చెట్టెక్కి కూర్చున్న టొమాటో ధర సామాన్య ప్రజల్నే కాదు.. కార్పొరేట్ ఫుడ్ చైన్‌లను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ కి టొమాటో మంట సెగ బాగా తగిలింది. టొమాటో ధర ఆకాశాన్నంటడంతో సాధారణ జనం టొమాటో లేకుండానే కాలం గడిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు రెస్టారెంట్లు కూడా టొమాటో లేకుండానే వంటకాలను వడ్డించేందుకు సిద్ధమైపోతున్నాయి. (నిమిషాల్లో రూ.500 కోట్లు: ప్రముఖ ఇన్వెస్టర్‌కి కలిసొచ్చిన అదృష్టం, కారణం!)
రికార్డు స్థాయికి చేరిన ధరల సెగతో మెక్‌డొనాల్డ్స్ మెనూ నుంచిటొమాటోను తొలగించేసింది. పెరిగిన ధరలు, సరఫరా లేకపోవడంతో టొమాటో లేకుండానే బర్గర్‌లు, పిజ్జాలాంటి వాటిని సరఫరా చేస్తోంది. తమ నాణ్యతా ప్రమాణాలకు తగినసరఫరా లేకపోవడమే కారణమంటూ నోటీసులు అంటించడం ఇపుడు హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(World Richest Beggar Bharat Jain: వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?)
ఎంత ప్రయత్నించినా ప్రపంచ స్థాయిలో ఉండే నాణ్యతా ప్రమాణాలకు తగిన టొమాటో దొరకడం లేదు. అందుకే కొన్నాళ్లు టొమాటో లేని ఆహార ఉత్పత్తులను అందించాల్సి వస్తోంది. దిగుమతికీ కష్టపడుతున్నాం' అంటూ ఢిల్లీని కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లలో నోటీసులు అతికించింది. సప్లయ్ చెయిన్‌లో నాణ్యమైన సమస్యలే కాకుండా,ధరల సమస్య కూడా తలెత్తిందని నిర్వాహకులు తెలిపారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?)
కాగా వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలతో దేశంలో టొమాటో దిగుబడి బాగా పడిపోయింది. ఫలితంగా అనేక నగరాల్లో కిలో టొమాటో రూ. 100 నుంచి 200వరకు పలుకుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు టొమాటాల కొరత కారణంగా ప్రత్యామ్నాయాల్ని వాడటమని సూచనలు, ప్రకటనలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా “టొమాటో ధరలు పెరుగుతున్నాయా? బదులుగా టొమాటోప్యూరీ వాడుకోండి” అంటూ టాటా బిగ్‌బాస్కెట్ షాపింగ్ యాప్ ప్రకటనను విశేషంగా నిలుస్తోంది. గతంలో ఉల్లిపాయ ధరలు కూడా బాగా పెరిగినపుడు ఉల్లికి బదులుగా క్యాబేజీని వాడిన వైనాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment