జేసీని విచారించిన పోలీసులు | JC Prabhakar Reddy Questioned by Police | Sakshi
Sakshi News home page

జేసీని విచారించిన పోలీసులు

Published Mon, Aug 17 2020 5:56 AM | Last Updated on Mon, Aug 17 2020 9:29 AM

JC Prabhakar Reddy Questioned by Police - Sakshi

జేసీని అనంతపురం త్రీటౌన్‌ పీఎస్‌కు తీసుకువచ్చిన పోలీసులు

అనంతపురం క్రైం/కడప అర్బన్‌: అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని అనంతపురం జిల్లా పోలీసులు విచారించారు. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న జేసీని ఆదివారం ఉదయం కస్టడీలోకి తీసుకుని అనంతపురం త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు 4 గంటల పాటు జేసీని విచారించారు.

అనంతరం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చి, కడప కేంద్ర కారాగారానికి తిరిగి తరలించారు. ఈ నెల 6న విధుల్లో ఉన్న దళిత పోలీసు అధికారిని దూషించినందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement