kadapa central jail
-
యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిన యావజ్జీవ ఖైదీ
-
కడప జైలుకు పుంగనూరు నిందితులు
సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు) సహా 67 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులకు పుంగనూరు కోర్టు రిమాండ్ విధించింది. పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డితో పాటు.. 66 మంది నిందితులను కోర్టు ఆదేశాలతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా, ఆగస్ట్ 4వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు అన్నమయ్య జిల్లాలోని అంగళ్లులో, చిత్తూరు జిల్లా పుంగనూరులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. అప్పటికే పన్నిన పక్కా కుట్రతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, కిరాయి మూకలు రాళ్లు, కట్టెలతో దాడి చేసి సుమారు 47 మంది పోలీసులను గాయపరిచారు. రెండు పోలీస్ వాహనాలను తగలబెట్టారు. రణధీర్ అనే కానిస్టేబుల్ కంటి చూపు కోల్పోయాడు. ఈ విధ్వంసానికి సంబంధించి ఇప్పటివరకు 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు చల్లా బాబు సహా నిందితులంతా పారిపోగా.. పోలీసులు ఇప్పటికే 110 మందిని అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో... టీడీపీ నేత చల్లా బాబును అదుపులోకి తీసుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చల్లా బాబు తన సెల్‌ఫోన్ పడేసి.. కొత్త ఫోన్ తీసుకున్నాడు. సిమ్‌కార్డులు మార్చేస్తూ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తిరిగినట్లు తెలిసింది. ఎన్నిసార్లు మకాం మార్చేసినా పోలీసులు సమీపిస్తుండటంతో చల్లా బాబుతో పాటు టీడీపీ మూకల్లో ఆందోళన తలెత్తింది. చదవండి: నరం లేని నాలుక.. సీపీఐ మరీ దయనీయంగా.. ఈ నేపథ్యంలో తనపై నమోదైన 7 కేసుల్లో బెయిల్ కోరుతూ చల్లా బాబు హైకోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం మూడు కేసుల్లో బెయిల్ నిరాకరించింది. ఇక తిరగలేక, తప్పించుకోలేక చల్లా బాబు సహా 67 మంది నిందితులు సోమవారం పుంగనూరు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. వారికి మద్దతుగా టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, దొరబాబు, సుగుణమ్మ తదితరులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొద్దిసేపు పోలీస్‌స్టేషన్ వద్ద నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. కాగా, ఆదివారం రాత్రి పుంగనూరుకు చెందిన సద్దామ్ హుస్సేన్, ఇమ్రాన్, ఫయాజ్, షామీర్, నూరుల్లాను రిమాండ్‌కు పంపించారు. పూచీకత్తు సమర్పించిన దేవినేని ఉమా మదనపల్లె: అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో బెయిల్ పొందిన టీడీపీ నేత దేవినేని ఉమా సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో రూ.2 లక్షల బాండ్, ఇద్దరు జామీనుదారులను పూచీకత్తుగా సమర్పించారు. -
కారాగారం కాదు.. కర్మాగారం
కడప సెంట్రల్ జైలు ఎంతో మంది ఖైదీలకు క్రమశిక్షణ.. కొత్తజీవితం.. మంచి నడవడిక నేర్పిస్తున్న స్థలం. ఖైదీలు ఇక్కడ నేర్చుకున్న వృత్తులు.. విడుదలయ్యాక వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నాయి. సెంట్రల్ జైలు కారాగారంలా కాకుండా కర్మాగారంగా విలసిల్లుతోంది. ఉత్పత్తుల కేంద్రంగా మారింది. ఖైదీలు తినుబండారాలు, సబ్బులు, ఫర్నీచర్ తయారు చేస్తున్నారు. సిమెంట్, ఇటుకలు సైతం ఉత్పత్తి చేస్తున్నారు. పాలడెయిరీ, 24గంటలపాటు పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారూ ఉన్నారు. కడప అర్బన్: సమాజంలో జీవిస్తున్న ప్రజల్లో కొందరు క్షణికావేశంతోనో, పరిస్థితుల ప్రభావంతోనో నేరాలకు పాల్పడి నేరతీవ్రతను బట్టి శిక్ష అనుభవిస్తున్నారు. మరికొందరు నేరాలకు పాల్పడకపోయినా చట్టం దృష్టిలో నేరస్తుడిగా రుజువు కావడంతో శిక్షలు అనుభవిస్తున్నవారు లేకపోలేదు.యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీ నుంచి మూడేళ్లు జైలు జీవితం గడిపే వారి వరకు కుటుంబాలపై ధ్యాస వెళ్లకుండా తమ వంతు కష్టపడి కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం శిక్ష పడ్డ ఖైదీలు బీరువాలు, పాఠశాల బెంచీలు తదితర వస్తువులు తయారు చేస్తారు. వీటిని ప్రభుత్వ కార్యాలయాలకు, హాస్టళ్లకు, ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారు. పెంట్రోల్ బంకు నిర్వహణ ద్వారా రోజుకు రూ.3లక్షల నుంచి రూ. 5లక్షల వరకు వ్యాపారం జరగుతుంది. ►కడప కేంద్రకారాగారంలో మూడేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు పడిన ఖైదీలకు వివిధ కేటగిరీల్లో శిక్షణ ఇస్తున్నారు.దీనిని సద్వినియోగం చేసుకుని జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ శిక్షపడిన ఖైదీలు 479 మంది, రిమాండ్‌లో ఉన్న వారు 163 మంది ఉన్నారు. వీరుగాక పీడీ యాక్ట్ కింద 36 మంది ఖైదీలు ఉన్నారు. ► ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తున్న వారందరికీ తాము పనిచేసిన కాలాన్ని బట్టి నిబంధనల మేరకు వేతనం, ప్రశంసాపత్రాలు, గుర్తింపునకు సంబంధించిన సర్టిఫికెట్లను అందజేస్తారు. శిక్షణ పూర్తి చేసుకుని వెళ్లిన తరువాత వారికి సమాజంలో తమకు పనిచేసుకునే వీలుగా ఈ సర్టిఫికెట్లు పంపిణి చేస్తారు. వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. ► కోవిడ్–19 సమయంలో మాస్క్‌లను తయారీ చేయడంలో ఖైదీలు కీలకపాత్ర పోషించారు. ► విద్యాభివృద్ధిలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో చదువుకుని డిగ్రీలు, పీజీలు చేసిన వారు ఉన్నారు. యుగంధర్ అనే జీవిత ఖైదీ డిగ్రీ పూర్తి చేయడంతో పాటు, పీజీని సాధించగలిగారు. ఖైదీల సంక్షేమం కోసం కృషి కేంద్రకారాగారంలో శిక్షను అనుభవిస్తున్న వారందరికి ఏదో ఒకపనిమీద ధ్యాస కలిగేలా శిక్షణను ఇప్పిస్తున్నాం.వీరిలో సత్ప్రవర్తన ద్వారా త్వరగా విడుదలయ్యేందుకు కూడా ఈ శిక్షణలు దోహదపడతాయి. ప్రతి జీవిత ఖైదీకి ఈ శిక్షణ ద్వారా మంచి విద్యతో పాటు విజ్ఞానం పెంపొందించుకునే అవకాశం ఏర్పడింది. వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం – ఐ.ఎన్.హెచ్ ప్రకాష్, సూపరింటెండెంట్, కడప కేంద్ర కారాగారం -
సునీల్‌కుమార్ యాదవ్‌కు 14 రోజుల రిమాండ్
కడప అర్బన్ / పులివెందుల రూరల్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అనుమానితుడిగా నిర్ధారించిన సునీల్ కుమార్ యాదవ్‌కు పులివెందులలోని మొదటి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. సీబీఐ అధికారుల బృందం బుధవారం ఉదయం కడప రిమ్స్‌లో ఇతనికి కోవిడ్ టెస్ట్ చేయించిన తర్వాత పులివెందుల కోర్టులో మధ్యాహ్నం 2:55 గంటలకు హాజరు పరిచారు. సాయంత్రం 6:15 గంటలకు మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించడంతో అక్కడి నుంచి కడప కేంద్ర కారాగారానికి తీసుకెళ్లి అక్కడి అధికారులకు అప్పగించారు. సునీల్ కుమార్ యాదవ్‌ను విచారించేందుకు 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అంతకు ముందు సీబీఐ వారు అదే మేజిస్ట్రేట్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజే (బుధవారం) రిమాండ్‌కు విధించినందున, ఇదే రోజు కస్టడీకి ఇవ్వలేమని కోర్టు పేర్కొంది. కాగా, ఈ హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా సీబీఐ తమ కుటుంబాన్ని వేధిస్తోందని గత నెలలో సునీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత ఇతను అజ్ఞాతంలోకి వెళ్లగా.. గోవాలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మాకు ప్రాణహాని ఉంది.. సునీల్ కుమార్ యాదవ్‌ను పులివెందుల కోర్టులో హాజరు పరుస్తున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రమ్మ, భార్య లక్ష్మి, సోదరుడు కిరణ్‌కుమార్ యాదవ్‌లు అతన్ని కలిసేందుకు వచ్చారు. యాదవ్.. కారులో ఉండగా, కోర్టు ఆవరణలోని గదిలో అతనితో మాట్లాడారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘ఈ హత్య కేసులో మాకు ఏమీ సంబంధం లేకపోయినా అనవసరంగా ఇరికించారు. పదేపదే పిలిపించి విచారిస్తున్నారు. మేము ఊరు విడిచి వెళ్లాం. మాకు ప్రాణ భయం కూడా ఉంది. సునీల్‌ను అనవసరంగా అరెస్ట్ చేశారు’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పాల వ్యాపారి ఉమాశంకర్‌రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. సీబీఐ బృందం యాదవ్ రిమాండ్ వ్యవహారంలో బిజీగా ఉండటంతో వారు వెనుదిరిగి వెళ్లారు. -
జేసీని విచారించిన పోలీసులు
అనంతపురం క్రైం/కడప అర్బన్: అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని అనంతపురం జిల్లా పోలీసులు విచారించారు. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న జేసీని ఆదివారం ఉదయం కస్టడీలోకి తీసుకుని అనంతపురం త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు 4 గంటల పాటు జేసీని విచారించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి, కడప కేంద్ర కారాగారానికి తిరిగి తరలించారు. ఈ నెల 6న విధుల్లో ఉన్న దళిత పోలీసు అధికారిని దూషించినందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. -
దురుసు ప్రవర్తన, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్
సాక్షి, అనంతపురం: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వైద్య పరీక్షల కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డిని జీజీహెచ్‌కు తరలించారు. కాసేపట్లో గుత్తి కోర్టులో ఆయనను హాజరుపర్చనున్నారు. కాగా, వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి కండీషన్ బెయిల్‌పై గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, జేసీ విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద ఆయన వర్గీయులు నానా హంగామా చేస్తూ కోవిడ్ నిబంధనలు కాలరాశారు. దీంతో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, పవన్‌కుమార్ సహా 31 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: విడుదలైన 24 గంటల్లోపే జేసీపై మరో కేసు) మరోవైపు జేసీ, అస్మిత్‌లు కడప సెంట్రల్ జైలు నుంచి తాడిపత్రి వరకు అనుచరగణంతో ర్యాలీగా వచ్చారు. ఈ క్రమంలో జేసీ దళిత సీఐ దేవేంద్రను పబ్లిక్‌గా బెదిరించారు. దీంతో సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కడప నుంచి తాడిపత్రి వరకు లాక్డౌన్ నిబంధనలు జేసీ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 506, 189, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. వీటితోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ 52 కింద కూడా జేసీపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ('పోలీసులంటే జేసీ బ్రదర్స్ కు ఎందుకంత చులకన') -
కడప జైలులో దేశంలోనే తొలిసారిగా..
సాక్షి, వైస్సార్ కడప: రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఉన్నత ఆశయంతో పనిచేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. జైళ్లలో ఖైదీలకు సన్న బియ్యం కావాలని అడుగుతున్నారని, ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామమని చెప్పారు. కడప కారాగారంలో స్కిల్ డెవవలప్‌మెంట్ సెంటర్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. (చదవండి : చంద్రబాబు తీరుపై పోలీసుల సంఘం ఆగ్రహం) డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాస్, కలెక్టర్ హరి కిరణ్, జైళ్ల డీజీ మొహమ్మద్ అషన్ రజా, ఎస్పీ అన్బురాజన్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారుచేసిన వివిధ రకాల వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను హోంమంత్రి పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘4 కోట్ల 70 లక్షల రూపాయలతో మోడ్రన్ స్కిల్ డెవలప్మెంట్ యూనిట్‌కు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ స్విట్జర్లాండ్‌లో మాత్రమే ఉంది. దేశంలోనే మొదటిసారిగా కడప జైలులో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టాం. జైలులో ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తూ.. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తాం. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బయటకు వెళ్లిన తరవాత స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉన్నత జీవితం గడపాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. (చదవండి: ఇద్దరు కుమార్తెలతో బావిలో దూకి తండ్రి ఆత్మహత్య) ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులు బహిరంగ మార్కెట్లోని వస్తువులతో పోటీ పడుతున్నాయి. జైళ్లలో నాణ్యతతో కూడిన వస్తువులు తయారు చేస్తున్నారన్న గుర్తింపు వచ్చింది. కడప జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌లో క్వాలిటీ పెట్రోల్ లభిస్తోందని చెబుతున్నారు. జైలులో ఇప్పటికే డైరీ యూనిట్, బ్రిక్స్ తయారీ, ఫినాయిల్, సోప్, డిటర్జెంట్స్, బేకరీ ఫుడ్ ఐటమ్స్, టైలరింగ్, అగరబత్తీలు తయారు చేస్తున్నారు’అని హోంమంత్రి పేర్కొన్నారు. -
మళ్ళీ తప్పించుకున్నాడు..!
-
చెవిరెడ్డికి రిమాండ్, కడప జైలుకు తరలింపు
-
చెవిరెడ్డికి రిమాండ్, కడప జైలుకు తరలింపు
చిత్తూరు : సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా 2013లో రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఎన్నికల నియామావళి ఉల్లంఘనగా పరిగణించి అప్పట్లో పోలీసులు చెవిరెడ్డిపై కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం పోలీసులు గురువారం చెవిరెడ్డిని అరెస్ట్ చేసి వడమాలపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న ఆయనను పుత్తూరు కోర్టులో హాజరు పరచగా, 15 రోజులు రిమాండ్ విధించింది. అయితే బెయిల్‌పై ఈ రోజు ఉదయం చిత్తూరు సబ్ జైలు నుంచి విడుదల అయిన చెవిరెడ్డిని వెంటనే ఎంఆర్ పల్లి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. -
అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్ల అరెస్టు
► నిందితుల్లో ఏఆర్ కానిస్టేబుల్, ఇద్దరు మైనర్లు ► రూ.23 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చిత్తూరు (అర్బన్): చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠాను మదనపల్లె పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో ఐదుగురు ఉన్నారు. వీరిలో ఒక ఏఆర్ కానిస్టేబుల్, ఇద్దరు మైనర్ బాలలు ఉన్నారు. శనివారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. మదనపల్లె శివారులో శుక్రవారం వాహనాల తనిఖీల్లో అనంతపురం జిల్లా నల్లమాడ మండలం, వేలమద్దికి చెందిన రాచంపల్లె శ్రీనివాసులు అలియాస్ మంగళ శీన అలియాస్ వాసు (34), రాప్తాడు మండలం అయ్యవారిపల్లెకు చెందిన గోరవ ఎర్రిస్వామి (24), కడపలోని మర్యపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మోల్‌ల జోహన్నస్ (50)తో పాటు ఇద్దరు మైనర్ బాలల్ని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠాలో ప్రధా న నిందితుడు మంగళ శీన 2002 నుంచి రాయలసీమ, బెంగళూరులోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్టు తెలిపారు. ఇతనిపై వందకు పైగా కేసులు ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లో పలు అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పాత కేసుల్లో అరెస్టయిన శీన గత ఏడాది జూన్‌లో కడప సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడని పేర్కొన్నారు. అనంతరం నలుగురు వ్యక్తుల్ని ఎంచుకుని చైన్‌స్నాచింగ్ చేయడం ప్రారంభించాడన్నారు. కడపకు చెంది న ఆర్ముడు రిజర్వుకానిస్టేబుల్ మోల్‌ల జోహన్నస్ గతంలో శ్రీని వాసులు అనే దొంగతో కలిసి పలు చోరీలు చేయించిన అనుభవం ఉండడంతో ఇతన్ని ముఠాలో చేర్చుకున్నాడని తెలిపా రు. జోహన్నస్ మూడుసార్లు విధుల నుంచి సస్పెండ్ అయ్యాడని వెల్లడించారు. కడపలో ఇతనిపై పలు కేసులు ఉండడంతో గత ఏడాది జూన్ నుంచి సస్పెన్షన్‌లో ఉన్నాడని తెలిపారు. ఒంటరి మహిళలలే లక్ష్యం ఒంటరిగాా ఉన్న మహిళలు, తెల్లవారు జామున కల్లాపు చల్లే మహిళలు, చీకటి పడ్డాక వాకింగ్ చేసే మహిళల్ని ఎంచుకుని మంగళ శీన ఆభరణాలను లాక్కెళ్లిపోతాడని తెలిపారు. వెంటనే ద్విచక్రవాహనాన్ని బస్టాండు, జన సంచార ప్రదేశాల్లో పార్కింగ్ చేసి, ఇండికా కారులో పారిపోయేవాడని పేర్కొన్నారు. బైకును ఇద్దరు మైనర్ బాలలు తీసుకురావడం, చోరీల్లో పాలు పంచుకోవడం చేసేవారని చెప్పారు. చోరీ చేసిన మంగళసూత్రాలు, బంగారు గొలుసుల్ని కానిస్టేబుల్ ఇతర ప్రాంతాలను తీసుకెళ్లి అమ్ముకుని వచ్చేవాడన్నారు. ఇలా గత 9 నెలల కాలంలో 29 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారని, ఓ బైకును చోరీ చేశారని తెలిపారు. ఈ ముఠాపై చిత్తూరులో 14 కేసులు, అనంతపురంలో 6, కడపలో 5, తిరుపతిలో 2 కేసులు ఉన్నాయన్నారు. నిందితుల నుంచి 600 గ్రాముల బరువున్న 24 బంగారు గొలుసులు, తాళిబొట్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దొంగల ముఠాను పట్టుకోవడంతో కీలక పాత్ర పోషించిన మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సీఐ మురళి, ఎస్ఐలు, సిబ్బందికి నగదు రివార్డుతో ఎస్పీ అభినందించారు. పోలీసులకు రివార్డులు చిత్తూరు (అర్బన్): అంతరాష్ట్ర చైన్స్నాచర్లను పట్టుకున్న మదనపల్లె పోలీసులను చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ అభినందించారు. శనివారం చిత్తూరు పోలీసు అతిథి గృహంలో జరిగిన సమావేశంలో మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, చిత్తూరు క్రైమ్ డీఎస్పీ రామ కృష్ణలతో పాటు మదనపల్లె రూరల్ సీఐ ఎం.మురళి, తాలూక ఎస్ఐలు బీ.రవిప్రకాష్‌రెడ్డి, సూర్యనారాయణ, బి.కొత్తకోట ఎస్ఐ బీవీ.శివప్రసాద్‌రెడ్డి, సిబ్బంది ఎంఎస్.రాజు, కే.నాగార్జున, కే.శ్రీనివాసరావు, సీ.నాగరాజరెడ్డి, జీ.రమేష్‌బాబు, వీ.ఆదినారాయణ, బీ.శంకర్, ఎన్.రెడ్డి హేమనాదం, వై.కుమార్, వినోద్లకు ఎస్పీ శ్రీనివాస్ నగదు రివార్డులను అందచేశారు. -
ఖైదీని వెంబడిస్తూ..
కడప: కడప సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఉన్మాదిని వెతికే క్రమంలో ఎస్సై తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాకు చెందిన బత్తుల రామచంద్ర పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండు నెలల క్రితం అతను జైలు నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఐరాల సమీపంలోని కొండపై ఉన్నాడనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్సై శివశంకర అతన్ని పట్టుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కొండ పై నుంచి జారిపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
కడప సెంట్రల్ జైలు నుంచి 47 మంది ఖైదీల విడుదల
కడప (వైఎస్సార్ జిల్లా) : కడప కేంద్ర కారాగారం నుంచి మంగళవారం 47 మంది జీవిత ఖైదీలను విడుదల చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన 58 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కడప కేంద్ర కారాగార అధికారులకు లేఖ ద్వారా తెలియజేసింది. వారిలో 8 మంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. మహిళలను కొద్ది రోజుల క్రితమే నెల్లూరు జైలుకు తరలించారు. అక్కడ వారు విడుదల అవుతున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 50 మందిలో 47 మందిని మంగళవారం విడుదల చేయగా..మరో ముగ్గురికి వేరే కేసులతో సంబంధం ఉండటంతో విడుదల నిలిపివేశారు. -
ఆరుగురి సిబ్బందిపై వేటు: జైళ్లు శాఖ డీజీ
కడప : వైఎస్ఆర్ జిల్లా కడప సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు పరారు కావడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఆరుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ డీజీ కృష్ణంరాజు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం కడప సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు పారిపోయిన విషయం విదితమే. ఈ విషయమై విచారణ జరిపేందుకు రాష్ట్ర జైళ్ల డైరెక్టర్ జనరల్ కృష్ణంరాజు మంగళవారం కడపకు వెళ్లారు. అధికారులను విచారించిన ఆయన ఆరుగురు అధికారులను సస్పెండ్ చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ రామకృష్ణ, జైలర్లు శేషయ్య, గురుశేఖర్ రెడ్డి, డిప్యూటీ జైలర్లు బ్రహ్మారెడ్డి, గోవిందరావు, చీఫ్ హెడ్ వార్డర్ గోపాల్‌నాయక్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గోవిందరాజులు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఉన్నతాధికారులే ఆయనను సెలవులో వెళ్లమని ఆదేశించినట్లు తెలుస్తోంది. సెంట్రల్ జైలు ఇన్చార్జ్గా డీఐజీ జయవర్ధన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. నిచ్చెన అందుబాటులో లేకుండా చూసి ఉంటే ఖైదీలు పారిపోయేవారు కాదని డీజీ అన్నారు. పరారీలో ఉన్న ఖైదీల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన చెప్పారు. అంతకు ముందు కడప జైళ్ల సూపరింటెండెంట్ గోవిందరాజులు మాట్లాడుతూ.. సెంట్రల్ జైలులో మసీదు నిర్మాణంలో ఉపయోగించే రీఫర్లను నిచ్చెనగా తయారుచేసుకుని ఖైదీలు పారిపోయారని చెప్పారు. -
గంగిరెడ్డికి ఏం జరిగినా వారిదే బాధ్యత
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని అతని భార్య మాళవిక ఆందోళన వ్యక్తం చేసారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు బనాయించి జైల్లోనే అంతం చేయ్యాలని కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాడి కేసుతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే కోర్టు నిర్ధారించిందని మాళవిక ఈ సందర్భంగా గుర్తు చేశారు. గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడనటంలో నిజంలేదని రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయటంతో స్వదేశానికి తిరిగిరాలేదని తెలిపారు. మారిషస్ నుంచి గంగిరెడ్డిని హైదరాబాద్ తరలిస్తున్న సమయంలో అధికారులు రివాల్వర్‌తో బెదిరించారని అన్నారు. తన భర్తకు ఏం జరిగినా ఏపీ పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతడు.. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నాడు. -
ఇద్దరు ఎర్రదొంగలు కడప జైలుకు తరలింపు
చిత్తూరు (అర్బన్) : ఇద్దరు బడా ఎర్రచందనం స్మగ్లర్లను ఆదివారం రాత్రి వైఎస్సార్ కడప కేంద్ర కారాగారానికి తరలించారు. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు రాజేంద్రన్ సెల్వరాజ్, కే.మణి పై ప్రివెంటివ్ డిటెక్టివ్ (పీడీ) యాక్టు నమోదుకు ఆదేశాలు జారీ చేస్తూ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదివా రం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వీరిని కలెక్టర్ ఆదేశాల మేరకు జైలుకు పంపారు. సెల్వరాజ్ : చెన్నైలోని ఆళ్వార్పెట్కు చెందిన సదాశివం రాజేంద్రన్ కుమారుడు సెల్వరాజ్ (52) అనే చెల్లా పదోతరగతి వరకు చదువుకున్నాడు. 1993 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా వ్యాపారంలో ఉన్నాడు. ఇతనికి చెన్నై లో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ గోడౌన్‌ను ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించేవాడు. ఇతనికి సౌదీఅరేబియా, బర్మా దేశాల్లోని అంతర్జాతీయ స్మగ్లర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. సెల్వరాజ్‌పై గతేడాది కూడా పీడీ యాక్టు నమోదు చేశారు. ఇప్పటివరకు ఇతడు సుమారు 600 టన్నుల ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేశాడు. ఇతనిపై జిల్లాలో 13 కేసులున్నాయి. ఇతని వార్షిక ఆదా యం దాదాపు రూ.50 కోట్లని అంచనా. మణి : తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా వెల్లూరుకు చెందిన కర్పన్న గౌండర్ కుమారుడు కే.మణి (50) ఆరో తరగతి వరకు చదువుకున్నాడు. 2006 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నాడు. ఎర్రచందనం అక్రమరవాణాలో పైలటింగ్ చేస్తూ స్మగ్లర్‌గా ఎదిగాడు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల్లోని స్మగ్లర్లతో పరిచయాలు ఉన్నాయి. ఇప్పటివరకు 100 టన్నులు ఎర్రచందాన్ని అక్రమ రవాణా చేశాడు. జిల్లాలో ఇప్పటివరకు ఇతనపై ఎనిమిది కేసులున్నాయి. ఇతని నెల సరి ఆదాయం *20 లక్షలు. -
కడప సెంట్రల్ జైల్లో ఖైదీ ఆత్మహత్య
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న తోట క్రిష్ణమూర్తి (37) అనే ఖైదీ మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన క్రిష్ణమూర్తి ఓ హత్య కేసులో కొంత కాలంగా అదే జిల్లా జైలులో రిమాండ్‌లో ఉండగా.. నాలుగు రోజుల క్రితం అతనికి జీవిత ఖైదు పడడంతో కడప కేంద్ర కారాగారానికి తీసుకు వచ్చారు. మంగళవారం కేంద్ర కారాగారంలో ఓ పైపునకు లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కడప ఆర్డీవో చిన్నరాముడు ఇతర అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, మనస్థాపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. -
కడప సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య
కడప : జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఒక ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం వైఎస్సార్ కడప జిల్లాలోని కేంద్ర కారాగారంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతరపురం జిల్లా తలపుల మండలానికి చెందిన కృష్ణమూర్తికి తన భార్యను హత్య చేసిన కేసులో అనంతపురం జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితమే కృష్ణమూర్తిని జైలు అధికారులు కడప కేంద్రకారాగారానికి తరలించారు. కాగా మంగళవారం జైలులో ఉన్న బాత్రూంలో ఉరి వేసుకొని కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. -
బడా స్మగ్లర్ అరెస్ట్
-
పోలీసుల అదుపులో స్మగ్లర్ సోము
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ పోలీసులు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని బడా స్మగ్లర్ సోము రవి ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైకి చెందిన బడా స్మగ్లర్ సోము రవిని తిరుపతి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిపై పీడీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి ... కడప సెంట్రల్ జైలుకు తరలించారు. తమిళనాడుకు చెందిన బడా స్మగ్లర్ సోము రవితోపాటు 11 మందిని తిరుపతి పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. సోము రవిపై ఇప్పటి వరకు 23 ఎర్రచందనం అక్రమ రవాణ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఇటీవల శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం... చంద్రబాబు ప్రభుత్వంపై పలు రాజకీయ పార్టీ నాయకులు ఆరోపణలు చేసిన విషయం విదితమే. అదికాక ఎర్రచందనం స్మగ్లర్లను భరతం పట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా స్మగ్లర్లతో సంబంధాలున్న నటి నీతూను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కడప సెంట్రల్ జైల్ వద్ద ఖైదీ పరారీ
-
అతడిపై పది కేసులు..!
5న ఔటర్‌పై ప్రమాదంలో మృతి ఆ వ్యక్తిపై 10 కేసులున్నట్లు పోలీసుల వెల్లడి చీటింగ్, యువతులను నమ్మించి పెళ్లి చేసుకోవడం వెంకట్రావు ప్రవృత్తి.. శంషాబాద్ రూరల్: పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను మాయమాటలతో వలలో వేసుకోవడం.. ఆ తర్వాత మోసం చేయడం అతని ప్రవృత్తి.. ఈ నెల 5న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అతని పూర్తి వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడిం చారు. సీఐ ఉమామహేశ్వర్రావు తెలిపిన వివరాలు .. ప్రకాశం జిల్లా కొండేపి మండలం దాసరిపాలెంకు చెందిన గుడిపాటి వెంకట్రావు(36) అలియాస్ చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ చందుకు 18 ఏళ్ల కిందట తన అక్క రమణమ్మ కూతురు మంగమ్మతో పెళ్లి జరిగింది. ఇతనికి ఇద్దరు కుమారులు. 11 ఏళ్ల కిందట భార్యా,పిల్లలను వదిలేసి వచ్చాడు. జల్సాలకు అలవాటు పడిన వెంకట్రావు డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకోవడం, వ్యాపారంలో భాగస్వాములు కావాలని చెప్పి వారి నుంచి డబ్బులు కాజేయడం హాబీగా పెట్టుకున్నాడు. అంతేకాదు పేదింటి యువతులను మాయ మాటలతో తన వలలో వేసుకునేవాడు. యువతి కుటుంబాన్ని తీసుకుని తీర్థ యాత్రలకు వెళ్లి వారికి తనపై మంచి అభిప్రాయం ఏర్పడేలా నమ్మిస్తాడు. తర్వాత యువతిని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సంసారం సాగిస్తాడు. తర్వాత మరో యువతిని వలలో వేసుకుంటాడు. ఇలా యువతులను ప్రలోభపెట్టి వ ంచించడం వంటి 10 కేసుల్లో వెంకట్రావు నిందితుడు. ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, కడప, గుంటూరు ప్రాంతాల్లో ఇతనిపై కేసులు ఉన్నాయి. 2005లో ఒంగోలులో మొదటి సారి ఇతనిపై కేసు నమోదయింది. పోలీసుల కళ్లుగప్పి.. ఓ కేసులో ఈ ఏడాది జూలై 1న కడప సెంట్రల్ జైలు నుంచి ఇతన్ని ఒంగోలు కోర్టుకు తీసుకెళ్తున్నారు. కడప బస్టాప్‌లో పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ సంఘటనలో నలుగురు ఆర్మ్డ్ రిజర్వు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంజీవ రావు, తులసి దంపతులను ఓ సారి బస్సులో ప్రయాణిస్తూ పరిచయం చేసుకున్నాడు. రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యం కావాలని, అందుకు డబ్బులు తీసుకుని రావాలని ఈ ఏడాది సెప్టెంబరు 18న ఈ దంపతులను అక్కడికి రప్పించాడు. అక్కడ వారిని బెదిరించి తులసి వద్ద బంగారు నగలు, వారి షిఫ్ట్ కారు ఏపీ 04- ఏఆర్ 9015( ఔటర్‌పై ప్రమాదానికి గురైన కారు)ను లాక్కున్నాడు. దీంతో తులసి రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు అయింది. ప్రమాదానికి ముందు.. ఔటర్‌పై జరిగిన ప్రమాదానికి ముందు ఇతను ఓ అమ్మాయిని మాయమాటలతో నమ్మించి తనతో పెట్టుకున్నాడు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ప్రాంతంలోని తిరుపతమ్మ ఆలయం వద్ద ఉండే ఉపాధ్యాయుడు నాగేశ్వర్రావుకు కొన్ని గదులు ఉన్నాయి. వెంకట్రావు ఈ ఆలయానికి తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో అతను నాగేశ్వర్రావుకు చెందిన గదుల్లో అద్దెకు ఉండేవాడు. అతనితో పరిచయం పెంచుకున్న వెంకట్రావు షిరిడి టూర్ ప్లాన్ చేశాడు. సంజీవరావు నుంచి లాక్కున్న షిఫ్ట్ కారు నంబరును ఏపీ 20-ఏఆర్ 5959గా మార్చాడు. నాగేశ్వర్రావుతో పాటు అతని భార్య సురేఖ, కూతురు సుశ్వేత, మేన కోడలు రత్నకుమారి, తనతో ఉండే యువతిని తీసుకుని వెంకట్రావు ఈ నెల 2న ఇదే కారులో షిరిడి వెళ్లాడు. అక్కడి నుంచి 4న తిరుగు ప్రయాణంలో పెనుగంచిప్రోలు వెళ్లడానికి శంషాబాద్‌లోని ఔటర్ మీదుగా వస్తున్నారు. 5న తెల్లవారుజామున పెద్దగోల్కొండ వద్ద ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొంది. డ్రైవింగ్ చేస్తున్న వెంకట్రావు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు మృతుడి వివరాలను సేకరించారు. ఈ నెల 6న అతని మృతదేహాన్ని అక్క రమణమ్మకు అప్పగించారు. అనంతరం దర్యాప్తు జరపగా కడప జైలులోని రికార్డుల్లో నమోదైన ఆనవాళ్ల ఆధారంగా మృతదేహం వెంకట్రావుదని నిర్ధారించారు.