inmate
-
ఖైదీ కడుపులో సూసైడ్ నోట్!
ముంబై : ఆత్మహత్య చేసుకున్న ఖైదీ కడుపులో సూసైడ్ నోట్ లభించిన ఘటన మహారాష్ట్ర నాసిక్ సెంట్రల్ జైలులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రకు చెందిన అస్గర్ మన్సూరీ హత్యా నేరంతో నాషిక్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మరి కొన్ని నెలల్లో శిక్షా కాలం పూర్తయి విడుదల కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7న జైలు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అస్గర్ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించగా.. అతడి కడుపులో ఓ సూసైడ్ నోట్ బయటపడింది. పాలిథిన్ కవర్లో చుట్టిన ఆ సూసైడ్ నోట్లో తన చావుకు గల కారణాలను వివరించాడు అస్గర్. ( ఆ ఘటన మా కుటుంబానికి తీరని లోటు ) జైలు సిబ్బంది వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నోట్లో పేర్కొన్నాడు. కొద్దిరోజుల క్రితం జైలు నుంచి విడుదలైన మరి కొంతమంది ఖైదీలు సైతం జైలు సిబ్బంది వేధింపులపై అధికారులు, ముంబై హైకోర్టుకు లేఖ రాశారు. ఈ సంఘటనపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. చదవటం, రాయటం రాని అస్గర్ వేరే వ్యక్తి సహాయంతో ఆ సూసైడ్ నోట్ రాయించుకుని ఉంటాడని భావిస్తున్నారు. -
చంద్రబాబు దీక్ష మోసపూరితం
అమరాపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దీక్ష మోసపూరితమని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అభివర్ణించారు. అమరాపురంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు డాక్టర్లను దగ్గర పెట్టుకుని ఏసీల్లో దీక్ష చేయడం రాష్ట్ర ప్రజలు గమనించారన్నారు. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకుని మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కపట నాటకాన్ని ప్రదర్శిస్తున్నాడన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్ష చేయడానికి రూ.70కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. జాతీయ ప్రాజెక్ట్ పోలవరంను తానే కడతానని రూ.16వేల కోట్ల ప్రాజెక్టును రూ.58,750 కోట్లకు పెంచి నిధులను కొల్లగొట్టి వాటితో 2019 ఎన్నికల్లో ప్రజలను ప్రలోభపెట్టడానికి పూనుకున్నాడని, దీన్ని కేంద్రం పసిగట్టి నిధులివ్వక పోవడంతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్యెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చారని విమర్శించారు. అమరాపురంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఓ టీడీపీ ప్రజాప్రతినిధి స్థానిక చెరువులోని మట్టిని ఇసుకగా మార్చి బెంగళూరుకు తరలించి రూ.లక్షలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వాగేష్, నాయకులు యంజేరప్ప, త్రిలోక్‌నాథ్, హనుమంతరాయుడు, మారుతి, మోహన్, ఇషాక్, తిప్పేస్వామి, శ్రీనివాస్, దివాకర్, మంజునాథ్, నాగరాజు, దానేగౌడ, హిదయతుల్లా, జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి మంజునాథ్ తదితరులు ఉన్నారు. -
123 ఏళ్ల జైలుశిక్ష.. అంతలోనే ఆత్మహత్య!
వాషింగ్టన్: పలు కేసుల్లో దోషిగా తేలడంతో ఆ నిందితుడికి 123 ఏళ్ల జైలుశిక్ష విధించారు. కానీ ఆ మరుసటిరోజే జైళ్లో ఆ నిందితుడు తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంది. జార్జ్ జాన్సన్(28) అదివరకే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో గత అక్టోబర్ లో పోలీసులు జాన్సన్ ను అదుపులోకి తీసుకునేందుకు చూడగా మొదట ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి ఆపై ఓ ఆఫీసులో (బర్గర్ కింగ్)కి ప్రవేశించాడు. ముగ్గురు ఉద్యోగులు సహా ఓ ఏడేళ్ల బాలికను తుపాకీతో బెదిరించాడు. ఎంతగానో వేడుకోగా రెండు గంటల తర్వాత ఇద్దరు ఉద్యోగులను వదిలిపెట్టాడు జాన్సన్. దాదాపు ఐదునున్న గంటల పాడు ఓ ఉద్యోగి, బాలిక అతడి నిర్బంధంలోనే ఉండిపోయారు. చివరికి ఎలాగోలా పోలీసులు జాన్సన్ ను అదుపులోకి తీసుకున్నారు. 2016లో ఆటోమేటిక్ హ్యాండ్ గన్ తో కొన్ని గంటలపాటు కాల్పులకు పాల్పడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో దోషిగా తేల్చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే కొన్ని రోజుల ముందు ఓ యువతిపై అత్యాచారం జరిపిన కేసుకుగానూ జాన్సన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జాన్సన్ పై నమోదైన పలు కేసుల్లో దోషిగా తేలడంతో మేజిస్ట్రేట్ నిందితుడికి 123 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. ఆపై కొన్ని గంటల తర్వాత జైలు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. -
వెంకటేశ్ మృతి కేసులో ఎస్పీకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా సీసీఎస్ పోలీసులు తన భర్త కడమంచి వెంకటేశ్‌ను హత్య చేశారని కె.రేణుక అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌తో ఆ జిల్లా ఎస్పీ, వైద్యాధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జిల్లా సీసీఎస్ పోలీసులు విచారణ పేరుతో రిమాండ్ ఖైదీ వెంకటేశ్‌ను వేధింపులకు గురిచేసి హత్య చేశారని రేణుకతోపాటు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ విచారించారు. మృతుడిపై పోలీసులు నమోదు చేసిన కేసుతోపాటు, అనుమానాస్పద మృతిపై సీఆర్పీసీలోని సెక్షన్ 174 కింద పెట్టిన కేసుల రికార్డుల్ని సీల్డు కవర్లో తమకు నివేదించాలని జిల్లా ఎస్పీని న్యా యమూర్తి ఆదేశించారు. పోస్టుమార్టం, ఇతర వైద్య నివేదికలు అందజేయాలని జిల్లా వైద్యాధికారి, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్లను కూడా ఆదేశించారు. తన భర్త మృతికి కారణమైన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని, మృతదేహానికి తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ కేసును సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తి తదుపరి విచారణ 20కి వాయిదా వేశారు. -
చర్లపల్లి జైలు నుంచి ఖైదీ పరారీ
హైదరాబాద్: చర్లపల్లి ఓపెన్ జైలు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. ఆ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయం జైలు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జైలులోని ఖైదీల సంఖ్య 104 కి బదులు 103 మందే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఆ వెంటనే రంగంలోకి దిగిన జైలు ఉన్నతాధికారులు పరారైన ఖైదీని గుర్తించారు. మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మంచాపూర్ గ్రామానికి చెందిన గోవర్దన్గా పోలీసులు గుర్తించారు. అతడి కోసం జైలు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ అంశాన్ని జైలు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పరారైన గోవర్దన్ చర్లపల్లి జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడని సమాచారం. -
బాత్రూమ్లో దాక్కున్న ఖైదీ!
మంగళూరు జైలును పరిశీలించిన కమల్‌పంత్ బెంగళూరు: మంగళూరులోని కారాగారంలో సోమవారం ఉదయం కొంతమంది ఖైదీల మధ్య ఘర్షణ జరిగిన అనంతరం కనిపించకుండా పోయిన ఖైదీ ఒకరు మంగళవారం ఉదయం జైలులోని ఓ బాత్రూమ్లో కనిపించాడు. వివరాలు....దొంగతనం చేసిన కేసులో బషీర్ అహ్మద్ అనే వ్యక్తి మంగళూరు కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మంగళూరులోని కారాగారంలో సోమవారం ఉదయం ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ సమయంలో మడూరు యూసఫ్ హత్యను, అక్కడి వాతావరణాన్ని చూసి భయపడిపోయిన బషీర్ అహ్మద్ జైలులోని ఓ బాత్రూమ్లోకి వెళ్లి దాక్కున్నాడు. ఘర్షణ అనంతరం జైలులోని ఖైదీల గదులను పరిశీలించిన జైలు సిబ్బంది బషీర్ అహ్మద్ కనిపించక పోవడంతో అతను తప్పించుకొని వెళ్లి ఉండవచ్చని భావించారు. ఇదే విషయాన్ని అధికారులకు కూడా తెలియజేశారు. కాగా, మంగళవారం ఉదయం జైళ్ల శాఖ ఏడీజీపీ కమల్‌పంత్ మంగళూరులోని కారాగారాన్ని పరిశీలిస్తున్న సమయంలో బషీర్ అహ్మద్ జైలులోని ఓ బాత్రూమ్లో ఉండిపోయిన విషయాన్ని గుర్తించారు. జైలులో జరిగిన ఘర్షణను చూసి భయపడి బషీర్ అహ్మద్ బాత్రూమ్లో దాక్కున్నాడని అధికారులు చెబుతున్నారు. కాగా, మంగళూరులోని కారాగారాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళూరు కారాగారంలో జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. ఇదే సందర్భంలో మంగళూరు నగర పోలీసులు సైతం ఈ విషయమై విచారణ చేపట్టారని, రెండు నివేదికలను పరిశీలించిన అనంతరం ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాఖాపరమైన విచారణాధికారిగా మైసూరు సెంట్రల్ జైలు సూపరింటిండెంట్ ఆనందరెడ్డిని నియమించినట్లు కమల్‌పంత్ వెల్లడించారు. సిబ్బంది నిర్లక్ష్యమే ఘటనకు కారణమని తెలిస్తే మంగళూరు జైలు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ
మెదక్ : మెదక్ జిల్లా సంగారెడ్డి జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న యాదగిరి తప్పించుకుని పరారైయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఎప్పటిలాగే పోలీసు పహారాలో యాదగిరి జైల్లో గార్డెనింగ్ పనులు చేస్తున్నాడు. ఆ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి యాదగిరి జైలు నుంచి పరారైయ్యాడు. ఆ విషయాన్ని ఆలస్యంగా పోలీసులు గుర్తించారు. ఇంతలో తేరుకున్న పోలీసులు అతడి కోసం గాలించిన ప్రయోజనం లేకుండా పోయింది. యాదగిరి పరారైపై జైలు సిబ్బంది.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు... జైలు సిబ్బందిపై మండిపడ్డారు. అలాగే ఈ ఘటనపై జైలు అధికారుల నుంచి ఉన్నతాధికారులు వివరణ కోరారు. 10 మంది మహిళల హత్య కేసులో యాదగిరి సంగారెడ్డి జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడని జైలు అధికారులు వెల్లడించారు. -
కడప సెంట్రల్ జైల్లో ఖైదీ ఆత్మహత్య
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న తోట క్రిష్ణమూర్తి (37) అనే ఖైదీ మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన క్రిష్ణమూర్తి ఓ హత్య కేసులో కొంత కాలంగా అదే జిల్లా జైలులో రిమాండ్‌లో ఉండగా.. నాలుగు రోజుల క్రితం అతనికి జీవిత ఖైదు పడడంతో కడప కేంద్ర కారాగారానికి తీసుకు వచ్చారు. మంగళవారం కేంద్ర కారాగారంలో ఓ పైపునకు లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కడప ఆర్డీవో చిన్నరాముడు ఇతర అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, మనస్థాపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. -
పోలీసులకు మస్కా కొట్టి ఖైదీ పరారీ
నాగారం: కోర్టు నుంచి తిరిగి వస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా సెంట్రల్ జైలు సమీపంలో ఎస్కార్ట్ పోలీసులకు మస్కా కొట్టి గురువారం అర్ధరాత్రి సమయంలో విచారణ ఖైదీ సునీల్ పరారయ్యాడు. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై... అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న సునీల్‌ను విచారణ నిమిత్తం గురువారం అనంతపురం కోర్టుకు తరలించారు. కేసు వాయిదా పడటంతో సునీల్‌ను మళ్లీ కడపకు తరలించారు. ఆ క్రమంలో పోలీసుల వాహనం కడప సెంట్రల్ జైలు సమీపంలోకి చేరుకోగానే సునీల్ పోలీసులను మాటల్లోకి దింపి మస్కా కొట్టి అక్కడి నుంచి పరారైయ్యాడు. ఆ ఊహించని పరిణామంతో పోలీసులు హతాశులయ్యారు. వెంటనే తేరుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సునీల్ స్వస్థలం ప్రొద్దుటూరు అని పోలీసులు తెలిపారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు అపహరణ కేసుల్లో సునీల్ ముఠాపై వివిధ కేసులు నమోదు అయినాయి. -
నా భార్యను వార్డర్ వేధిస్తున్నాడు: ఖైదీ ఫిర్యాదు
హైదరాబాద్: చర్లపల్లి జైలు వార్డర్ తన భార్యకు తరచుగా ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ ఓ ఖైదీ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... రాములు అనే ఖైదీ చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని చూసేందుకు అతడి భార్య తరచుగా జైలుకు వచ్చేది. ఆ క్రమంలో జైలు వార్డర్ వెంకన్న ఆమె నుంచి సెల్ ఫోన్ నెంబరు తీసుకున్నాడు. అప్పటి నుంచి తరచుగా ఖైదీ రాములు భార్యకు ఫోన్ చేసి వేధించేవాడు. ఆ విషయాన్ని భర్త రాములకు తెలిపింది. దీంతో రాములు జైలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించ లేదు. దీంతో వార్డర్ వెంకన్న... రాముల భార్యపై వేధింపులు మరింత పెరిగాయి. ఆ విషయాన్ని రాములకు వెల్లడించింది. దీంతో రాములు కూషాయిగూడ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.