
అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్ల అరెస్టు
► నిందితుల్లో ఏఆర్ కానిస్టేబుల్, ఇద్దరు మైనర్లు
► రూ.23 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం
చిత్తూరు (అర్బన్): చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠాను మదనపల్లె పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో ఐదుగురు ఉన్నారు. వీరిలో ఒక ఏఆర్ కానిస్టేబుల్, ఇద్దరు మైనర్ బాలలు ఉన్నారు. శనివారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. మదనపల్లె శివారులో శుక్రవారం వాహనాల తనిఖీల్లో అనంతపురం జిల్లా నల్లమాడ మండలం, వేలమద్దికి చెందిన రాచంపల్లె శ్రీనివాసులు అలియాస్ మంగళ శీన అలియాస్ వాసు (34), రాప్తాడు మండలం అయ్యవారిపల్లెకు చెందిన గోరవ ఎర్రిస్వామి (24), కడపలోని మర్యపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మోల్ల జోహన్నస్ (50)తో పాటు ఇద్దరు మైనర్ బాలల్ని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఈ ముఠాలో ప్రధా న నిందితుడు మంగళ శీన 2002 నుంచి రాయలసీమ, బెంగళూరులోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్టు తెలిపారు. ఇతనిపై వందకు పైగా కేసులు ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లో పలు అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పాత కేసుల్లో అరెస్టయిన శీన గత ఏడాది జూన్‌లో కడప సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడని పేర్కొన్నారు. అనంతరం నలుగురు వ్యక్తుల్ని ఎంచుకుని చైన్‌స్నాచింగ్ చేయడం ప్రారంభించాడన్నారు. కడపకు చెంది న ఆర్ముడు రిజర్వుకానిస్టేబుల్ మోల్ల జోహన్నస్ గతంలో శ్రీని వాసులు అనే దొంగతో కలిసి పలు చోరీలు చేయించిన అనుభవం ఉండడంతో ఇతన్ని ముఠాలో చేర్చుకున్నాడని తెలిపా రు. జోహన్నస్ మూడుసార్లు విధుల నుంచి సస్పెండ్ అయ్యాడని వెల్లడించారు. కడపలో ఇతనిపై పలు కేసులు ఉండడంతో గత ఏడాది జూన్ నుంచి సస్పెన్షన్‌లో ఉన్నాడని తెలిపారు.
ఒంటరి మహిళలలే లక్ష్యం
ఒంటరిగాా ఉన్న మహిళలు, తెల్లవారు జామున కల్లాపు చల్లే మహిళలు, చీకటి పడ్డాక వాకింగ్ చేసే మహిళల్ని ఎంచుకుని మంగళ శీన ఆభరణాలను లాక్కెళ్లిపోతాడని తెలిపారు. వెంటనే ద్విచక్రవాహనాన్ని బస్టాండు, జన సంచార ప్రదేశాల్లో పార్కింగ్ చేసి, ఇండికా కారులో పారిపోయేవాడని పేర్కొన్నారు. బైకును ఇద్దరు మైనర్ బాలలు తీసుకురావడం, చోరీల్లో పాలు పంచుకోవడం చేసేవారని చెప్పారు. చోరీ చేసిన మంగళసూత్రాలు, బంగారు గొలుసుల్ని కానిస్టేబుల్ ఇతర ప్రాంతాలను తీసుకెళ్లి అమ్ముకుని వచ్చేవాడన్నారు. ఇలా గత 9 నెలల కాలంలో 29 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారని, ఓ బైకును చోరీ చేశారని తెలిపారు. ఈ ముఠాపై చిత్తూరులో 14 కేసులు, అనంతపురంలో 6, కడపలో 5, తిరుపతిలో 2 కేసులు ఉన్నాయన్నారు. నిందితుల నుంచి 600 గ్రాముల బరువున్న 24 బంగారు గొలుసులు, తాళిబొట్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దొంగల ముఠాను పట్టుకోవడంతో కీలక పాత్ర పోషించిన మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సీఐ మురళి, ఎస్‌ఐలు, సిబ్బందికి నగదు రివార్డుతో ఎస్పీ అభినందించారు.
పోలీసులకు రివార్డులు
చిత్తూరు (అర్బన్): అంతరాష్ట్ర చైన్‌స్నాచర్లను పట్టుకున్న మదనపల్లె పోలీసులను చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ అభినందించారు. శనివారం చిత్తూరు పోలీసు అతిథి గృహంలో జరిగిన సమావేశంలో మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, చిత్తూరు క్రైమ్ డీఎస్పీ రామ కృష్ణలతో పాటు మదనపల్లె రూరల్ సీఐ ఎం.మురళి, తాలూక ఎస్‌ఐలు బీ.రవిప్రకాష్‌రెడ్డి, సూర్యనారాయణ, బి.కొత్తకోట ఎస్‌ఐ బీవీ.శివప్రసాద్‌రెడ్డి, సిబ్బంది ఎంఎస్.రాజు, కే.నాగార్జున, కే.శ్రీనివాసరావు, సీ.నాగరాజరెడ్డి, జీ.రమేష్‌బాబు, వీ.ఆదినారాయణ, బీ.శంకర్, ఎన్.రెడ్డి హేమనాదం, వై.కుమార్, వినోద్‌లకు ఎస్పీ శ్రీనివాస్ నగదు రివార్డులను అందచేశారు.