పోలీసుల అదుపులో స్మగ్లర్ సోము | Smuggler somu arrested by chittoor district police | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో స్మగ్లర్ సోము

Published Tue, Apr 28 2015 10:50 AM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM

Smuggler somu arrested by chittoor district police

చిత్తూరు:  ఆంధ్రప్రదేశ్ పోలీసులు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని బడా స్మగ్లర్ సోము రవి ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైకి చెందిన బడా స్మగ్లర్ సోము రవిని తిరుపతి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిపై పీడీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి ... కడప సెంట్రల్ జైలుకు తరలించారు. తమిళనాడుకు చెందిన బడా స్మగ్లర్ సోము రవితోపాటు 11 మందిని తిరుపతి పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు.

సోము రవిపై ఇప్పటి వరకు 23 ఎర్రచందనం అక్రమ రవాణ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఇటీవల శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్పై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం... చంద్రబాబు ప్రభుత్వంపై పలు రాజకీయ పార్టీ నాయకులు ఆరోపణలు చేసిన విషయం విదితమే.

అదికాక ఎర్రచందనం స్మగ్లర్లను భరతం పట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా స్మగ్లర్లతో సంబంధాలున్న నటి నీతూను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement