వాషింగ్టన్: పలు కేసుల్లో దోషిగా తేలడంతో ఆ నిందితుడికి 123 ఏళ్ల జైలుశిక్ష విధించారు. కానీ ఆ మరుసటిరోజే జైళ్లో ఆ నిందితుడు తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంది. జార్జ్ జాన్సన్(28) అదివరకే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో గత అక్టోబర్ లో పోలీసులు జాన్సన్ ను అదుపులోకి తీసుకునేందుకు చూడగా మొదట ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి ఆపై ఓ ఆఫీసులో (బర్గర్ కింగ్)కి ప్రవేశించాడు.
ముగ్గురు ఉద్యోగులు సహా ఓ ఏడేళ్ల బాలికను తుపాకీతో బెదిరించాడు. ఎంతగానో వేడుకోగా రెండు గంటల తర్వాత ఇద్దరు ఉద్యోగులను వదిలిపెట్టాడు జాన్సన్. దాదాపు ఐదునున్న గంటల పాడు ఓ ఉద్యోగి, బాలిక అతడి నిర్బంధంలోనే ఉండిపోయారు. చివరికి ఎలాగోలా పోలీసులు జాన్సన్ ను అదుపులోకి తీసుకున్నారు. 2016లో ఆటోమేటిక్ హ్యాండ్ గన్ తో కొన్ని గంటలపాటు కాల్పులకు పాల్పడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో దోషిగా తేల్చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే కొన్ని రోజుల ముందు ఓ యువతిపై అత్యాచారం జరిపిన కేసుకుగానూ జాన్సన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జాన్సన్ పై నమోదైన పలు కేసుల్లో దోషిగా తేలడంతో మేజిస్ట్రేట్ నిందితుడికి 123 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. ఆపై కొన్ని గంటల తర్వాత జైలు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment