దేశంలో పెరిగిపోతున్న టమోటా ధరలు ప్రముఖ ఫాస్ట్ ఫుడ్‌చెయిన్ సంస్థల్ని ముప్పుతిప్పలు పెట్టిస్తున్నాయి. టమోటా ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో మెక్‌డోనాల్డ్, సబ్‌వే తర్వాత ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం బర్గర్ కింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తమ ఆహార పదార్థాల్లో టమాటాల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
భారత్‌లో రెస్టారెంట్ బ్రాండ్స్ ఏసియా పేరుతో బర్గర్ కింగ్ ఫాస్ట్‌ఫుడ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా 400 స్టోర్లు ఉన్నాయి. అయితే, ఈ వారం దేశ ఆహార ద్రవ్యోల్బణం జనవరి 2020 నుండి అత్యధిక స్థాయికి చేరుకోవడంతో తమ ఆహార పదార్ధాల నుంచి టమోటాలను ఉపయోగించమని తెలిపింది. గత కొంత కాలంగా యూఎస్‌లోని ఫుడ్ లవర్స్‌కు ఉచిత చీజ్ ముక్కలను ఇవ్వడాన్ని బర్గర్ కింగ్ రద్దు చేసింది.
కస్టర్లు అర్ధం చేసుకోవాలి
ఇటీవల నా బర్గర్లలో టమోటాలు ఎందుకు లేవు? అంటూ కస్టమర్లు బర్గర్‌కింగ్‌ను ప్రశ్నించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనిపై ఇటీవల ఆ సంస్థ స్పందించింది. టమాటా ధరలు భారీగా పెరిగిపోవడంతో నిర్వహణ ఇబ్బందిగా మారింది. అందుకే ఆహార పదార్ధాలలో టమోటాల వినియోగించడం లేదు. కస్టమర్లు అర్ధం చేసుకోవాలి. ఆహార పదార్థాల్లో నాణ్యత, ప్రమాణాల్లో రాజీ పడం.. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాం’ అని పేర్కొంది.
ప్రపంచంలోనే అత్యంత చవకైన పిజ్జాలు
అదే సమయంలో ప్రత్యర్థి డొమినోస్ తగ్గిపోతున్న కస్టమర్లను ఆకట్టుకునేందుకు పిజ్జా ధరల్ని తగ్గించి అమ్ముతుంది. ఇక్కడే ప్రపంచంలోనే అత్యంత చవకైన పిజ్జాలు లభిస్తున్నాయని సమాచారం.
చదవండి👉 జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి!
Comments
Please login to add a commentAdd a comment