కడప: కడప సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఉన్మాదిని వెతికే క్రమంలో ఎస్సై తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాకు చెందిన బత్తుల రామచంద్ర పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండు నెలల క్రితం అతను జైలు నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో ఐరాల సమీపంలోని కొండపై ఉన్నాడనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్సై శివశంకర అతన్ని పట్టుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కొండ పై నుంచి జారిపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఖైదీని వెంబడిస్తూ..
Published Sat, Mar 12 2016 7:14 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement