పోలీసులకు మస్కా కొట్టి ఖైదీ పరారీ | Inmate abscond form police in YSR Kadapa District | Sakshi
Sakshi News home page

పోలీసులకు మస్కా కొట్టి ఖైదీ పరారీ

Published Fri, Dec 12 2014 8:26 AM | Last Updated on Sat, Sep 15 2018 8:03 PM

Inmate abscond form police in YSR Kadapa District

నాగారం: కోర్టు నుంచి తిరిగి వస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా సెంట్రల్ జైలు సమీపంలో ఎస్కార్ట్ పోలీసులకు మస్కా కొట్టి గురువారం అర్ధరాత్రి సమయంలో విచారణ ఖైదీ సునీల్ పరారయ్యాడు. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై... అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న సునీల్ను విచారణ నిమిత్తం గురువారం అనంతపురం కోర్టుకు తరలించారు. కేసు వాయిదా పడటంతో సునీల్ను మళ్లీ కడపకు తరలించారు.

ఆ క్రమంలో పోలీసుల వాహనం కడప సెంట్రల్ జైలు సమీపంలోకి చేరుకోగానే సునీల్ పోలీసులను మాటల్లోకి దింపి మస్కా కొట్టి అక్కడి నుంచి పరారైయ్యాడు. ఆ ఊహించని పరిణామంతో పోలీసులు హతాశులయ్యారు.  వెంటనే తేరుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సునీల్ స్వస్థలం ప్రొద్దుటూరు అని పోలీసులు తెలిపారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు అపహరణ కేసుల్లో సునీల్ ముఠాపై వివిధ కేసులు నమోదు అయినాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement