.
కెవిన్ ఫోర్డ్ అంకిత భావం, చిత్త శుద్ధి ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయి. దీనివల్లే ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రాగలిగాయి. కుటుంబం పోషణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల లభించిన విరాళాలు వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి.
ఇదీ చదవండి: సిమ్ కార్డ్ డీలర్లకు కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా!
పదవి విరమణ వయసు వచ్చినప్పటికీ ఆర్థికపరమైన కారణాల వల్ల పనిచేస్తూనే ఉన్నాడు. భారీగా విరాళాలు పొందిన ఫోర్డ్.. ప్రపంచంలో చాలామంది దాతృత్వం కలిగి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన డబ్బు నా పిల్లలు మనవళ్ల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తానన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment