tamota
-
2023 సామాన్యునికి ఏమిచ్చింది?
గడచిన 2020, 2021 సంవత్సరాల్లో కరోనా మహమ్మారి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. దేశవ్యాప్తంగా అమలైన లాక్డౌన్, కరోనా ఆంక్షలు సామాన్యుల వెన్ను విరిచాయి. వ్యాపారాలు నిలిచిపోవడంతో చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే 2022లో పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. వ్యాపారాలు తిరిగి ట్రాక్‌లో పడ్డాయి. ఆ దశ దాటాక వచ్చిన 2023 సామాన్యులకు ఉపశమనం కలిగించింది. మాల్స్‌లో జనం బారులు దేశంలో జీడీపీ వృద్ధి కూడా ఊహించిన దాని కంటే అధికంగానే ఉంది. 2023లో మార్కెట్లలో మంచి ఆర్థికవృద్ధి కనిపించింది. రెస్టారెంట్లు జనాలతో నిండిపోయాయి. మార్కెట్లు, మాల్స్‌లో జనం గుంపులు గుంపులుగా కనిపించారు. ఇది జీడీపీ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మించి 7.6 శాతంగా నమోదైంది. తయారీ, మైనింగ్, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల అద్భుతమైన పనితీరు కారణంగా రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఊహించిన దాని కంటే అధికంగా ఉంది ఉంది. రూ. 200 దాటిన టమాటా వ్యవసాయం పరంగా కూడా ఈ ఏడాది బాగానే ఫలితాలు వచ్చాయి. బియ్యం, ఇతర ధాన్యాల ఉత్పత్తి వృద్ధి చెందింది. ద్రవ్యోల్బణం విషయానికి వస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువగానే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. జూలై-ఆగస్టులో టమాటా ధరలు కిలో రూ.200 దాటాయి. దీంతో ప్రభుత్వం టమాటాను రాయితీ ధరలకు విక్రయించాల్సి వచ్చింది. టమోటా తర్వాత ఉల్లి ధరలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. అయితే ఇప్పుడు ఉల్లి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. తగ్గిన నిరుద్యోగిత రేటు 2023 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు తగ్గింది. జూలై-సెప్టెంబర్ 2023లో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 7.2 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.6 శాతంగా ఉంది. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 6.6 శాతంగా నమోదైంది. అదే సమయంలో మహిళా కార్మికుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. 2023 సంవత్సరం ఉపాధి రంగంలో మిశ్రమ సంవత్సరంగా నిలిచింది. ఇది కూడా చదవండి: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
భర్తకు కూరగాయల ఎంపిక పరీక్ష.. పాసవుతాడా?
ప్రతీ ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవలనేవి సాధారణంగా వస్తూనే ఉంటాయి. దంపతుల మధ్య గొడవలనేవి లేకపోతే మాధుర్యమే ఉండదని అనేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా దంపతుల మధ్య ఇంటిలోని వస్తువులను కొనుగోలు చేసే విషయంలో గొడవలు వస్తుంటాయి. భార్యాభర్తలు మార్కెట్‌కు వెళ్లి, వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు వారి మధ్య వాదనలు చోటుచేసుకుంటాయి. అలాగే భార్య.. భర్తకు లిస్టు ఇచ్చి, ఏమైనా సరుకులు తీసుకురమ్మని చెప్పినప్పుడు, భర్త ఏదైనా మరచిపోతే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. తాజాగా ఇలాంటి ఒక ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక భార్య.. మార్కెట్‌కు వెళ్లి, తీసుకురావాల్సిన కూరగాయల లిస్టును భర్తకు ఇచ్చింది. దానిలో తీసుకురావాల్సిన కూరగాయల గురించి రాసింది. అవి ఏ రీతిలో ఉండాలో క్షుణ్ణంగా రాసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లిస్టును చూసినవారికి తల తిరిగిపోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ కూరగాయల లిస్టులో ముందుగా టమాటాలు ఎలా ఉండాలో తెలిపింది. టొమాటాలు పసుపు, ఎరుపు రంగులోనే ఉండాలని, వాటికి పగుళ్లు ఉండకూడదని రాసింది. తరువాత ఉల్లిపాయల విషయానికొస్తే.. ఈ జాబితాను రూపొందించిన భార్య ఉల్లిపాయ బొమ్మ గీసి, ఎలాంటి ఉల్లిపాయలను ఎంచి తీసుకురావాలో వివరించింది. అదేవిధంగా బంగాళాదుంపల ఎంపిక వివరాలు కూడా ఉన్నాయి. అలాగే మిరపకాయలు, పాలకూర, లేడీ ఫింగర్.. ఇలా వీటి కొనుగోలుకు సంబంధించిన వివరణాత్మక సమాచారం ఆ చీటీలో ఉంది. జాబితా చివరలో ఇవి కూరగాయల వ్యాపారి దగ్గరి నుంచి తీసుకురావాలని ఆ భార్య గుర్తుచేసింది. ఈ పోస్ట్ @trolls_official అనే పేజీ ద్వారా Instagramలో షేర్ చేశారు. ఈ జాబితాను చూసిన నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక యూజర్ ఇలా రాశాడు ‘ఆ మహిళకు అవార్డు ఇవ్వాల్సిందే’ అనగా, మరో యూజర్ ఈ మహిళ ఆమె పనిచేస్తున్న కార్యాలయంలో మంచి ఎక్స్‌ప్లైనర్ అయివుంటుందని రాశారు. ఇది కూడా చదవండి: ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది? -
‘నా బర్గర్లలో టమోటాలు ఎందుకు లేవు’?
దేశంలో పెరిగిపోతున్న టమోటా ధరలు ప్రముఖ ఫాస్ట్ ఫుడ్‌చెయిన్ సంస్థల్ని ముప్పుతిప్పలు పెట్టిస్తున్నాయి. టమోటా ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో మెక్‌డోనాల్డ్, సబ్వే తర్వాత ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం బర్గర్ కింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తమ ఆహార పదార్థాల్లో టమాటాల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో రెస్టారెంట్ బ్రాండ్స్ ఏసియా పేరుతో బర్గర్ కింగ్ ఫాస్ట్‌ఫుడ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా 400 స్టోర్లు ఉన్నాయి. అయితే, ఈ వారం దేశ ఆహార ద్రవ్యోల్బణం జనవరి 2020 నుండి అత్యధిక స్థాయికి చేరుకోవడంతో తమ ఆహార పదార్ధాల నుంచి టమోటాలను ఉపయోగించమని తెలిపింది. గత కొంత కాలంగా యూఎస్‌లోని ఫుడ్ లవర్స్‌కు ఉచిత చీజ్ ముక్కలను ఇవ్వడాన్ని బర్గర్ కింగ్ రద్దు చేసింది. కస్టర్లు అర్ధం చేసుకోవాలి ఇటీవల నా బర్గర్లలో టమోటాలు ఎందుకు లేవు? అంటూ కస్టమర్లు బర్గర్కింగ్ను ప్రశ్నించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనిపై ఇటీవల ఆ సంస్థ స్పందించింది. టమాటా ధరలు భారీగా పెరిగిపోవడంతో నిర్వహణ ఇబ్బందిగా మారింది. అందుకే ఆహార పదార్ధాలలో టమోటాల వినియోగించడం లేదు. కస్టమర్లు అర్ధం చేసుకోవాలి. ఆహార పదార్థాల్లో నాణ్యత, ప్రమాణాల్లో రాజీ పడం.. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాం’ అని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన పిజ్జాలు అదే సమయంలో ప్రత్యర్థి డొమినోస్ తగ్గిపోతున్న కస్టమర్లను ఆకట్టుకునేందుకు పిజ్జా ధరల్ని తగ్గించి అమ్ముతుంది. ఇక్కడే ప్రపంచంలోనే అత్యంత చవకైన పిజ్జాలు లభిస్తున్నాయని సమాచారం. చదవండి👉 జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి! -
టమాట ధరలు.. సామాన్యులకు భారీ ఊరట?!
దేశ ప్రజలకు శుభవార్త. టమాట ధరల్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దిగుబడి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి టమాటలను కొనుగోలు చేయాలని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న టమాట ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. రూ.100 నుంచి రూ.300 మధ్యలో ఉన్న టమాటా ధరలు పదీ ఇరవైకి దొరకనున్నాయి. నిన్న మొన్నటి వరకు రూ.10, రూ.20 దొరికిన కేజీ టమాట ఒక్కసారిగా రూ.100 దాటింది. కొన్ని చోట్ల రూ.150 నుండి రూ.300 మధ్యలో విక్రయిస్తున్నారు. రోజూ వినియోగించే టమాట ధరలు ఒక్కసారిగా పెరగడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాటిని కొనడానికే వెనకాడుతున్నారు. ఈ క్రమంలో భగ్గుమంటున్న టమాట సాగుపై కేంద్రం ఆరా తీసింది. వాటి ఆధారంగా గత ఏడాది కంటే ఈ ఏడాది టమాట పంట దిగుబడి భారీగా పెరుగుతుందని అంచనా వేసింది. పలు నివేదికల ప్రకారం.. దేశంలో పలు రాష్ట్రాల్లో జులై నెలలో టామటా దిగుబడి 2,23,000 మెట్రిక్ టన్నుల నుంచి ఆగస్ట్‌లో 5,44,000 టన్నులకు పెరుగుతుందని సమాచారం. ఈ పెరుగుదలతో చికెన్ ధరలతో పోటీ పడుతున్న టమాట ధరలు మరింత తగ్గుముఖం పట్టనున్నాయి. ఈ సందర్భంగా.. వినియోగదారుల వ్యవహారాలు , ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. దేశంలో ప్రధాన టమాట సాగు ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో టామాట ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా ధరలు తగ్గే అవకాశం ఉందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో టమాట సాగు ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి ఢిల్లీతో సహా ఉత్తరాది మార్కెట్లకు సరఫరా చేస్తోంది. ఈ రాష్ట్రంలో జూలైలో 2,000 మెట్రిక్ టన్నుల నుండి ఆగస్ట్‌లో 30,000 మెట్రిక్ టన్నుల వరకు టామాట పంట పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో సైతం టామాట ఉత్పత్తి పెరగనుంది. ఉత్పత్తి అంచనాలు సెప్టెంబరులో 9,56,000 మెట్రిక్ టన్నుల నుంచి అక్టోబర్‌లో గణనీయంగా 13,33,000 మెట్రిక్ టన్నులు పెరిగే అవకాశం ఉంది. టమాట ధరలు పెరగడానికి కారణం గత నెల జులైలో మన దేశంలోని ఉత్తర, వాయువ్య ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వరదలు భీభత్స సృష్టించాయి. దీంతో పంట పొలాలు నీట మునగడం.. పంట నష్టం భారీ ఎత్తున వాటిల్లింది. ఆ ప్రభావం టమోటా సరఫరాపై ప్రభావం చూపింది. ఢిల్లీ మార్కెట్లో టమాట రిటైల్ ధర కేజీ రూ. 200 మించి పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో గత ఏడాది జులై నెలలో టమాట 10875 మెట్రిక్ టన్నులు పండితే ఈ జూలైలో 1505 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. టమాట ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం పెరుగుతున్న టమాట ధరల్ని కట్టడి చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టమాట సాగు ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుండి కొనుగోలు చేయాలని, తరువాత వాటిని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF)లకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలు అమలుతో దేశంలో టమాట ధరలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి. చదవండి👉 బ్యాంకుల్లో మూలుగుతున్న డిపాజిట్లు..అంత డబ్బును బ్యాంక్‌లు ఏం చేశాయంటే? -
ఆల్‌టైమ్ రికార్డులో టమాట రేటు.. ట్రెండింగ్‌లో పేరడీ సాంగ్
దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఆల్ టైమ్ ధరలను బ్రేక్ చేస్తూ టమాట కిలో ఏకంగా రూ. 150 దాటి పరుగులు పెడుతున్నది. ఈ క్రమంలో సామాన్యులు టమాటాలను కొనే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు.. నిత్యావసర కూరగాయ ధరలు కూడా ఆకాశానికి అంటుతున్నాయి. ఇక టమాట ధరలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక లేటెస్ట్గా కంటెంట్ క్రియేటర్ కుషాల్ టమాట ధరల పెంపుపై ఓ పేరడీ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో టమాట ధరలపై కుశాల్‌తో పాటు పలువురు వ్యక్తులు పేరడీ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ప్రముఖ తమిళ సాంగ్ తుమ్ తుమ్ సాంగ్‌కు పేరడీ లిరిక్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. రోజువారీ వంటకాల్లో మనం వాడే టమాట ధర మోతెక్కడం గురించి ఈ సాంగ్ లిరిక్స్ ప్రస్తావిస్తాయి. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యతరగతి కష్టాలను కుశాల్ తన పేరడీ సాంగ్‌లో అద్భుతంగా వర్ణించారని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. వినూత్న కాన్సెప్ట్‌తో కంటెంట్ క్రియేటర్ ముందుకొచ్చారని మెచ్చుకున్నారు. ఈ వీడియోకు నెట్టింట ఇప్పటివరకూ ఏకంగా 4.53 లక్షల లైక్‌లు రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. -
నోట్ల రద్దు తర్వాత పతనమైన టమోటా ధర
-
ధర తగ్గి.. బతుకు బుగ్గి!
టమాట ధర పతనం – ముందస్తు వర్షాలతో భారీగా పెరిగిన సాగు – ఒకేసారి మార్కెట్లోకి దిగుబడులు – ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి – 28 కిలోల బాక్కు ధర హోల్‌సేల్‌గా రూ.30 – రవాణా చార్జీలు, కూలి ఖర్చులకూ గిట్టని వైనం – పొలంలోనే వదిలేస్తున్న రైతులు – మార్కెటింగ్ శాఖ చర్యలు శూన్యం కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత టమాట అత్యధికంగా సాగయ్యే జిల్లా కర్నూలు. ఖరీఫ్‌లో జిల్లా సాధారణ సాగు 6,500 హెక్టార్లు ఉండగా.. దాదాపు 6,800 హెక్టార్లలో సాగయింది. అయితే జిల్లాలో టమాట ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా అమలుకు నోచుకోని పరిస్థితి. ఫలితంగా యేటా టమాట ధర పడిపోతుండటంతో రైతుల శ్రమ మట్టిలో కలుస్తోంది. కనీసం రైతులను గట్టెక్కించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేకపోతోంది. ఏటా టమాట ధర జనవరి, ఫిబ్రవరి నెలల్లో పడిపోతుంటుంది. ఈసారి ముందస్తుగానే ఆ పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పతనమవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈనేపథ్యంలో మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి టమాట దిగుబడులను సేకరించి ధర ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు తరలించి విక్రయించే ఏర్పాటు చేయాలి. అయితే ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. జిల్లాతో పాటు చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లోనూ టమాట సాగు పెరగడం, దిగుబడులు ఒకేసారి రావడంతో ధర పతమయినట్లు తెలుస్తోంది. ముందస్తు వర్షాలతోనే.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ముందస్తుగా.. అంటే జూన్‌లోనే వర్షాలు కురవడంతో టమాట సాగు మొదలయింది. జూలై నెల చివరి వరకు వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో దిగుబడులు మార్కెట్‌కు చేరడం ప్రారంభమయింది. సరిగ్గా 45 రోజుల క్రితం కిలో టమాట ధర రూ.45 నుంచి రూ.50 వరకు ఉంది. ఊహించని విధంగా సాగు పెరగడం, అన్ని ప్రాంతాల్లో పంట ఒకేసారి రావడంతో ధర పతనమయింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని కూరగాయల హోల్‌సేల్ మార్కెట్లో 28 కిలోల బాక్స్ ధర రూ.30 నుంచి రూ.60 మాత్రమే పలుకుతోంది. అంటే కిలో ధర రూ.1 నుంచి రూ.2లు మాత్రమే. కొద్ది రోజులుగా ధరలు ఇదే స్థాయిలో ఉండటంతో రైతులకు పెట్టుబడులు కాదు గదా.. టమాటను తెంపడానికి, రవాణా చార్జీలకూ సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు నష్టాలను భరించలేక టమాటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. పెట్టుబడిలో 50 శాతం కూడా దక్కదు టమాట సాగులో ఎకరాకు రూ.12వేల నుంచి రూ.16 వేల వరకు పెట్టుబడి పెట్టారు. రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడులు పెడితే కొంత ఊరట లభిస్తుంది. దిగుబడి పెరిగినా పంట మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ధరలు పడిపోవడంతో పెట్టుడబడిలో 50 శాతం కూడా దక్కక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా ధర రూ.200లోపే ఉండటంతో రూ.6వేల వరకే వస్తోంది. ఇందులో కోత, రవాణా చార్జీలు తీసేస్తే ఎకరాకు రూ.3వేలు కూడా దక్కట్లేదు. మార్కెట్లను ముంచెత్తుతున్న టమాట జిల్లాలోని మార్కెట్లను టమాట ముంచెత్తుతోంది. కర్నూలులోని సి,క్యాంపు రైతుబజార్‌కు రోజూ 160 క్వింటాళ్లు వస్తోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని కూరగాయల మార్కెట్‌కు 500 క్వింటాళ్ల వరకు వస్తోంది. జిల్లాలో పత్తికొండ, డోన్, ప్యాపిలి, ఆస్పరి మండలాల్లో టమాట మార్కెట్లు ఉన్నాయి. వీటికి సైతం భారీగా వస్తోంది. డిమాండ్ పడిపోవడం, సరఫరా పెరగడంతో ధరలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో స్పందించాల్సిన ప్రభుత్వం మౌనం వహించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పొలంలోనే వదిలేసినా ఈసారి జూన్‌లోనే వర్షాలు పడటంతో అదే నెల మూడెకరాల్లో టమాట పెట్టిన్యాం. వర్షాదారం కింద కొంత, నీటి ఆధారం కింద కొంత వేసిన్యాం. ఎకరాకు పెట్టుబడి రూ.13వేల నుంచి రూ.15 వేల వరకు అయినాది. పంట బానే వచ్చినా ఎప్పుడూ లేనట్ల ధర పడిపోయినాది. పెట్టుబడిల 20శాతం కూడా వస్తలేదు. టమాటలు తెంపనీక రోజుకు మనిషికి రూ.100 పైనే ఇయ్యాల. మార్కెట్‌కి తీసుకపోనీక గంపకు రూ.30 పైనే అడుగుతారు. గిట్టుబాటు కాదని పొలంలోనే వదిలేసినా. – బద్రిస్వామి, గిరిగెట్ల, తుగ్గలి మండలం రూ.30వేల పెట్టుబడికి రూ.10వేలు బోరు కింద ఒకటిన్నర ఎకరాల్లో టమాట సాగు చేసినా. పెట్టుబడి దాదాపు రూ.30 వేలు అయింది. దిగుబడి బాగాన్నా ధర పూర్తిగా పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో కిలో ధర రూ.15 వరకు ఉండింది. ఈ సారి 25 కిలోల గంపకు రూ.50 కూడా వస్తలేదు. 10 గంపలు మార్కెట్‌కు తరలిస్తే కూలి, రవాణా ఖర్చులు కూడా రావు. నష్టాలను భరించలేక టమాటలు తెంపడమే మానేసినా. ఇట్టాంటి పరిస్థితి యానాడు లేకుండె. – గోపాల్, అరికెర, ఆలూరు మండలం టమాట అత్యధికంగా సాగయ్యే మండలాలు: ఆదోని డివిజన్: ఆస్పరి, దేవనకొండ, పత్తికొండ, మద్దికెర, పెద్దకడుబూరు, తుగ్గలి, కౌతాళం, హాలహర్వి ఆలూరు కర్నూలు డివిజన్: డోన్, ప్యాపిలి, వెల్దుర్తి, కష్ణగిరి, ఓర్వకల్లు, కర్నూలు, కల్లూరు, నందికొట్కూరు, బేతంచెర్ల, గూడూరు