కడప అర్బన్: కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న తోట క్రిష్ణమూర్తి (37) అనే ఖైదీ మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన క్రిష్ణమూర్తి ఓ హత్య కేసులో కొంత కాలంగా అదే జిల్లా జైలులో రిమాండ్‌లో ఉండగా.. నాలుగు రోజుల క్రితం అతనికి జీవిత ఖైదు పడడంతో కడప కేంద్ర కారాగారానికి తీసుకు వచ్చారు.
మంగళవారం కేంద్ర కారాగారంలో ఓ పైపునకు లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కడప ఆర్డీవో చిన్నరాముడు ఇతర అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, మనస్థాపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.
కడప సెంట్రల్ జైల్లో ఖైదీ ఆత్మహత్య
Published Tue, May 5 2015 11:41 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement