
చర్లపల్లి జైలు నుంచి ఖైదీ పరారీ
హైదరాబాద్: చర్లపల్లి ఓపెన్ జైలు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. ఆ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయం జైలు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జైలులోని ఖైదీల సంఖ్య 104 కి బదులు 103 మందే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఆ వెంటనే రంగంలోకి దిగిన జైలు ఉన్నతాధికారులు పరారైన ఖైదీని గుర్తించారు.
మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మంచాపూర్ గ్రామానికి చెందిన గోవర్దన్గా పోలీసులు గుర్తించారు. అతడి కోసం జైలు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ అంశాన్ని జైలు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పరారైన గోవర్దన్ చర్లపల్లి జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడని సమాచారం.