McDonald restaurant
-
మెక్ డొనాల్డ్స్ బర్గర్ లో బ్యాక్టీరియా
-
ఇజ్రాయెల్ - హమాస్ ఉద్రిక్తతలు.. బాయ్‌కాట్ ‘మెక్‌డొనాల్డ్స్’
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య ఉద్రిక్తతలు ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ దిగ్గజం మెక్‌డొనాల్డ్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. ఇటీవల,హమాస్ ఉగ్రవాదుల ఏరేవేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ప్రతికార దాడులకు తెగబడుతోంది. అయితే, వారి పోరాటానికి మెక్‌డొనాల్డ్స్ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో మెక్‌డొనాల్డ్ తీరును విమర్శిస్తూ ప్రపంచ దేశాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సైనికులు ఉచిత ఆహారం ఇన్ స్టాగ్రామ్ వేదికగా మెక్ డొనాల్డ్ ఇజ్రాయెల్ సైన్యానికి మద్దతు పలికింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(Israel Defence Forces)లో భాగమైన హాస్పిటల్స్, సైన్యానికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. చెప్పినట్లుగానే 4,000 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది. యుద్ధం చేస్తున్న సైనికులు కాకుండా డిఫెన్స్‌లో పనిచేస్తున్న సోల్జర్స్ కోసం ప్రత్యేకంగా 5 రెస్టారెంట్లను ప్రారంభించినట్లు తెలిపింది. బాయ్‌కాట్‌కు పిలుపు దీంతో హమాస్ మద్దతు దారులు మెక్‌డొనాల్డ్స్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలునిచ్చారు. ‘ఐడీఎఫ్కి మెక్‌డొనాల్డ్ ఉచిత భోజనాన్ని అందిస్తోంది. మనం మన సూత్రాలకు కట్టుబడి ఉండాలి. నమ్మకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి’ అనే నినాదంతో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న మెక్‌డొనాల్డ్స్ వంటి కంపెనీలను బహిష్కరిద్దామని పిలుపునిచ్చారు. మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ సైన్యానికి ఉచితంగా భోజనం ఇస్తుంటే గాజాలో ప్రభావితమైన వారితో పాటు ప్రపంచ వ్యాప్తంగా హమాస్ మద్దతుదారులందరూ మెక్‌డొనాల్డ్స్‌ను బహిష్కరించాలని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ మద్దతు దారులు మాత్రం మెక్‌డొనాల్డ్ చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెక్‌డొనాల్డ్స్ ప్రకటనపై నిరసనలు ఇదిలా ఉండగా అక్టోబర్ 13న ఇజ్రాయెల్ సైనికులకు ఉచిత ఆహార ప్రకటనపై లెబనాన్ దేశంలో నిరసనలు చెలరేగాయి. లెబనాన్ ఆధారిత 961 నివేదిక ప్రకారం, స్పిన్నీస్, సిడాన్‌లోని మెక్‌డొనాల్డ్స్‌పై పాలస్తీనియన్ గ్రూపులు దాడి చేశాయి. దీనిపై మెక్‌డొనాల్డ్స్ లెబనాన్ అధికారిక నోట్‌ను విడుదల చేసింది. ఇతర దేశాలు, భూభాగాల్లోని ఇతర ఫ్రాంఛైజీల్లోని మెక్‌డోనాల్డ్స్ నిర్ణయాలపై మెక్ డొనాల్డ్స్ లెబనాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపింది. ఒమన్ మెక్‌డొనాల్డ్స్ గాజాకు తమ మద్దతును తెలిపింది. గాజాలోని ప్రజల సహాయ చర్యల కోసం కంపెనీ 100,000 డాలర్లు విరాళంగా అందించింది. మెక్‌డొనాల్డ్స్ ఒమన్ (అల్ దౌద్ రెస్టారెంట్స్ ఎల్ఎల్సీ) గాజాలోని సోదరులు, సోదరీమణులకు అండగా నిలుస్తాం. విలువలు, మా నిబద్ధతకు కట్టుబడి ఉన్నామని నోట్లో వెల్లడించింది. -
‘నా బర్గర్లలో టమోటాలు ఎందుకు లేవు’?
దేశంలో పెరిగిపోతున్న టమోటా ధరలు ప్రముఖ ఫాస్ట్ ఫుడ్‌చెయిన్ సంస్థల్ని ముప్పుతిప్పలు పెట్టిస్తున్నాయి. టమోటా ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో మెక్‌డోనాల్డ్, సబ్వే తర్వాత ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం బర్గర్ కింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తమ ఆహార పదార్థాల్లో టమాటాల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో రెస్టారెంట్ బ్రాండ్స్ ఏసియా పేరుతో బర్గర్ కింగ్ ఫాస్ట్‌ఫుడ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా 400 స్టోర్లు ఉన్నాయి. అయితే, ఈ వారం దేశ ఆహార ద్రవ్యోల్బణం జనవరి 2020 నుండి అత్యధిక స్థాయికి చేరుకోవడంతో తమ ఆహార పదార్ధాల నుంచి టమోటాలను ఉపయోగించమని తెలిపింది. గత కొంత కాలంగా యూఎస్‌లోని ఫుడ్ లవర్స్‌కు ఉచిత చీజ్ ముక్కలను ఇవ్వడాన్ని బర్గర్ కింగ్ రద్దు చేసింది. కస్టర్లు అర్ధం చేసుకోవాలి ఇటీవల నా బర్గర్లలో టమోటాలు ఎందుకు లేవు? అంటూ కస్టమర్లు బర్గర్కింగ్ను ప్రశ్నించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనిపై ఇటీవల ఆ సంస్థ స్పందించింది. టమాటా ధరలు భారీగా పెరిగిపోవడంతో నిర్వహణ ఇబ్బందిగా మారింది. అందుకే ఆహార పదార్ధాలలో టమోటాల వినియోగించడం లేదు. కస్టమర్లు అర్ధం చేసుకోవాలి. ఆహార పదార్థాల్లో నాణ్యత, ప్రమాణాల్లో రాజీ పడం.. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాం’ అని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన పిజ్జాలు అదే సమయంలో ప్రత్యర్థి డొమినోస్ తగ్గిపోతున్న కస్టమర్లను ఆకట్టుకునేందుకు పిజ్జా ధరల్ని తగ్గించి అమ్ముతుంది. ఇక్కడే ప్రపంచంలోనే అత్యంత చవకైన పిజ్జాలు లభిస్తున్నాయని సమాచారం. చదవండి👉 జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి! -
మెక్‌డొనాల్డ్స్‌కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో తెలుసా?
చెట్టెక్కి కూర్చున్న టొమాటో ధర సామాన్య ప్రజల్నే కాదు.. కార్పొరేట్ ఫుడ్ చైన్లను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ కి టొమాటో మంట సెగ బాగా తగిలింది. టొమాటో ధర ఆకాశాన్నంటడంతో సాధారణ జనం టొమాటో లేకుండానే కాలం గడిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు రెస్టారెంట్లు కూడా టొమాటో లేకుండానే వంటకాలను వడ్డించేందుకు సిద్ధమైపోతున్నాయి. (నిమిషాల్లో రూ.500 కోట్లు: ప్రముఖ ఇన్వెస్టర్‌కి కలిసొచ్చిన అదృష్టం, కారణం!) రికార్డు స్థాయికి చేరిన ధరల సెగతో మెక్‌డొనాల్డ్స్ మెనూ నుంచిటొమాటోను తొలగించేసింది. పెరిగిన ధరలు, సరఫరా లేకపోవడంతో టొమాటో లేకుండానే బర్గర్లు, పిజ్జాలాంటి వాటిని సరఫరా చేస్తోంది. తమ నాణ్యతా ప్రమాణాలకు తగినసరఫరా లేకపోవడమే కారణమంటూ నోటీసులు అంటించడం ఇపుడు హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(World Richest Beggar Bharat Jain: వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) ఎంత ప్రయత్నించినా ప్రపంచ స్థాయిలో ఉండే నాణ్యతా ప్రమాణాలకు తగిన టొమాటో దొరకడం లేదు. అందుకే కొన్నాళ్లు టొమాటో లేని ఆహార ఉత్పత్తులను అందించాల్సి వస్తోంది. దిగుమతికీ కష్టపడుతున్నాం' అంటూ ఢిల్లీని కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లలో నోటీసులు అతికించింది. సప్లయ్ చెయిన్‌లో నాణ్యమైన సమస్యలే కాకుండా,ధరల సమస్య కూడా తలెత్తిందని నిర్వాహకులు తెలిపారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?) కాగా వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలతో దేశంలో టొమాటో దిగుబడి బాగా పడిపోయింది. ఫలితంగా అనేక నగరాల్లో కిలో టొమాటో రూ. 100 నుంచి 200వరకు పలుకుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు టొమాటాల కొరత కారణంగా ప్రత్యామ్నాయాల్ని వాడటమని సూచనలు, ప్రకటనలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా “టొమాటో ధరలు పెరుగుతున్నాయా? బదులుగా టొమాటోప్యూరీ వాడుకోండి” అంటూ టాటా బిగ్‌బాస్కెట్ షాపింగ్ యాప్ ప్రకటనను విశేషంగా నిలుస్తోంది. గతంలో ఉల్లిపాయ ధరలు కూడా బాగా పెరిగినపుడు ఉల్లికి బదులుగా క్యాబేజీని వాడిన వైనాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. -
మెక్ డొనాల్డ్స్ నిర్వాకం: కూల్ డ్రింకులో చచ్చిన బల్లి..చివరికి
అహ్మదాబాద్: కూల్ డ్రింక్స్‌లో పురుగు మందుల అవశేషాలున్నాయని అనేక రిపోర్టులు చెబుతున్నా పట్టించుకోని శీతల పానీయాల ప్రియులకు మరో షాకింగ్ న్యూస్. తాజాగా అహ్మదాబాద్‌లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులకు చేదు అనుభవం ఎదురైంది. భార్గవ జోషి అనే వ్యక్తి ఆర్డర్ చేసిన కూల్ డ్రింకులో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది. బల్లిని చూసి షాకైన భార్గవ జోషి రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి, ఇందేంటని నిలదీశాడు. అయితే ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్న సిబ్బంది డబ్బులు వాపస్ ఇస్తాం అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంత కడుపు మండి మున్సిపల్ అధికారులకు చేరేలా చేశాడు. ఈ సందర్భంగా తాను వీడియోను పోలీసులకు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు భార్గవ జోషి. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై అహ్మదాబాద్ పురపాలక శాఖ స్పందించింది. మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు రెస్టారెంట్ అవుట్ లెట్‌కు సీల్ వేశారు. కూల్ డ్రింకు శాంపిల్స్ ను పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌కి పంపించినట్టు వెల్లడించారు. Here is video of this incidents happens with me...@McDonalds pic.twitter.com/UiUsaqjVn0 — Bhargav joshi (@Bhargav21001250) May 21, 2022 -
మెక్‌డొనాల్డ్స్‌కు వార్నింగ్ నోటీసు
ముంబై : మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లు తీవ్ర వివాదంలో కూరుకుపోతున్నాయి. ఓ వైపు కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్ఎల్) 50:50 జాయింట్ వెంచర్ విక్రమ్ బక్షితో వివాదం, మరోవైపు ఆ రెస్టారెంట్లలో ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘన మెక్‌డొనాల్డ్స్‌ను ఇరకాటంలో పడేస్తున్నాయి. తాజాగా ముంబైలోని సెంట్రల్ రీజన్లో గల మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌పై స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) జరిపిన అకస్మిక దాడిలో, ఆ అవుట్లెట్ ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని తేలింది. అకస్మాత్తుగా జరిపిన తనిఖీలో హైస్ట్రీట్ ఫీనిక్స్‌లోని మెక్ డొనాల్డ్స్ అవుట్లెట్ ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని ఉల్లంఘించిందని తేలిందని ఎఫ్‌డీఏ రిపోర్టు చేసింది. అనారోగ్య పరిస్థితుల్లో ఆహారాన్ని వండుతున్నారని, తమ లైసెన్సు కాఫీని కూడా ప్రాముఖ్యంగా చూపించడం లేదని పేర్కొంది. ఈ రెస్టారెంట్ చైన్‌కు ప్రస్తుతం వార్నింగ్ నోటీసు జారీచేశామని, ఒకవేళ పరిస్థితులు మెరుగుపడకపోతే, వచ్చే 15 రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సౌత్, వెస్ట్ రాష్ట్రాల్లో మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజీని హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాయి. వారు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎఫ్‌డీఏ నుంచి కొన్ని ప్రశ్నలను ఎదుర్కొన్నామని, వాటికి సమాధానాలను కూడా ఎఫ్‌డీఏకి సమర్పించామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. -
న్యూజిలాండ్‌లో దాడికి గురైన భారతీయుడి మృతి
మెల్బోర్న్: న్యూజిలాండ్‌లో దాడికి గురైన భారతీయుడు తరుణ్ ఆస్థానా(25) మృతి చెందారు. ఆక్లాండ్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన ఆదివారం ఉదయం ప్రాణాలు వదిలారు. తరుణ్ చనిపోయినప్పడు ఆయన కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. ట్రయినీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తరుణ్‌పై శనివారం సెంట్రల్ ఆక్లాండ్‌లోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ వద్ద దాడి జరిగింది. నైట్ క్లబ్ నుంచి స్నేహితులతో తిరిగివస్తుండగా ఆయనపై మాక్ ఫార్లాండ్(27) దాడికి పాల్పడ్డాడు. ఓ మహిళ దుస్తులపై కామెంట్ చేశాడన్న అక్కసుతోనే అతడీ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఆక్లాండ్ డిస్ట్రిక్ కోర్టులో హాజరుపరిచారు. అతడికి ఈనెల15 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా తమకు అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.