Govardhan
-
ఆ రోజు ఏం జరిగిందంటే...
కొన్ని నిర్ణయాలు చరిత్ర గతినే మారుస్తాయి. స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేర సైనిక చర్య జర పాలనే నిర్ణయం ఇందుకొక నిదర్శనం. 1984 జూన్‌లో పంజాబ్ స్వర్ణ దేవాలయంలో మకాం చేసుకున్న సిక్కు తీవ్రవాదులను బయటికి రప్పించడానికి మరో మార్గం లేక ప్రధాని ఇందిరాగాంధీ (67) భారత సైన్యాన్ని పంపాల్సి వచ్చింది. దీనికి దేశం పెద్ద మూల్యమే చెల్లించుకుంది. ఊహించని ఆ చర్యతో సిక్కు తీవ్రవాదం ఓ విధంగా సద్దుమణిగింది. కానీ, ఆ తర్వాత ఐరన్ లేడీగా పేరొందిన ఇందిరాజీ, జవసత్వాలు ఉడిగిన అబలగా ప్రవర్తించారని అంటారు. ప్రభుత్వ కార్యభారాలు చాల వరకు తగ్గించుకుని ఆమె, ప్రధాని నివాసం... 1, సఫ్దర్ జంగ్ రోడ్డుకే పరి మితం అయ్యారు. రాత్రి పూట ఆమెకు ఏవో పీడ కలలు కూడా వచ్చేవట. తన కుటుంబ సభ్యులను ఏవో శక్తులు కిడ్నాప్ చేస్తాయని తెలీని ఆందోళన ఆమెలో ఆవహించ సాగింది. వీలు దొరికితే సామాన్య మహిళలా, రాత్రి కొడుకు, కోడలు, మనవడు (రాహుల్), మనవరాలు (ప్రియాంక)తో కలిసి డిన్నర్ చేయటానికి ఉవ్విళ్ళూరేవారట. 12 ఏళ్ల ప్రియాంకతో, పెద్దయాక, తను వాడే పట్టుచీరలు ధరించి రాయ బరేలి, ఆమేథి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లా లని, నవ్వుతూ అనేదట (వింత కోరికలు!).‘ఆపరేషన్ బ్లూ స్టార్’కు నిరసనగా సిక్కు సమాజం కాంగ్రెస్ పార్టీకి, ఇందిరా ప్రభుత్వానికి దూరమయింది. ఇందిరా భక్తుడు, ప్రముఖ పాత్రి కేయుడు ఖుష్వంత్ సింగ్ రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి ప్రభుత్వం ఇచ్చిన పద్మ భూషణ్ అవార్డును వాపస్ చేశారు. అప్పటి పరిస్థితుల దరిమిలా ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థలు ప్రధానిని కొంతకాలం సిక్కు యువతకు దూరంగా ఉండాలని తేల్చాయి. సెక్యులర్ దేశానికి ప్రధానిగా ఉండి అలా చేయడం బావోదని, తన నివాసంలో ఉన్న ఇద్దరు సిక్కు సెక్యూ రిటీ యువకులను మార్చనీయలేదు ఇందిర. 22 ఏళ్ల సెక్యూరిటీ కానిస్టేబుల్ సత్వంత్ సింగ్‌ను చూపిస్తూ ఒకసారి... ‘ఈ బహదూర్ నౌ జవాన్ పర్యవేక్షణలో నాకు ఏ ప్రాణహాని లేదని’ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఆశ్చర్యం! వారంలోపే అదే యువకుని తుపాకి తూటాలకు ఆమె బలైపోయారు.1984 అక్టోబర్ 31 బుధ వారం ప్రొద్దుట రాహుల్, ప్రియాంకలను స్కూలుకెళ్ళే ముందు నానమ్మ ఇందిర, దగ్గరకి తీసుకుని గట్టిగా వాటేసుకుంది. ఏదో ఉద్వేగ పూరిత అనుభూతి ఆమెతో అలా చేయించింది. ఆ తర్వాత 9 గంటలకు, ముదురు ఆవరంగు కాటన్ శారీలో వడి వడిగా అడుగు లేస్తూ, ప్రక్కనే ఉన్న 1, అక్బరు రోడ్డులోని పార్టీ ఆఫీసు వైపు నడుస్తున్నా రామె. ఆమె వెంట పర్సనల్ స్టాఫ్ నారాయణ్ సింగ్ ఆమెకు ఎండ తగులకుండా గొడుగు పడుతూ పోతున్నాడు. అతని వెనకాలే ‘మేడం మేన్ ఫ్రైడే’గా పేరొందిన పీఏ... ఆర్కే థావన్ కూడా నడుస్తున్నాడు. బ్రిటన్ యాక్టర్ పీటర్ ఉస్తినోవ్, ఐరిష్ టీవీ యూనిట్‌తో ప్రధానిని ఇంటర్వ్యూ షూటింగ్ కోసం అక్కడ ఎదిరి చూస్తూ, రిస్ట్ వాచి చూసుకున్నాడు. సరిగ్గా 9.10 గంటలు. మేడం పది నిమిషాలు లేటు, ఎందుకో అని అనుకుంటుండగానే, అటు వైపు గన్ ఫైరింగ్ సౌండ్! ప్రధాని సెక్యూరిటీ స్టాఫ్ సబ్ ఇన్స్పెక్టర్ బియాంత్ సింగ్... వెళ్తున్న ప్రధానికి ఎదురెళ్లి శాల్యూట్ చేస్తూనే, సర్వీస్ రివాల్వర్ తీసి ఆమెను షూట్ చేశాడు. ఈ హఠాత్ పరిణామానికి జడుసుకుని నారాయణ్ సింగ్ గొడుగును గాలిలో వదలి ‘బచావ్’ అంటూ కేక లేశాడు. అంతలోనే, అటు సత్వంత్ సింగ్ స్టెర్లింగ్ సబ్ మెషిన్ గన్ నుండి 30 బుల్లెట్లు మేడం శరీరంలో కెళ్ళాయి. క్షణాల్లో రక్త ప్రవాహంతో నేల కొరిగింది ఇందిర. గత కొద్ది రోజులుగా పొంచి ఉన్న మృత్యువు హుటాహుటిన ఆమెను అలా తీసుకెళ్ళింది. రక్తం చుక్కల డైలాగ్...క్రితం రోజే (అక్టోబరు 30) సాయంత్రం, భువ నేశ్వర్ (ఒరిస్సా) అసెంబ్లీ ఆవ రణలో జరిగిన బహిరంగ సమా వేశంలో ఇందిరాజీ ప్రసంగిస్తూ, ‘... మై ఆజ్ యహన్ హూ. కల్ శాయద్ యహాన్ న రహూ. ముఝే చింతా నహి. జబ్ మై మరూంగీతో, మేరీ ఖూన్ కా ఏక్ ఏక్ బూంద్ భారత్ కో మజ్బూత్ కర్నేమే లగేగా’ (ఇవ్వాళ నేను ఇక్కడ ఉన్నాను. బహుశా రేపు ఇక్కడ లేకపోవచ్చు. నాకు బెంగ లేదు. నేను ఒకవేళ చనిపోతే, నా ప్రతీ రక్తం చుక్క దేశ పటిష్ఠతకు తోడ్పడుతుంది) అని అన్నారు. ఆవేశపూరితమైన ఈ రక్తం చుక్కల డైలాగు, ఆమెతో మృత్యు దేవతే పలికించిందని అప్పటి కాంగ్రెస్ నాయకులు చెప్పుకోసాగారు. ఇందిర హత్యానంతరం రాజధాని డిల్లీలో చెలరేగిన మత ఘర్షణల్లో 3 వేల మంది సిక్కులు చనిపోయారని ఖుష్వంత్ సింగ్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. జిల్లా గోవర్ధన్ (రషీద్ కిద్వాయి రాసిన ‘24, అక్బర్ రోడ్ ’ ఆధారం)వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై (రేపు ఇందిరా గాంధీ హత్యకు గురైన రోజు) -
పట్టనట్లు నెహ్రూ... పంతంతో పటేల్!
కొన్ని చారిత్రక సంఘటనలు దశాబ్దాలు దాటినా కూడా చర్చనీయాంశాలుగా కదలాడుతూనే ఉంటాయి. అలాంటి అంశమే 1948లో జరిగిన హైదరాబాద్ యాక్షన్. ‘ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్’ ద్వారా భారత ఉపఖండాన్ని భారత్, పాక్‌లుగా విభజిస్తున్నట్టు అప్పటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ ఆట్లీ 1948 జూన్ 3న ప్రకటించి ఉపఖండంలోని 562 రాచ రిక రాజ్యాలు ఇక నుండి ఏదో ఒక దేశంలో విలీనం అవొచ్చు లేదా, స్వతంత్రంగా ఉండొచ్చు అని తేల్చి చెప్పారు. దీనికి హైదరాబాదు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జూన్ 11న స్పందిస్తూ, హైదరాబాదు సంస్థానం స్వతంత్ర ఇస్లామిక్ దక్కన్ రాష్ట్రంగా ఉంటుందని ప్రకటించారు. వెంటనే ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా, ‘‘నిజాం ప్రతిపాద నకు బేషరతుగా పాకిస్తాన్ మద్దతుంటుంది’’ అని తెలిపారు. దాంతో 82,688 చదరపు మైళ్ల విస్తీర్ణంలో, 85 శాతం హిందూ, 13 శాతం ముస్లిం జనాభాతో ఉన్న హైదరాబాదు మున్ముందు ప్రజా స్వామ్య, లౌకిక, స్వతంత్ర భారతదేశానికి కొరకరాని కొయ్యగా మారుతుందని అప్పటి రాజకీయ నేతలు ఊహించారు.ఆ క్రమంలో రాచరిక రాష్ట్రాల రాజులు ‘ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్’ కూటమిగా ఏర్పాటై, 1947 ఆగస్టు తర్వాత తమ తమ ‘ఇలాఖా’లను భారతదేశంలో విలీనం చేశారు. కశ్మీరు, జునాఘఢ్, హైదరాబాదు రాష్ట్రాలు మాత్రం దీనికి ససేమిరా అన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాదును భారత్‌లో కలపడానికి వీల్లేదని ప్రకటించిన ‘మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్–ముస్లిమీన్’ నేత ఖాసీం రిజ్వీ 1948 ఫిబ్రవరి నుండి రెండు వేల మంది ముస్లిం రాడికల్ యువకులను గ్రామీణ ప్రాంతాల్లో హిందువులపై అరాచకాలకు, స్త్రీలపై అనేక అమానుష చర్యలకు పురిగొలిపాడు. ఇదేమి పట్టనట్టుగా ఉండి పోయాడు మీర్ ఉస్మాన్ అలీ. హైదరాబాదులో హిందువులపై జరుగుతున్న హత్యాచారాలను భారత ప్రభుత్వం అరికట్టాలని ఉపప్రధాని సర్దార్ పటేల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగులో గళ మెత్తారు. అయినా ప్రధాని నెహ్రూ, ఆయన విధేయులు నోరు మెదప లేదు!భారత్‌పై మిలిటరీ దాడికి 1948 జూన్ నుండే నిజాం ప్రభుత్వం ఐరోపా నుండి మెషీన్ గన్స్, గ్రెనేడ్లు, ఫైటర్ విమానాలను కరాచీ (పాకిస్తాన్)కి, అటునుండి సముద్రం ద్వారా పోర్చుగీసు ఆధీనంలోని గోవాకు తరలించి, ఆ తర్వాత హైదరాబాదుకు చేరవేయటం ఆరంభించింది. ఇక సమయం ‘బర్బాద్’ చేస్తే నష్టమే అనుకుని, తన సన్నిహి తులు వి.పి.మీనన్, హెచ్.వి. అయ్యంగార్, డిఫెన్స్ సెక్రటరీ హెచ్.ఎం. పటేల్ పర్యవేక్షణతో ‘ఆపరేషన్ పోలో’ అనే సీక్రెట్ కోడ్‌తో హైదరాబాదుపై విరుచుకుపడటం కోసం పథకం వేశారు వేశారు ‘ఉక్కు మనిషి’ పటేల్. ఆర్మీ జనరల్ జయంతో నాథ్ చౌధురీ ఇన్చార్జిగా పుణె కంటోన్మెంటులో సరిపడా యుద్ధ సామగ్రి, గోర్ఖా రైఫిల్స్, బర్మా బెటాలి యన్ ఫౌజీలను ఆగస్టు నెలలోనే సిద్ధం చేశారు. ఆపరేషన్‌కు ముందు సెప్టెంబర్ 8న కేబినెట్ మీటింగులో, ‘‘పరిస్థితి చేయి దాటక ముందే హైదరాబాదును ముట్టడించాలి. దేశం నడి బొడ్డులోని ఈ పుండును ఇలా వదిలేస్తే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం’’ అని తేల్చేసిన పటేల్‌పై చిందులు తొక్కారు నెహ్రూ! ఆయనతో వాదించదలచు కోలేదు సర్దార్. 1948 సెప్టెంబర్ 12న షోలాపూర్ దగ్గర గంగాపూర్ రైల్వే స్టేష న్లో కొందరు హిందువులను రజాకార్లు, భారత భూభాగంలో చొరబడి హత మార్చారు. ఈ వార్త ఢిల్లీ చేరటమే తడవు, ఆపరేషన్ పోలోకు గ్రీన్ సిగ్నల్ పంపారు.మరుసటి రోజు, సెప్టెంబర్ 13న ఉదయం 4 గంటల నుండి భారత బల గాలు బళ్లారి, షోలాపూర్, అహ్మద్‌నగర్, విజయవాడ మీదుగా నైజాం స్టేట్ నలు వైపులా సరిహద్దులను దాటుతూ హైదరాబాదు నగరం వైపు కదిలాయి. ఈ ఆకస్మిక ఆక్ర మణకు నీరుగారి పోయాడు నిజాం ఆర్మీ చీఫ్ మహమ్మద్ ఇద్రూస్. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ సామగ్రిని వాడే శిక్షణ లేక పోవటంతో వారి తుప్పుపట్టిన తుపాకులు, జీపులు భారత సైన్యాన్ని ఎదుర్కోలేక పోయాయి. సెప్టెంబరు 17 మధ్యాహ్నం సికింద్రాబాదు కంటోన్మెంట్‌కు 5 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది ఇండియన్ ఆర్మీ. పరిస్థితి క్షీణించటంతో ఉస్మాన్ అలీ ఖాన్, ఆర్మీ చీఫ్ ఇద్రుస్ ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాళ్ల బేరానికి వచ్చాడు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ రేడియో ప్రసంగం ద్వారా తన ప్రభుత్వాన్ని రద్దుచేసి, భారత సైనిక బలగాలకు లొంగిపోయినట్టు ప్రకటించారు.జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత అధికారి, ముంబై(2023లో విడుదలైన జాన్ జుబ్రిచ్చికి ‘డీథ్రోన్డ్: పటేల్, మేనన్అండ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ ఇండియా’ ఆధారంగా.) -
Mathura: రూ. ఒక కోటి 9 లక్షలతో పూజారి పరార్
ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఒక ఆలయంలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి గోవర్ధన్‌లో గల ముకుట్ ముఖారవింద్ ఆలయంలో భారీ చోరీ జరిగింది. పూజారే స్వయంగా ఈ దొంగతనానికి పాల్పడటం ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముకుట్ ముఖారవింద్ ఆలయ పూజారి దినేష్ చంద్ రూ. ఒక కోటి 9 లక్షల రూపాయలతో పరారయ్యాడు. దినేష్ చంద్ ఈ సొమ్మును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లాడు. అయితే ఆ తరువాత ఆలయానికి తిరిగి రాలేదు. పూజారి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ఈ ఉదంతంపై ఆలయ మేనేజర్ చంద్ర వినోద్ కౌశిక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న గోవర్ధన్ పోలీసులు నిందితుని కోసం గాలింపు మొదలుపెట్టారు.ఈ ఘటన గురించి ఆలయ మేనేజర్ చంద్ర వినోద్ కౌశిక్ మాట్లాడుతూ ఆలయ పూజారి దినేష్ చంద్ ఆలయానికి సంబంధించిన సొమ్ములో సుమారు రూ. ఒక కోటి 9 లక్షలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేసేందుకు వెళ్లినట్లు తెలిపారు. కాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు దస్వీసా నివాసి అయిన నిందితుడు, పూజారి దినేష్ చంద్ ఇంటిలో నుంచి పోలీసులు రూ. 71 లక్షల 92 వేలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్ము గురించి ఆరా తీస్తున్నారు. ఆ పూజారి భార్య స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి, ఆలయానికి సంబంధించిన సొమ్మును అప్పగించింది. పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
రాజకీయ చాతుర్యంలో.. ఆయనకు సాటి లేరు!
దేశ గమనాన్ని మలుపుతిప్పినవారు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు. నాటకీయ పరిణామాల మధ్య ప్రధాని పీఠాన్ని అధిష్టించి మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడపడం ఆయన పాలనాదక్షతకు ప్రతీక. అసలు ఆయన ప్రధాని కాకపోతే నేటి సరళీకరణ ఫలాలు మనకు కనిపించేవి కావేమో? దశ (అదృష్టం), దిశ (గమ్యం) రెండూ కొందరి జీవితాల్లో అనూహ్యంగా ట్విస్ట్ అవుతుంటాయి.దేశ రాజధానిలో మూడు దశాబ్దాల రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి, వానప్రస్థం స్వీకరించాలనుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత పాములపర్తి వెంకట నరసింహారావు విషయంలో ఇదే జరిగింది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా డిల్లీ నుండి పెట్టే బేడాసర్దుకుని ఇంటిదారి పట్టేపనిలో ఉన్నారు. శ్రీ సిద్దేశ్వరి మఠం (తమిళనాడు)లో శేష జీవితం గడపటానికి వెళ్ళబోతున్నానని తన సన్నిహితులకు చెప్పారు.ఈ తరుణంలోనే 1991 మే 21 రాత్రి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృత్యువాత పడటంతో, దేశ రాజకీయ పరిస్థితి ఒక్క ఉదుటున తారు మారయింది. ఇంకో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది; పార్టీ అధ్యక్షుని హఠాన్మరణంతో అగాథంలో పడిన కాంగ్రెస్ నాయకులు మరుసటి రోజు మధ్యాహ్నం వర్కింగ్ కమిటీ మీటింగు ఏర్పాటు చేసి, అధ్యక్షుని స్థానంలో సీనియర్ నేత పీవీ నర్సింహారావును నియమించారు.కేవలం అరగంట పాటు జరిగిన ఆ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్టీ అధ్యక్షుని మరణ రీత్యా సంతాప తీర్మానం చేసి, తర్వాత తాత్కాలిక పార్టీ అధ్యక్షునిగా పీవీని నియమించారు. భర్తను కోల్పోయిన విషాదంలో, సోనియా గాంధీ పార్టీ కార్య కలాపాలకు దూరంగా ఉండాలనుకుంది. జూన్‌లో వెలువడిన 10వ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 232 సీట్లు సంపాదించి, అతి పెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.గాంధీ కుటుంబీకులు రేసులో లేకపోవటంతో... అర్జున్ సింగ్, మాధవ్ రావ్ సింధియా, రాజేష్ పైలట్, శరద్ పవార్ లాంటి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత పదవికి బరిలోకి దిగినప్పటికీ ఎన్నికైన అత్యధిక ఎంపీలు, గాంధీ కుటుంబానికి విధేయత, అనుభవం ఉన్న పీవీ వైపే మొగ్గు చూపారు. ‘పార్లమెంటు పార్టీ నేత ప్రధాని పీఠానికి అర్హుడు కాబట్టి, ఈ పదవికి పార్టీ ఎంపీలు తమలోని నాయకుణ్ణి డెమాక్రటిక్ పద్ధతిలోనే ఎన్నుకోవాలని’ పాచిక విసిరారు శరద్ చంద్ర పవార్. రాజకీయ చదరంగం ఆటలో అప్పటికే ఆయన పేరొందిన ఆటగాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆయన అనునాయిడూ, పూణె ఎంపీ అయిన సురేష్ కల్మాడి (ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ స్క్వాడ్రన్ లీడర్) మహారాష్ట్ర సదన్ నుండి, ఉత్తరాది కాంగ్రెస్ ఎంపీలను పవార్ లాబీ కోసం సమీకరణ చేస్తూ షాం–ఏ–దావతులు ఏర్పాటు చేశారు. ఇటు కేరళ హౌస్ నుండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. కరుణాకరన్, పీవీ కోసం దక్షిణాది కాంగ్రెస్ ఎంపీలను ఏకతాటిపై తేవటానికి ప్రయత్నాలు జరిపారు. అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జూన్ 19 నాడు కాంగ్రెస్ నేతలతో కిక్కిరిసింది. 232 మంది నూతన ఎంపీలను పార్లమెంటరీ పార్టీ నాయకుణ్ణి ఎన్నుకోమని ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే పవార్ 35 ఓట్లతో వెనుకంజలో ఉంటాడని తెలిసిపోయింది. వీరిని తన వైపు మరల్చుకోవటానికి ఆయనకు ఇట్టే సమయం పట్టదని గ్రహించిన పీవీ, పోటీకి దిగిన శరద్ పవార్‌ను ఆఖరి ప్రయత్నంగా, ఒక వైపు తీసుకెళ్లాడు.ఏకాంతంలో పవార్‌తో, ఈ మధ్యనే తన గుండెకు శస్త్ర చికిత్స జరిగిందనీ, వయోభారంతో రాజకీయ విధులు నిర్వర్తించటం ఎక్కువ కాలం సాధ్యపడక పోవచ్చని చెబుతూ... మరాఠీలో, ‘మీ హీ జబాబ్దారీ మాఝ్య ఖాంధ్యా వర్ కితీ దివస్ పేల్వూ (నేను ఈ భాధ్యత నా భుజాలపై వేసుకుని ఎన్ని రోజులని మోయగలను) అంటూ, ‘కొన్ని రోజులపాటు తనకు ప్రధానిగా అవకాశం ఇవ్వవలసిందిగా’ నవ్వుతూ కోరాడు పీవీ. పీవీ తాత్విక ధోరణితో మాట్లాడిన మాటలకు చలించి పోయారు పవార్ సాహెబ్.మరుసటి రోజు ఉదయం (జూన్ 20) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. హాజరైన ఎంపీలు అంతా హాలులోకి ప్రవేశించిన శరద్ పవార్ వైపే సస్పెన్స్‌తో చూస్తున్నారు. మీటింగు ఆరంభం కావటంతోనే పవార్, జేబులోనుండి తను రాసిన ఒక లెటర్ తీసి సభ్యుల ముందుంచారు. ‘పార్టీ నాయకత్వాన్ని నిర్ణయించడంలో సీపీపీని సమావేశ పరచాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ అధ్యక్షులు (పీవీ) అంగీకరించడాన్ని నేను స్వాగతిస్తున్నాను. సీపీపీ సభ్యులందరూ శ్రీ పీవీ నరసింహారావుకు మద్దతు ఇవ్వాలనీ, ఈ విషయంలో ఏకగ్రీవ నిర్ణయానికి రావాలనీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అందులో కోరారు.అంతే, మరునాడు (1991 జూన్ 21) రాష్ట్రపతి భవన్లో పీవీ నరసింహారావు తొమ్మిదవ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తను ప్రధాని అయ్యాక, శరద్ పవార్‌ను పార్టీ జాతీయ అధ్యక్షునిగా నియమిస్తానని రావు ప్రామిస్ చేసినట్టు అంటారు. కాని, ఏప్రిల్ 1992 ఏప్రిల్‌లో జరిగిన తిరుపతి కాంగ్రెస్ పార్టీ సదస్సులో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని తన అనుకూల సభ్యులతో పునర్వ్యవస్థీకరించి, అధ్యక్షునిగా పార్టీ పగ్గాలు సైతం నాటకీయంగా కైవసం చేసుకున్నారు అపర చాణక్యుడు పీవీ నరసింహారావు. (శరద్ పవార్ రాజకీయ ఆత్మకథ ‘లోక్ మాఝే సాంగతి’, రషీద్ కిద్వాయి రాసిన ‘24 అక్బర్ రోడ్’ ఆధారంగా) వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్ 9819096949.సందర్భం: - జిల్లా గోవర్ధన్ -
అసలు... ఆ రాత్రి ఏం జరిగింది?
భారత ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. అది హత్యా? సహజ మరణమా? లేక ఇన్సైడర్ (లోపలి వ్యక్తి) పనా? అయిదు దశాబ్దాలు గడిచినా, ఏ ఇన్వెస్టిగేషన్, ఏ ఎంక్వైరీ కమిషన్‌కు నోచుకోకుండానే ఆయన మరణం దేశ చరిత్ర పుటల్లో మిస్టరీగానే మిగిలిపోయింది! 1965 భారత్–పాక్ యుద్ధానంతరం, 1966 జనవరి 4న రష్యాలోని తాష్కెంట్లో ప్రారంభమైన ఇరు దేశాల చర్చలు జన వరి 10 రాత్రి ‘నోవార్ ప్యాక్ట్ ’ అగ్రిమెంటుతో ముగిశాయి. ఆ తర్వాత తనకు ఏర్పాటు చేసిన ‘డాచా’ (గెస్ట్ హౌజ్ విల్లా)లోని విశాలమైన బెడ్ రూంలో కెళ్ళిపోయారు శాస్త్రి. భోజనానంతరం, కుక్ రావ్‌ునాథ్ తెచ్చిన గ్లాసులోని పాలు త్రాగి నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 1.20 గంటలకు ప్రధాని పర్సనల్ సెక్రెటరీ జగన్నాథ్ సహాయ్ బెడ్ రూం తలుపును ఎవరో తడుతున్న చప్పుడు. తలుపులు తెరచిన ఆయనకు ఎదురుగా కుడి చేత్తో ఛాతీ వత్తుకుంటూ, ‘డాక్టర్ సాబ్ కహా హై’ వగరుస్తూ ప్రధాని ఆర్థింపు. సంగతి తెలిసిపోయింది పీఏ సహాయ్‌కి. అసిస్టెంట్లు ఇద్దరు కలిసి శాస్త్రిజీని ఆయన రూంలోకి తీసు కెళ్ళి గ్లాసులో ఆయనకు నీళ్లు ఇచ్చారు. బెడ్‌పై ఆయనను పడుకోబెట్టి, పక్కరూంలో ఉన్న ప్రధాని పర్సనల్ వైద్యుడు డాక్టర్ ఆర్ఎన్ చుఘ్కు కబురు చేశాడు పీఏ క్షణాల్లో మెడికల్ కిట్‌తో శాస్త్రీజీ రూంలో కొచ్చి ఆయన పల్స్ చెక్ చేశాడు. శ్వాస పీల్చుకోలేక, ‘మేరే రామ్’ అంటూ అవస్థ పడుతున్నారాయన. ప్రధాని గుండెపోటుకు గురయ్యారని నిర్ధారణకు వచ్చి వెంటనే ఒక ఇంజెక్షన్ చేసి ఛాతీ వత్తడం ప్రారంభించాడు డాక్టర్ అయినా శాస్త్రీజీ క్రమంగా స్పృహ కోల్పోయారు. ఆఖరు ప్రయత్నంగా మరో ఇంజెక్షన్‌ను నేరుగా శాస్త్రిజీ గుండె దగ్గరే ఇచ్చాడు చుఘ్. అయినా లాభం లేకపోయింది. ఆశ వదలుకుని, గద్గద స్వరంతో ‘బాబూజీ, ఆప్నే ముజె మౌకా నహీ దియా (నాకు మీరు తగిన సమయం ఇవ్వలేదు)’ అంటూ ఆశ్రునయనాలతో శాస్త్రీజీ పల్స్‌ను వదిలేశాడు డాక్టర్ చుఘ్. తాష్కెంట్లో అప్పుడు సమయం రాత్రి 1.32 గంటలు. ‘యువర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ డైయింగ్’ అన్న ఒక రష్యన్ లేడీ విలేకరి మాటతో, నిద్రలో నుండి హుటా హుటిన లేచి చెప్పులు లేకుండానే తన గది నుండి ఆదుర్దాగా శాస్త్రిజీ బెడ్ రూవ్‌ు వైపు పరుగు తీశాడు ఆయన ప్రెస్ సెక్రెటరీ కులదీప్ నయ్యర్. అప్పటికే అంతా అయి పోయింది. ఆయన బెడ్ దగ్గర రష్యన్ ప్రధాని కోసిగిన్, పాక్ నేత ఆయూబ్ ఖాన్, ప్రధాని సహచరులు, మంత్రులూ అయిన స్వర్ణ సింగ్, యశ్వంత్ రావు చవాన్ దీన వదనాలతో శిల్పాల్లా నిలుచున్నారు. ఆ నిశాంత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, పాక్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్, కుల్దీప్ వైపు చూస్తూ ‘హియర్ ఈస్ ఏ మేన్ ఆఫ్ పీస్, హూ గేవ్ హిస్ లైఫ్ ఫర్ ఎమిటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్’ అంటూ వాపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం 2.30 గం.కు జాతీయ జెండాలో చుట్టిన ప్రధాని పార్థివ దేహంతో సోవియట్ ఎయిరోఫ్లోట్ విమానం తాష్కెంట్ నుండి ఢిల్లీ పాలవ్ు ఎయిర్ పోర్ట్ చేరు కుంది. అక్కడి నుంచి గన్ క్యారేజ్‌లో శాస్త్రీజీ డెడ్ బాడీని ఆ సాయంత్రం 4.10 గంటలకు 10, జనపథ్‌కు చేర్చారు. రోడ్డంతా శోకసంద్రంలో మునిగిన ఢిల్లీ వాసులతో నిండింది. ఏమీ తోచని ప్రధాని కుటుంబీకులు వారిస్తున్నా ఆగమేఘాల మీద ఏ పోస్టుమార్టం లేకుండానే అదే రోజు శాంతివన్లో శాస్త్రీజీ అంత్యక్రియలు జరిపారు. ఊహించని రీతిలో నిష్క్రమించిన ప్రధాని లాల్ బహదూర్ స్థానంలో నూతన నాయకుణ్ణి ఎన్నుకోవటానికి, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సభ్యులు పలుమార్లు సమా వేశమయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేత మొరార్జీ దేశాయ్ ఈ పదవికి గట్టి పోటీ ఇచ్చారు. కరడు గట్టిన గాంధేయవాది అయినప్పటికీ దేశాయ్‌ది నిరంకుశ తత్వం. పార్టీ అధ్యక్షుడు కామరాజ్ నాడార్కు ఇది మింగుడు పడలేదు. చాణక్య రీతితో దేశాయ్‌ని పోటీ నుండి తప్పించి, నెహ్రూ తనయ, ఇందిరా గాంధీ పేరును పార్లమెంటరీ బోర్డు నాయకురా లిగా తెరపైకి తేగలిగారు కింగ్ మేకర్ కామరాజ్. రేపో మాపో లండన్ బ్రిటిష్ హైకమిషనర్‌గా వెళ్లవలసిన అప్పటి ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ ఇందిర చేతిలోకి 1966 జనవరి 24న నాటకీయంగా దేశ ప్రధాని పగ్గాలు వెళ్లిపోయాయి. జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ మొబైల్: 98190 96949 (అనూజ్ ధర్ పుస్తకం ‘యువర్ ప్రైమ్ మినిష్టర్ ఈజ్ డెడ్’, ఆధారంగా. నేడు లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి) -
జేబులో నోటులాంటి కేసీఆర్‌ను వదులుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి వారిని కడుపులో పెట్టుకుని చూడాలన్నదే సీఎం కేసీఆర్ విధానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తాం, కూల్చేస్తామని కొందరు అంటున్నారని, జేబులో నోటు లాంటి సీఎంను వదులుకోవద్దని పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ నేత పల్లపు గోవర్దన్, హిమాయత్‌నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ చిల్లర మాటలకు పడిపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. హైదరాబాద్‌లో మౌలిక వసతులు మెరుగు పరుస్తూ నగరాన్ని పసిగుడ్డులా చూసుకుంటున్నామన్నారు. ‘వండి పెట్టుడు.. మూతి తుడుసుడు తప్ప అన్నీ ప్రభుత్వమే చేస్తుంది’అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లు హైదరాబాద్ మహా నగరంలో పేదల కోసం ఇప్పటికే లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి 70వేలు పంపిణీ చేశామని, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో లక్ష ఇళ్లు నిర్మిస్తామని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా హైదరాబాద్ మెట్రోను 400 కి.మీ మేర విస్తరిస్తామన్నారు. సినీ నటులు రజనీకాంత్, సన్నీ డియోల్, లయ తదితరులు హైదరాబాద్‌ను అమెరికా నగరాలతో పోలి్చన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్కు యునైటెడ్ ముస్లిం ఫోరం మద్దతు మైనారీ్టల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు యునైటెడ్ ముస్లిం ఫోరం ప్రకటించింది. ప్రగతిభవన్‌లో ఫోరం ప్రతినిధులు శుక్రవారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముస్లింల జీవితాల్లో గణనీయ మార్పు వచి్చందని, బడ్జెట్లో కేటాయింపులు పెంచడంతో పాటు మైనారిటీ విద్యా సంస్థల ఏర్పాటు వంటివి ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో అక్బర్ నిజాముద్దిన్, జియాఉద్దిన్ నయ్యర్, సయ్యద్ మసూద్ తదితరులున్నారు. -
నీ భర్తను చంపితే సింగరేణి ఉద్యోగం మనదే.. హాయిగా ఉండొచ్చు రమ
సాక్షి, కరీంనగర్: తన భర్తను అడ్డు తొలగిస్తే.. సింగరేణి ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరం హాయిగా ఉండొచ్చని చెప్పి ప్రియుడితో భర్తను హత్య చేయించింది ఓ మహిళ. అంతేకాదు.. తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించింది కూడా.. రంగంలోకి దిగిన పోలీసులు.. కూపీ లాగడంతో అసలు విషయం వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసుస్టేషన్ పరిధిలోని మల్యాలపల్లి సబ్‌స్టేషన్ వద్ద రాజీవ్‌రహదారిపై జరిగిన ఈ ఘటన వివరాలను రామగుండం ఏసీపీ తులా శ్రీనివాస్‌రావు బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీ సమీప పోతనకాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి లావుడ్య మధుకర్–రమ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. రమ తనకు తెలిసిన వారికి పెళ్లి సంబంధం కుదిర్చేక్రమంలో ధరావత్ గోవర్ధన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది గోవర్ధన్, రమ మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈక్రమంలో గోవర్ధన్ తరచూ రమ ఇంటికి వస్తూ పోతున్నాడు. కొన్నిసార్లు రెండుమూడ్రోజులు ఇక్కడే ఉండేవాడు. దీంతో మధుకర్‌కు తన భార్యపై అనుమానం వచ్చింది. పద్ధతి మార్చుకోవాలని ఆమెను హెచ్చరించాడు. తన వ్యవహారానికి అడ్డువస్తున్నాడనే ఆగ్రహంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి రమ కుట్ర పన్నింది. మధుకర్‌ను చంపితే సింగరేణి ఉద్యోగం కూడా వస్తుందని, ఇద్దరమూ హాయిగా ఉండొచ్చని చెప్పింది. ఇందుకు అంగీకరించిన గోవర్ధన్.. మరో ఇద్దరు మిత్రుల సాయం తీసుకుని మధుకర్ హత్యకు అక్టోబర్ 29న ప్లాన్ చేశాడు. అదేరోజు మధుకర్ మధ్యాహ్నం విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న గోవర్ధన్ తన స్నేహితులు నాగరాజు, లక్ష్మణ్‌తో కలిసి గోదావరిఖని వచ్చారు. గోవర్ధన్ తన ప్రియురాలు రమకు ఫోన్‌చేశాడు. మధుకర్‌తో మాట్లాడాలని చెప్పాడు. ఈక్రమంలో పల్సర్ బైక్‌పై ఫైవింక్లయిన్ వద్ద గల ఓ వైన్‌షాపులోకి మధుకర్ వచ్చాడు. అక్కడ అందరూ కలుసుకొని మద్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత మల్యాలపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని చెట్లపొదల్లోకి వచ్చి మద్యం తాగుతూ ఉన్నారు. గోవర్ధన్ తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడు పట్టుకుని, తన ఇద్దరు మిత్రులతో కలిసి మధుకర్‌పై దాడిచేశారు. తీవ్రగాయాలతో మధుకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని రోడ్డు పక్క ఉన్న కాలువలో పడేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు బైక్‌ను మృతదేహంపై పడేయాలని యత్నించినా.. అదుపుతప్పి పక్కకు పడింది. ఆ తర్వాత హత్య విషయాన్ని గోవర్ధన్ వాట్సాప్‌కాల్ ద్వారా రమకు తెలిపాడు. అక్కడినుంచి ముగ్గురు నిందితులు పారిపోయారు. రమ వ్యవహారశైలిపై మృతుడి తండ్రి నాన్యానాయక్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు లావుడియా(నునసవత)రమ, ధరావత్ గోవర్ధన్(నాచారం, మల్హర్ మండలం), కోట లక్ష్మణస్వామి (కొత్తపల్లి, జయశంకర్ జిల్లా), కర్నే నాగరాజు (ఖాసీంపెల్లి, జయశంకర్ జిల్లా)ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. హత్య జరిగిన 48 గంటల్లోనే రామగుండం సీఐ, ఎస్సైలు కేసును ఛేదించడంతో ఏసీపీ అభినందించారు. ఇవి చదవండి: చిన్నారిని కుదిపేసిన కాలం! -
ఆర్టీసీ ఉద్యోగులకు మరో 5శాతం డీఏ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యాన్ని (డీఏ) ప్రకటించింది. ఈసారి డీఏను 5 శాతం పెంచింది. దీనితో ప్రస్తుతమున్న 72.8 శాతం నుంచి 77.8 శాతానికి డీఏ పెరిగిందని.. సెప్టెంబర్ వేతనం నుంచే దీనిని చెల్లిస్తామని అధికారులు తెలిపారు. 2019 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏలను ఇటీవల వరుసగా ప్రక టిస్తూ రాగా.. ప్రస్తుతం 2023 జూలై డీఏ ఒక్కటి మాత్రమే పెండింగులో ఉన్నట్టయింది. ఆర్టీసీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు సంస్థ 8 డీఏలను మంజూరు చేసిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యో గులు కష్టపడి పనిచేస్తున్నారని, బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. పెండింగ్ బకాయిల ప్రస్తావన లేదు పెండింగ్ డీఏల అమలును ప్రకటిస్తూ వస్తున్న ఆర్టీసీ.. వాటికి సంబంధించిన బకాయిలు (ఇప్పటివరకు చెల్లించాల్సిన మొత్తాన్ని) మాత్రం ఇవ్వటం లేదు. కేవలం అమల్లోకి తెచ్చిన నెల నుంచే లెక్కిస్తూ చెల్లి స్తోంది. ఇలా ఇప్పటివరకు సుమారు 168 నెలల బకాయిలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓ విడత డీఏ బకాయిని ప్రకటించేలోపు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు దాని లబ్ధి కలగటం లేదని.. అలాంటి వారికి లబ్ధి కలగాలంటే బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా డీఏలను చెల్లించడాన్ని స్వాగతిస్తు న్నామని.. అయితే బకాయిల సొమ్ము కూడా అందితేనే అందరు ఉద్యోగులకు న్యాయం జరిగినట్టు అవుతుందని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్‌రావు పేర్కొన్నారు. -
నిజామాబాద్ ఎంపీగా గెలుస్తా
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను నిజామాబాద్ ఎంపీ గానే పోటీ చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎంపీగా గెలుస్తా నని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్‌తో కలిసి గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ధర్మపురి అర్వింద్ ఓ దౌర్భాగ్యుడు అని, ఆయన ఎంపీగా గెలవడంతో నిజామాబాద్ అభివృద్ధిలో ఇరవై ఏళ్లు వెనక్కి పోయిందని ధ్వజమెత్తారు. అర్వింద్ కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఐటీ హబ్ గురించి అర్వింద్ దారుణంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత పదేళ్లలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన అభివృద్ధిలో బీజేపీ భాగస్వామ్యం సున్నా అని విమర్శించారు. నిజామాబాద్ ఐటీ హబ్ తో జిల్లా దశ దిశ మారబోతోందని, ఉద్యోగాల కల్పనపై అర్వింద్ మాట్లాడినవన్నీ అబద్ధాలేనన్నారు. సీఎంకు సవాల్ విసిరే స్థాయి ఆయనకు లేదన్నారు. స్విచ్‌లో వేలు పెట్టి చూస్తే కరెంటు వస్తుందో లేదో తెలుస్తుంది తెలంగాణలో కరెంటు 24 గంటలు వస్తుందో లేదో ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ బీజేపీ కార్యాలయంలోని స్విచ్‌లో వేలుపెట్టి చూడాలని కవిత సలహా ఇచ్చారు. పార్లమెంటులో ఏం మాట్లాడుతారో సంజయ్‌కే తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని కాళేశ్వరం సహా ఏ ప్రాజెక్టుకూ కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని, మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ఉండడంతో అక్కడున్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడమే కాక, రూ.22వేల కోట్లు మంజూరు చేశారని చెప్పారు. రెండురోజుల కిందట కేంద్ర మంత్రి నిషికాంత్ దూబే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు ఇచ్చామని అబద్ధాలు మాట్లాడారని, దానికి కొనసాగింపుగా బండి సంజయ్ అదే మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వమంటే ఇవ్వలేదని గుర్తు చేశారు. తమ నాయకుడిని వ్యక్తిగతంగా దూషించిన బండి సంజయ్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాళేశ్వరంపై బీజేపీ ఎంపీ తప్పుడు ప్రచారం చేయగా, బీఆర్ఎస్ ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారని కవిత పేర్కొన్నారు. -
ఎంసెట్‌కు 91 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం జరిగిన టీఎస్ ఎంసెట్‌కు తొలి రోజు 91.31 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో భారీ స్పందన ఉంటే, ఏపీలో కాస్త తక్కువే కనిపించింది. సమస్యాత్మకంగా భావించిన వరద బాధిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనూ 96 శాతం హాజరు నమోదై నట్టు అధికారులు తెలిపారు. తొలిరోజు ఎంసెట్ విజయవంతంగా ముగిసిందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి సాంకేతిక, ఇతర సమస్యలు తలెత్తలేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి స్పష్టం చేశారు. జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డితో కలసి ఆయన నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. టీఎస్ ఎంసెట్ ఈ నెల 14 నుంచే జరగాల్సి ఉంది. అయితే వర్షాల కారణంగా 14, 15న జరగాల్సిన పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. విద్యార్థుల పోటాపోటీ.. గతంలో పోలిస్తే ఈసారి ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య పెరిగింది. అగ్రికల్చర్, మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులకు కలిపి దాదాపు 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 88, ఏపీలో 19... మొత్తం 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి రోజున రెండు రాష్ట్రాల్లోనూ 58,547 మంది పరీక్ష రాయాల్సి ఉంటే, 53,509 (91.31 శాతం) మంది హాజరయ్యారు. ఉదయం సాయంత్రం రెండు సమయాల్లో జరిగిన ఈ పరీక్షకు తెలంగాణవ్యాప్తంగా మంచి స్పందన కనిపించింది. రాష్ట్రంలో 46,570 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 44,169 (94.84 శాతం) హాజ రయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 11,977 మంది దరఖా స్తు చేసుకోగా, పరీక్షకు హాజరైంది మాత్రం 9,340 మంది (77.98 శాతం) మాత్రమే. ఇటీవలే ఏపీలో ఎంసెట్ జరగడంతో అక్కడ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదని అధికారులు విశ్లేషించారు. పరీక్షపై విద్యార్థుల సంతృప్తి ఎంసెట్ పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రితం సంవత్సరం కన్నా ప్రశ్నపత్రం తేలికగా ఉందని హైదరా బాద్‌లోని ఓ పరీక్ష కేంద్రం వద్ద ఎంసెట్ విద్యార్థిని పద్మప్రియ, నిఖిలేష్ తెలిపారు. ఆన్లైన్ మోడ్‌లో ఎలాంటి సమస్యా లేకుండా పరీక్ష రాయగలిగినట్లు వెల్లడించారు. మొత్తం ప్రశ్నల్లో కెమెస్ట్రీ తేలికగా చేసే వీలుందని, ఫిజిక్స్ కాస్త మధ్యస్తంగా ఉందని, మేథ్స్ సుదీర్ఘ ప్రశ్నలతో ఉందని గణిత శాస్త్ర నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. మొత్తం మీద విద్యార్థులు ఈ పరీక్షను తేలికగా రాయగలిగినట్లు ఆయన తెలిపారు. -
వెయిటేజీ రద్దుతో నష్టం జరగదు
సాక్షి, హైదరాబాద్: కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలతో ఎంసెట్ నిర్వహించేందుకు జేఎన్టీయూ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 4, 5, 6, 9, 10వ తేదీల్లో ప్రవేశ పరీక్ష జరగనుంది. కోవిడ్–19 వ్యాప్తి కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేయడం, సిలబస్ తగ్గింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంసెట్‌ను నిర్వహించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. పరీక్ష జరగనున్న తీరు, చేస్తున్న ఏర్పాట్లు తదితర అంశాలపై ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎ.గోవర్ధన్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఇంటర్ పరీక్షల రద్దుతో వెయిటేజీ రద్దు గతేడాది వరకు ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజీ ఉండేది. అయితే ఈసారి వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేయడంతో, వెయిటేజీని కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇలా వెయిటేజీ రద్దు చేయడం వల్ల విద్యార్థులకు ప్రత్యేకంగా ఎలాంటి నష్టం జరగదు. దీనిపై ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదు. పైగా సెకండ్ ఇయర్ పరీక్షలు లేకపోవడంతో చాలామంది వెయిటేజీ రద్దును ఆహ్వానించారు. ఎక్కువ ఆప్షన్లు ఉండవు కరోనా కారణంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో సిలబస్‌ను 70 శాతానికి కుదించారు. అందుకు అనుగుణంగానే ఎంసెట్‌లోనూ సిలబస్ తగ్గించి, ఆ ప్రకారమే ప్రశ్నలు ఇస్తున్నాం. మొదటి సంవత్సరానికి సంబంధించి 100 శాతం, రెండో ఏడాదికి 70 శాతం సిలబస్‌ను తీసుకున్నాం. ప్రశ్నలను మొదటి, రెండో ఏడాదికి సంబంధించిన సిలబస్‌ను బట్టి సాపేక్షికంగా ఇస్తాం. దీనివల్ల మొదటి ఏడాది ప్రశ్నలు సహజంగానే ఎక్కువ వస్తాయి. సిలబస్‌ను కుదించడం వల్ల జేఈఈ మాదిరిగా ఎక్కువ ఆప్షన్లను ఇవ్వడం లేదు. గతేడాది కంటే తక్కువగా సెషన్లు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్ విద్యార్థుల కోసం పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు మరొక సెషన్ ఉంటుంది. ఈసారి తక్కువ సెషన్లు పెట్టాం. గతేడాది ఇంజనీరింగ్‌కు 8 సెషన్లు పెడితే, ఈసారి 6 సెషన్లు పెడుతున్నాం. వ్యవసాయ, మెడికల్ కోర్సులకు గతేడాది నాలుగు సెషన్లు పెడితే, ఈసారి మూడు సెషన్లలోనే నిర్వహిస్తున్నాం. తెలంగాణలో 82 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 23 సెంటర్లలో పరీక్ష జరుగుతుంది. గతేడాది కంటే 27 వేల మంది ఎక్కువగా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందరూ ఇంటర్ పాస్ కావడం ఇందుకు కారణం కావొచ్చు. మాస్క్ ధరించాలి.. శానిటైజర్ తెచ్చుకోవాలి గతేడాది కంటే ఈసారి కరోనా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నాం. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. శానిటైజర్, 500 ఎంఎల్ వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు. కోవిడ్‌కు సంబంధించి ప్రతి విద్యార్థి సెల్ప్ డిక్లరేష¯Œన్ ఫారం ఇవ్వాలి. జ్వరం, జలుబు ఉందా లేదా అనేది డిక్లరేషన్‌లో స్పష్టం చేయాలి. జ్వర పరీక్ష చేస్తాం. ఒకవేళ జ్వరం, జలుబు వంటివి ఉంటే ప్రత్యేక ఏర్పాటు చేస్తాం. పరీక్ష సమయానికి కోవిడ్ నిర్ధారణ అయినవాళ్లు ముందుగా ఈ–మెయిల్ ద్వారా తెలియ జేయాలి. కరోనా పాజిటివ్ అని ఉన్న రిపోర్ట్‌ను జత చేయాలి. ఇలాంటి వారికి తర్వాత పరీక్షలు పెట్టే అవకాశముంది. ఇలా ఎవరైనా నిర్ధారించిన తేదీల్లో పరీక్షకు హాజరుకాలేకపోతే, వారు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలి. వారిని కూడా తదుపరి తేదీన జరిగే పరీక్షకు హాజరయ్యేలా అనుమతిస్తాం. మొత్తం 160 మార్కులకు పరీక్ష మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అర్హత సాధించాలంటే 40 మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అర్హత మార్కు ఉండదు. వారికి సున్నా మార్కు వచ్చినా సీటు పొందొచ్చు. పరీక్ష పేపర్ ఇంగ్లీషు–తెలుగు, ఇంగ్లీషు–ఉర్దూ, ఇంగ్లీష్లలో ఉంటుంది. అత్యధికంగా 1,96,500 మంది ఇంగ్లీషు పేపర్ ఒక్కటే ఆప్షన్‌గా ఇచ్చారు. 2018 నుంచి జేఈఈ పరీక్ష మాదిరి నార్మలైజేష¯Œన్ ప్రాసెస్ అనే పద్ధతిని పాటిస్తున్నాం. ఇది శాస్త్రీయంగా జరుగుతుంది. పేపర్‌కు స్కేలింగ్ ఉంటుంది. స్టాటిస్టికల్ ఫార్ములా ఉంటుంది. ఆ ప్రకారం మార్కులను లెక్కగట్టి ర్యాంకులను ప్రకటిస్తాం. కాబట్టి ఎవరికీ అన్యాయం జరగదు. రెండు గంటలు ముందు నుంచే అనుమతి ఈసారి హాల్ టికెట్‌తో పాటు పరీక్ష జరిగే కేంద్రం రూట్ మ్యాప్‌ను కూడా ఇస్తున్నాం. విద్యార్థులను రెండు గంటల ముందు నుంచే పరీక్షా ప్రాంగణంలోకి అనుమతిస్తాం. 1.15 గంటల ముందు హాల్లోకి అనుమతిస్తాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం. మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచ్‌లు అనుమతించరు. జర్కిన్లు వేసుకొని రాకూడదు. దరఖాస్తుకు నేడే చివరి తేదీ ఫైన్‌తో కలిపి ఎంసెట్‌కు ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఏపీ నుంచి 50 వేల మంది, ఇతర రాష్ట్రాల నుంచి 1,400 మంది ఉన్నారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలను ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏర్పాటు చేసిన 84 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు దాదాపు 79 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. తెలంగాణలోని 67 కేంద్రాల్లో 62,800 మంది, ఏపీలోని 17 కేంద్రాల్లో 16,200 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు. ఆన్లైన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరొక సెషన్ ఉంటుందని వివరించారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను గంటన్నర ముందు నుంచే అనుమతిస్తామని, వీలైనంత ముందుగా చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని పేర్కొన్నారు. సోమవారం పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులకు ఆదివారమే మెసేజ్ పంపించామని, 29వ తేదీన పరీక్షకు హాజరు కావాల్సిన వారికి సోమవారం మెసేజ్ పంపిస్తామని వెల్లడించారు. కరోనా సంబంధిత లక్షణాలు... జలుబు, జ్వరం, దగ్గు వంటివి తమకు లేవని విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. వాటిపై డాక్టర్ల సంతకం అవసరం లేదన్నారు. అలాగే విద్యార్థుల హాల్ టికెట్‌పై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి కాదన్నారు. విద్యార్థులు ఓటర్ ఐడీ, ఆ«ధార్ వంటి ఏదో ఒక ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. డిగ్రీ రెండో దశ సీట్ల కేటాయింపు వచ్చేనెల 1న డిగ్రీ రెండో దశ సీట్ల కేటాయింపును అక్టోబర్ 1వ తేదీన ప్రకటించనున్నట్లు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. రెండో దశ కౌన్సెలింగ్‌లో భాగంగా 79,928 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. మొదటి దశలో సీట్లు పొందిన 1,41,340 మందిలో 1,07,436 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారని వివరించారు. -
సెట్ కన్వీనర్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: 2020–21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సెట్ (కామన్ ఎంట్రన్స్ టెస్టు్ట)ల కన్వీనర్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 2020–21 విద్యా సంవత్సరం సెట్లు నిర్వహించే వర్సిటీలను ఇదివరకే ఖరారు చేసిన టీఎస్సీహెచ్ఈ.. కన్వీనర్ల నియామకాలకు ఆయా వర్సిటీల నుంచి ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలని సూచించింది. దీంతో ముగ్గురు చొప్పున పేర్లను టీఎస్సీహెచ్ఈకి ఇచ్చిన నేపథ్యంలో సీనియార్టీ ఆధారంగా ఉన్నత విద్యామండలి కన్వీనర్లను ఎంపిక చేసింది. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ గోవర్ధన్ నియమితులయ్యారు. -
సెల్ఫ్ డిస్మిస్ అంటూ కేసీఆర్ కొత్త పదం..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి మృతి పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ పీఆర్టీయూ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులది ఆకలి పోరాటం కాదని..ఆత్మగౌరవ పోరాటం అని పేర్కొన్నారు. అధికారం ఉందని ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామంటే సహించే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో ప్రతీ ఒక్కరూ మోసపోయారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల ను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాల విద్యని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులు తమ వంతుగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచి సమ్మెని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఇది ప్రభుత్వ హత్యే.. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డిది ప్రభుత్వ హత్యేనని న్యూ డెమోక్రసి నేత గోవర్ధన్ విమర్శించారు. 48 వేల ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీనివాసరెడ్డి బలిదానం అయ్యారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పై మంత్రులు లేకుండా అధికారుల కమిటీ వేశారని ధ్వజమెత్తారు. కార్మికులు వేతనాల కోసం కాకుండా సంస్థ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారన్నారు. పక్క రాష్ట్రం సీఎం వైఎస్ జగన్ అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే.. తెలంగాణలో ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. సెల్ఫ్ డిస్మిస్ అంటూ కేసీఆర్ కొత్త పదం కనిపెట్టారన్నారు. తనను ప్రశ్నించారనే కారణంతో కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉద్యోగ సంఘాల నేతలు మద్దతు నివ్వాలని కోరారు. టీఎన్జీవో, టీజీవో నేతలు ముఖ్యమంత్రి పెట్టిన ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రగతిభవన్‌కు గులాంగిరి చేయడానికి వెళ్ళారని విమర్శించారు. కేసీఆర్ హిట్లర్ తరహాలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీనివాసరెడ్డి పార్థివదేహన్ని చూడనివ్వకుండా కార్మిక సంఘం నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలి వెంటనే ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రిటైర్డ్ టీచర్స్, ఎంప్లాయీస్ చైర్మన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. పలు తీర్మానాలు ప్రతిపాదిస్తూ ఉద్యోగ, రిటైర్డ్ సెల్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో ఉన్న పెన్షనర్స్ అందరూ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపాలని మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీనివాస్ రెడ్డి మరణం పట్ల సంతాపం తెలిపారు. -
రెండోవాడు ఏడి?
ప్లాన్ సక్సెస్ కావాలంటే ఒకే మార్గం.ఫెయిల్యూర్ కావాలంటే వేయి మార్గాలు.2000. ఆగస్టు నెల.‘తప్పదా?’ అంది కళ్యాణి.‘తప్పదు’ అన్నాడు గోవర్ధన్.‘బియ్యం వ్యాపారమంటే రిస్క్ ఎక్కువ. పోటీ జాస్తి అని మీరే చెప్తుంటారు. ఉన్న ఉద్యోగం మానేసి ఇదేం బుద్ధండీ’...‘ఇక ఇలాగే ఉండిపొమ్మంటావా? పావుకిలో చికెను, క్వార్టర్ బాటిల్ మందు... ఇలాంటి బతుకు ఇంకా ఎంత కాలమని? మనం బాగుపడక్కర్లేదా?’‘అయితే పొలం అమ్మేస్తారన్న మాట’‘అమ్మేస్తా’‘దేవుడే ఉన్నాడు’‘దేవుణ్ణి కాదు. నన్ను నా బుర్రను నమ్ము’ఇద్దరికీ పదిహేనేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఖమ్మంలో నివాసముంటున్నారు. ఇద్దరు పిల్లలు. చదువుకుంటున్నారు. శివారులోని రైస్‌మిల్లులో అతడు నిన్నటి వరకు మేనేజర్‌గా పనిచేసేవాడు. మిల్లు ఓనర్‌తో విభేదాలు వచ్చాయి. మానేశాడు. మానేస్తూ చూపిస్తా తడాఖా అనుకున్నాడు. సొంతంగా బిజినెస్ చేసి, బాగా సంపాదించి, ఓనర్ ముందే దర్జాగా తిరగాలనేది పంతం. పంతం నెర వేర్చుకునేపనిలో పడ్డాడతడు. ఏడాది గడిచింది. ఈ ఏడాదిగా గోవర్ధన్ సరిగా ఇంటిపట్టునే ఉండటం లేదు. ఎప్పుడో వస్తాడు. ఎప్పుడో వెళతాడు. టెన్షన్‌గా ఉంటాడు. ఒక్కోసారి రాత్రుళ్లు ఇంటికి రాడు. ఉద్యోగం చేస్తున్న రోజులే బాగున్నాయిఅనిపించింది కళ్యాణికి.వ్యాపారంలో కారు కొన్నాడు.కారు ఉండి భర్త లేని రోజుల కన్నా కారు లేని భర్త ఉన్న రోజులే మేలు అని ఆమె అనుకుంది.ఆగస్టు 19, 2001.తెల్లవారు జాము.హాల్లో ల్యాండ్‌లైన్ మోగింది.రాత్రి భర్త ఇంటికి రాలేదు. ఇప్పుడు ఏదైనా చెప్పడానికి చేశాడా?నిద్ర కళ్లతో ఫోన్ ఎత్తింది కళ్యాణి.అవతలి మాట వింటూనే భూమి కదిలిపోయినట్లనిపించింది. తేరుకొని, ఉన్నఫళంగా పిల్లలను తీసుకొని బయల్దేరింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే హైవే.ఖమ్మం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఓ కారు ఆగి ఉంది. అది పూర్తిగా తగలబడిందనడానికి గుర్తు నల్లగా కాలి కనిపిస్తోంది.చేరుకుంటుంటే కళ్యాణికి గుండెదడగా అనిపించింది.కనిపిస్తున్న దృశ్యం అబద్ధమైతే బాగుణ్ణు అనుకుంది. పోలీసులు ఆమెను సమీపించారు.కారు నంబర్, వివరాలు ఆమెకు చెప్పారు. సగం కాలిన చేతి గడియారం, రెండు ఉంగరాలు ఆమె ముందుంచారు.‘ఇవి మీ భర్తవేనా’వణుకుతున్న చేతులతో వాటిని తడుముతూ ‘అవును సార్’ అంది. కారుకు ఎడమవైపున కళ్యాణిని తీసుకెళ్లారు. ఎదురుగా నేల మీద బాగా కాలిపోయి, గుర్తుపట్టడానికి వీల్లేనంతగా ఉన్న ఓ శరీరం. కారులోంచి తీసి బయట పడుకోబెట్టినట్టున్నారు పోలీసులు.ఆ దృశ్యాన్ని చూస్తూనే అక్కడే కుప్పకూలిపోయింది కళ్యాణి. పిల్లలు బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉన్నారు. కాసేపటికి తెలివి వచ్చింది కళ్యాణికి.‘చూడమ్మా! ఇలాంటప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలం. ధైర్యం తెచ్చుకొని చూడండి. శవాన్ని పోస్టుమార్టంకి తరలిస్తున్నాం’ చెప్పాడు ఎస్సై. కళ్యాణి ఏడుస్తూనే కాలిన ఆ శరీరం వైపు చూసింది.ఆమె చూపు శవం తాలూకు ఎడుమ చేయి దగ్గర ఆగిపోయింది. మణికట్టు వద్ద చర్మం కాలిపోయి, కండరం బైటకు వచ్చి ఎముక కనిపిస్తోంది. ‘సార్’ అంది కళ్యాణి ఎస్సై వైపు తిరిగి.ఏంటమ్మా’ ‘సర్. ఇతను మా ఆయన కాదు’ఉలిక్కిపడ్డాడు ఎస్.ఐ.‘మా ఆయనకు నాలుగేళ్ల క్రితం ఎడమచేతి మణికట్టు వద్ద ఎముక విరిగింది. డాక్టర్లు రాడ్ వేశారు. ఈ చేతికి ఎముక కనిపిస్తోంది. రాడ్ లేదు’ ఎస్సై భృకుటి ముడిపడింది. సిబ్బంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘స్టీల్ రాడ్...’ ఆలోచనలో పడ్డాడు ఎస్సై. పోలీసులు టోల్గేట్ వద్ద ఉన్న కెమెరాలను పరిశీలించడంలో నిమగ్నమయ్యారు. సంఘటన జరిగిన రోజున ఏయే వాహనాలు టోల్గేట్ నుంచి వెళ్లాయో కెమెరా ద్వారా పర్యవేక్షించారు. అర్ధరాత్రి 12 గంటల తెల్లవారుజాము వరకు వెళ్లిన కారు నంబర్లన్నీ నోట్ చేసుకున్నారు. తెల్లవారుజాము 2:30కు గోవర్ధన్ ఉన్న కారు క్రాస్ చేసినట్టుగా పోలీసులు కార్ నంబర్ ఆధారంగా గుర్తించారు. అయితే, అతనితో పాటు ఆ కారులో మరో వ్యక్తి కూడా ఉన్నాడు. కానీ, ప్రమాదం జరిగినప్పుడు మాత్రం కారులో ఒక్కరే ఉన్నారు. అంటే రెండో వాడు ఎవడు? అతనేమైనట్టు?కళ్యాణి నుంచి మరికొన్ని వివరాలు సేకరించారు. కారును గోవర్ధనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటాడని, డ్రైవర్ లేడని చెప్పింది. అదే నిజమైతే ఆ కారులో ఉన్నదెవరు? చనిపోయిన అతను గోవర్ధన్ కాకపోతే గోవర్ధన్ ఏమయ్యాడు? కళ్యాణి నుంచి గోవర్ధన్ ఫొటోలు తీసుకున్నారు పోలీసులు. ఇంటి మీద నిఘా ఉంచారు. బియ్యం షాప్ వద్ద, ఆ చుట్టుపక్కల షాపుల్లోనూ ఎంక్వైరీ చేశారు. గతంలో గోవర్ధన్ పనిచేసే చోటులో కూడా కూపీ లాగారు. చాలా వివరాలే తెలిశాయి.గోవర్ధన్ బియ్యం వ్యాపారం దివాళా తీసిందని, అప్పుల్లో ఉన్నాడని, ఎవరో స్త్రీతో సన్నిహితంగా ఉంటున్నాడనీ. షాప్‌లో పనిచేస్తున్న మల్లయ్య ఎస్సై వద్దకు వచ్చాడు అయ్యా, ‘మా సార్ వద్దకు బానోతు అనే అతను నెలకోసారి వచ్చి వెళ్తుంటాడు. అతను వచ్చిన ప్రతీసారి మా సార్ డబ్బులు ఇవ్వడం చూశా. పోయిన నెల సార్ డబ్బులు ఇవ్వలేనని అంటే అతను గొడవ పెట్టుకున్నాడు కూడా’ అన్నాడు.‘అతను ఎక్కడివాడో తెలుసా..’ అడిగాడు ఎస్సై‘అతను కాటవరం దగ్గర తండా అని చెప్పాడు సార్! వెంటనే పోలీసు జీపులు ఆ తండా వైపుగా కదిలాయి. నిందితుడు గోవర్ధన్ తల దించుకొని పోలీసుల ఎదురుగా నిల్చున్నాడు. విచారణలో గోవర్ధన్ ఒక్కో విషయం చెప్పడం మొదలుపెట్టాడు. ‘నేను రైస్‌మిల్లులో పని చేస్తున్నప్పుడు బిక్కూబాయి కూలీ. ఆమెతో నాలుగేళ్లుగా సంబంధం ఉంది. అది బయటపడటం వల్లే మిల్లులో గొడవపడి ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలెట్టాను. కానీ అంతకు ముందే మా సంబంధం ఆమె భర్త బానోతుకు తెలిసింది. అప్పట్నుంచి నన్ను డబ్బులివ్వమని వేధిస్తున్నాడు. అసలే కొత్త వ్యాపారం మొదలుపెట్టి అప్పులతో ఇబ్బందులు పడుతున్నా ఏదో విధంగా డబ్బులు సర్దుతున్నాను. కానీ, రోజు రోజుకు బానోతును భరించడం కష్టం అనిపించింది. మూడేళ్ల క్రితం 50 లక్షల రూపాయలకు బీమా తీసుకొని ఉన్నాను. బీమా ప్రీమియం చెల్లించే సమయంలో ఒక ఆలోచన వచ్చింది. చనిపోతేనే ఆ బీమా డబ్బు కుటుంబానికి అందుతుంది.చనిపోకుండానే చనిపోయాననే నాటకం ఆడితే డబ్బులు వస్తాయి. అప్పుల బారినుంచి బయటపడచ్చు అనుకున్నాను. అప్పులు తీర్చే మార్గం, బిక్కూబాయి భర్తను వదిలించుకునే మార్గం ఒకటే అనిపించింది.ప్రమాదంలో చనిపోతేనే బీమా డబ్బులు వస్తాయి. అందుకని కారు ప్రమాదం జరిగేలా చూడాలి అనుకున్నాను. డబ్బులిస్తానని చెప్పి ఆ రోజు రాత్రి బానోతును ఖమ్మం రమ్మన్నాను. ఇద్దరం కలిసి రాత్రి వరకు అక్కడే బాగా తాగాం. బానోతుకు ఇంకా ఎక్కువ తాగించాను. ఇద్దరం కారులో హైదరాబాద్ వైపు బయల్దేరాం. బానోతు నా పక్కనే ముందు సీటులో కూర్చొని నిద్రపోతున్నాడు. టోల్ గేట్ దాటి 50 కిలోమీటర్ల దూరం వచ్చేశాం. రోడ్డుకు ఎడమవైపున కారు ఆపి, బానోతుకు నా ఒంటిమీది వస్తువులు, బట్టలు తగిలించాను. అతని బట్టలు నేను వేసుకున్నాను. డ్రైవింగ్ సీట్లో అతడిని కూర్చోబెట్టి, నా ఫోన్ కూడా అతని జేబులో ఉంచి కారు డిక్కీలో ముందే ఉంచిన పెట్రోల్ తీసి లోపల, బయట అంతా పోసేశాను. కారు అద్దాలు మూసేసి, లైటర్ని వెలిగించి కారుమీద వేశాను. ఖాళీ పెట్రోల్ క్యాన్ తీసుకొని ఓ చెట్టు చాటుకు వెళ్లి కారు పూర్తిగా తగలబడేవరకు ఉండి, వెళ్లిపోయాను. వారం రోజులు గడిచిపోయాయి. ఎవరికీ అనుమానం రాలేదని, ఇంకొన్ని రోజులకు ఇంటికి వెళ్లచ్చులే అనుకొని ముందుగా బిక్కుబాయి ఇంటికి వెళ్లాను’ అసలు విషయం చెప్పాడు గోవర్ధన్.బిక్కుబాయి ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ గోవర్ధన్‌ని పట్టుకొని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చారు. ప్లాన్ సక్సెస్ అవడానికి ఒకటే మార్గం.ఫెయిల్ అవడానికి వేయి. – నిర్మలారెడ్డి -
విలేకరి గోవర్ధన్ ఆకస్మిక మృతి
అనంతపురం రూరల్: విలేకరి గోవర్ధన్ (41) ఆకస్మికంగా మృతి చెందారు. రామగిరికి చెందిన ఈయన అనంతపురంలో ఆంధ్రభూమి విలేకరిగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో అనంతపురం ప్రెస్‌క్లబ్‌లోని గదిలో మంచంపై కూర్చుని పేపర్ చదువుతున్న ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు వచ్చిన తోటి జర్నలిస్టులు ఏమిలా పడిపోయాడని లేపడానికి ప్రయత్నించగా ఉలుకూపలుకూ లేకపోయింది. వెంటనే 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగా.. అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలియగానే రామగిరి నుంచి కుటుంబ సభ్యులు హుటాహుటిన బయల్దేరి ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని బోరున విలపించారు. సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతల నివాళి ప్రెస్‌క్లబ్‌లో హఠాన్మరణం చెందిన విలేకరి గోవర్ధన్ మృతదేహాన్ని వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడి, నాయకులు వై.వి.శివారెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డిలు సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వై.వి.శివారెడ్డి విలేకరి కుటుంబానికి ఆర్థికసహాయం అందించారు. ఎస్పీ అశోక్‌కుమార్, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డిలు విలేకరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్రీటౌన్ సీఐ మురళీ, ఎస్ఐ జైపాల్‌రెడ్డిలు మృతి చెందిన పాత్రికేయుని వివరాలు సేకరించారు. -
వెండితెరపై విశాఖ కెరటం
సీతమ్మధార : ఆ యువకుడికి సినిమా అంటే పిచ్చి. వెండితెరపై కనిపించాలని, స్క్రీన్‌పై తనను తాను చూసుకుని మురిసిపోవాలని కలలు కన్నాడు. కళ్లు మూసినా..కళ్లు తెరిచినా లక్ష్యం వెంటబడుతూనే ఉండేది. కట్ చేస్తే అనుకున్నది సాధించాడు. ఎంకా పైకి ఎదగాలని శ్రమిస్తున్నాడు. విశాఖ సీతమ్మధారకు చెందిన గోవర్ధనరెడ్డి ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్‌లో సత్తా చాటుతున్నాడు. సినీ పరిశ్రమలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఎంతో మంది నటులు హీరోలుగా ఎదిగారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని గోవర్ధన్ అడుగులు వేస్తున్నారు. ఓ వైపు సెక్యూరిటీ సర్వీసెస్‌లో ఉద్యోగం చేస్తూ తనకిష్టమైన నటనా రంగంలో రాణిస్తున్నారు. పలు సినిమాల్లో హీరోకు స్నేహితుడిగా, పోలీస్ అధికారిగా, ప్రేమికుడిగా, విలన్‌గా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషిస్తున్నాడు. చిన్నతనంలోనే కరాటే నేర్చుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతభి కనబరిచారు. బ్లాక్‌బెల్ట్ సాధించారు. ఇంతవరకూ నటించిన సినిమాలు ఇప్పటి వరకు‘‘ లవ్ చేయాల వద్దా’లో పోలీస్ ఆఫీసర్‌గా చేశాడు, ‘నేత్ర’లో విలన్ పాత్ర దామోదర్గా నటించాడు, ‘అసలేమయింది’’లో హీరోయిన్ను అల్లరి పెట్టే పాత్ర పోషిస్తున్నాడు. 12 షార్టు ఫిల్మ్‌ల్లో నటించాడు. ఎం.ఆర్. ప్రొడక్షన్లో ‘బ్రదర్స్’ షార్ట్ ఫిల్మ్‌కు విశేష ఆదరణ వచ్చిందని గోవర్ధన రెడ్డి తెలిపారు. -
చర్లపల్లి జైలు నుంచి ఖైదీ పరారీ
హైదరాబాద్: చర్లపల్లి ఓపెన్ జైలు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. ఆ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయం జైలు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జైలులోని ఖైదీల సంఖ్య 104 కి బదులు 103 మందే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఆ వెంటనే రంగంలోకి దిగిన జైలు ఉన్నతాధికారులు పరారైన ఖైదీని గుర్తించారు. మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మంచాపూర్ గ్రామానికి చెందిన గోవర్దన్గా పోలీసులు గుర్తించారు. అతడి కోసం జైలు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ అంశాన్ని జైలు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పరారైన గోవర్దన్ చర్లపల్లి జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడని సమాచారం. -
సంపులో పడి చిన్నారి మృతి
గుంతకల్లు రూరల్ (అనంతపురం): నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం డోనెముక్కల రోడ్డులోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న చర్చి దగ్గరకు వెళ్లిన గోవర్ధన్ (2) అక్కడ నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసిన సంపులో పడి మృతి చెందాడు. -
తెల్లారిన బతుకులు
జహీరాబాద్ : తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారాయి. పీర్ల పండుగకు హాజరయ్యేందుకు ముంబై నుంచి వరంగల్‌కు వస్తుండగా.. మృత్యువు కంటెయినర్ రూపంలో ముగ్గురిని బలిగొంది. మృతుల్లో ఇద్దరు మంబై వాసులు కాగా మరో వ్యక్తి వరంగ ల్ జిల్లా వాసి. ఈ సంఘటన మండలంలోని బూచనెల్లి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. చిరాగ్పల్లి ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం మేరకు.. వరంగల్ జిల్లా రేగొండ మండలం గోడికొత్తపల్లి గ్రామానికి చెందిన గోవర్ధన్ (26) ముంబైలోని ఓ ప్రాంతంలో కల్లు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన హసన్అలీ (48), అన్వర్ అన్సారి (43)లు మిత్రులు కాగా ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చే సేవారు. కాగా వీరికి గోవర్ధన్ తో పరిచయం ఏర్పడింది. అయితే గోవర్దన్ తన సొంత గ్రామంలో జరిగే పీర్ల పండుగకు హసన్, అన్సారీలను ఆహ్వానించాడు. దీంతో ముగ్గురూ కలిసి మంగళవారం రాత్రి పొద్దుపోయాక వరంగల్ జిల్లా రేగొండ మండలం గోడికొత్తపల్లికి కారులో బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు జహీరాబాద్ సమీపంలోని బూచనెల్లి గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న కంటెయినర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారును డ్రైవ్ చేస్తున్న హసన్అలీ, పక్కనే కూర్చొన్న వరంగల్‌కు చెందిన గోవర్ధన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చొన్న అన్వర్ అన్సారి తీవ్రంగా గాయపడి జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న జహీరాబాద్ సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్, చిరాగ్పల్లి ఎస్ఐ విజయకుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీయించారు. అయితే సంఘటనా స్థలంలో లభించిన రూ.3 లక్షలను పోలీసులు భద్రపర్చారు. ప్రమాద స్థలంలో లభించిన ఫోన్ నంబర్ల ఆధారంగా బాధిత కుటుంబాలకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. -
సెల్‌టవర్ ఎక్కి హల్చల్
ఇబ్రహీంపట్నం రూరల్: పింఛన్లు పెంచాలని ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వీహెచ్పీఎస్ నాయకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. అదే సమయంలో మంత్రి మహేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఇబ్రహీపట్నం పర్యటన ఉండడంతో పోలీ సులు ఉరుకులు పరుగులు పెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వృద్ధాప్య, వికలాంగుల, వితంతు పింఛన్లు పెంచాలంటూ ఐదు రోజులుగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వీహెచ్పీఎస్ హయత్‌నగర్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. మంత్రి, ఎంపీల పర్యటన నేపథ్యంలో పోలీసులు హైరానా పడ్డారు. ఎంత నచ్చజెప్పినా దిగేందుకు గోవర్ధన్ ససేమిరా అన్నాడు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ నర్సయ్యగౌడ్ వచ్చి హామీ ఇస్తేనే దిగుతానని పట్టుబట్టాడు. దీంతో నాలుగు గంటల పాటు ఉద్రిక్తవాతావరణం నెలకొంది. చివరికి పర్యటన ముగించుకుని మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ నర్సయ్యగౌడ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. వీహెచ్పీఎస్ నాయకులు అందె రాంబాబు, కాళ్ల జంగయ్య తదితరులు వారి కాన్వాయ్కి అడ్డు తగిలారు. పింఛన్ల పెంపుపై స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్లపై స్పష్టత ఇచ్చారని, దీనిపై ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇవ్వడంతో గోవర్ధన్ టవర్ నుంచి కిందికి దిగివచ్చాడు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
సైనికుడి నుంచి క్రిమినల్‌గా..
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: తండ్రి ఆయశం మేరకు ఆయన సైనికుడిగా దేశరక్షణలో పాలుపంచుకున్నాడు.. కానీ డబ్బుపై ఆశ.. జల్సాపై మోజు.. దురలవాట్లకు బానిసై నేర మార్గాన్ని ఎంచుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. స్థానిక బొమ్మలసత్రంలోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రం నుంచి రూ. 1.40 కోట్లు కాజేసిన గోవర్దన్ నేరచరిత్ర ఇది. చిత్తూరు జిల్లా పాకాల మండలం పాలగుట్టుపల్లె గ్రామానికి చెందిన రెడ్డెప్ప సీఆర్పీఎఫ్లో హెడ్‌కానిస్టేబుల్‌గా రక్షణ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లోని పని చేస్తున్నారు. ఆయన కుటుంబం హైదరాబాద్‌లోని చాంద్రాయన్ గుట్టలో ఉన్న క్వార్టర్స్‌లో నివాసం ఉండేది. తనలాగే కొడుకు గోవర్దన్ కూడా దేశానికి సేవ చేయాలనేది రెడ్డెప్ప ఆశయం. దీంతో సీబీఎస్ఈ సిలబస్‌లో ఫ్లస్‌టూ చదివిన గోవర్దన్‌ను భారత సైన్యంలో చేర్పించాడు. గోవర్దన్ ఢిల్లీ, ఆగ్రా, రాజస్థాన్‌లో అల్వార్లలో పారాటూపర్ హాదాలో పని చేశారు. కాని గోవర్దన్ సైనికుడిగా ఉంటూనే చిల్లర దొంగతనాలకు పాల్పడ్డాడు. ఉద్యోగం వదిలేసి ఘరాన క్రిమినల్‌గా మారాడు. జల్సాలు, దురలవాట్లే కారణం: గోవర్దన్‌కు చెడు అలవాట్లు ఎక్కువ. అల్వార్‌కు రైలులో సైనికుడి దుస్తుల్లో వెళ్తూ నిద్రపోతున్న మహిళల ఆభరణాలు, నగదును కాజేసేవాడు. 2011లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చిల్లర దొంగతనాలకు పాల్పడుతూ బాలానగర్ సీసీఎస్ పోలీసులకు దొరికాడు. తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి నేరస్తుడిగా మారాడు. ఈ సేవా కేంద్రాల ద్వారా ఇతరుల ఓటరు కార్డులను సేకరించి, వాటిని ఫొటోషాప్‌లో మార్పింగ్ చేసి అతని ఫొటో ఉన్నట్లు నకిలీ కార్డులను తయారు చేశాడు. వీటి ఆధారంగా పలు బ్యాంక్‌ల్లో ఖాతాలను తెరిచి, ఏటీఎంలను సంపాదించాడు. వాటి ద్వారా ఇతరుల ఖాతాల్లో నుంచి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసే విధానం ద్వారా రూ.11లక్షలను డ్రా చేశాడు. కాని ఈ కేసులో హైదరాబాద్ టాస్క్ఫోర్ పోలీసులకు చిక్కడంతో, పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. జైలు జీవితం అనుభవించి, పరివర్తన చెందకపోగా విజయవాడకు చెందిన నేరస్తుడు సుధాకర్ ద్వారా ఏటీఎంలలో ఇతరులు డబ్బు డ్రా చేసే విధానాన్ని కనిపెట్టాడు. తర్వాత రెండు నెలల క్రితం బొమ్మలసత్రంలోని ఎస్బీఐ ఏటీఎం దగ్గర డబ్బు డ్రా చేయడానికి యత్నించి, క్యాన్సిల్ బటన్ నొక్కాడు. బ్యాంక్ లావాదేవీలు నిలిచి పోలేదు. గోవర్దన్‌కు డబ్బు రాగా, అతని ఖాతాలో నుంచి డబ్బు క్రెడిట్ కాలేదు. దీంతో రోజూ ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేవాడు. తన వద్ద ఉన్న 31 ఏటీఎం, క్రెడిట్ కార్డులతో ఏప్రిల్ 14 నుంచి మే 3వరకు నంద్యాలలోనే మకాం వేసి రోజూ కొంత మొత్తంగా దాదాపు రూ.1.40 కోట్లను డ్రా చేశాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా నల్ల అద్దాలు, టోపీని ధరించేవాడు. కాని డబ్బును పోగొట్టుకున్న ఖాతాదారులకు ఎస్బీఐ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 20 త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలా చిక్కాడు: సీసీ కెమెరాల్లో ఉన్న దృశ్యాల ఆధారంగా పోలీసులు అతికష్టం మీద గోవర్ధన్‌ను గుర్తించి ఏటీఎం సెంటర్‌వద్ద మాటు వేశారు. కడపలో ఓ యువతిలో కలిసి కారులో నంద్యాలకు వచ్చిన గోవర్దన్ ఏటీఎం కేంద్రం వద్ద మళ్లీ డబ్బు డ్రా చేయడానికి యత్నించాడు. పోలీసులు వెంటపడటంతో కర్నూలు మీదుగా బెంగుళూరు హైవేలో వెళ్తూ గుంతకళ్ పోలీసులకు చిక్కాడు. వీరి నుంచి నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుండి రూ.73లక్షల విలువైన నగదు, బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, కారును స్వాధీనం చేసుకున్నారు. -
ఆక్రమణలపై కొరడా ఝుళిపించిన అధికారులు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ‘కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల కబ్జా’ శీర్షికతో గత నెలలో ‘సాక్షి’లో వెలువడిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆక్రమణకు గురైన భూముల స్వాధీనానికి రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. ఆక్రమణకు గురైన భూమిలోని షెడ్డును, ఫెన్సింగ్ వైర్, సరిహద్దు రాళ్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ మేరకు తహశీల్దార్ గోవర్దన్, పట్టణ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో జేసీబీతో శిఖం భూముల్లో నిర్మించిన షెడ్డును శనివారం తొలగించారు. అనంతరం తహశీల్దా గోవర్దన్ మాట్లాడుతూ సర్వే నంబరు 350 బొబ్బిలికుంట శిఖం భూమిలో ఆక్రమణకు గురైన భాగంలో సర్వే చేపట్టగా ఆక్రమించుకున్నది వాస్తవమేనని నిర్ధార ణ అయిందన్నారు. 15 రోజుల క్రితమే శిఖం భూమి పరిరక్షణ కోసం రూ. 40 లక్షల వ్యయంతో ప్రహరీ నిర్మాణం కోసం ఆర్డీఓ ద్వారా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు. తాము సర్వే చేసిన తర్వాత ఆక్రమణకు పాల్పడిన వ్యక్తులు నిర్మాణ పనులు చేపట్టడం వల్లనే కూల్చివేతలు చేపట్టామని తహశీల్దార్ తెలిపా రు. శిఖం భూమి పరిరక్షణ కోసం ప్రహరీ నిర్మించేందుకు నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. ఇకమీదట శిఖం భూమిని ఆక్రమిస్తే రెవెన్యూ యాక్టు ప్రకారం కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ గోవర్దన్ హెచ్చరించారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తారా..? తన పట్టా భూమిలోని షెడ్డును రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేశారని, ఇది సరికాదని భూ యజమానురాలు ఇంతియాజ్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబరు 350లో కొంతభాగం క్రిస్టియన్లు, వ్మశాన వాటికకు, మరికొంత భాగాన్ని ఎస్సీల శ్మశానవాటిక కోసం ఆక్రమించుకున్నారని జూలై 1న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నిర్వహించిన సర్వేలో తేలిందని, ఆ నివేదిక ఆధారంగా శిఖం భూమిలో నిర్మించిన 42 ఇళ్లను ఎందుకు కూల్చివేయలేదని ఆమె ప్రశ్నించారు. అధికారులు పక్షపాత వైఖరితో కూల్చివేతలు చేపట్టారని, కూల్చివేసే ముందు నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. -
'హైదరాబాద్‌పై ఆంక్షలు పెడితే అంతర్యుద్ధం తప్పదు'
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నగరంపైన చిక్కుముడి పెడితే సహించేది లేదని నగర కాంగ్రెస్ నేత, ఖాదీ బోర్డు ఛైర్మన్ నిరంజన్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... హైదరాబాద్‌పై ఆంక్షలు పెడితే అంతర్యుద్ధం తప్పదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌ను కేంద్రం పాలిత ప్రాంత చేయడమన్నా, గవర్నర్ పరిధిలోకి తీసుకురావడమన్నా నగర వాసుల హక్కులు కాలరాయడమేనని నిరంజన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీ తరహాలో చేయాలని సీమాంధ్రకు చెందని కేంద్ర మంత్రుల బృందం శనివారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో గోవర్థన్ పైవిధంగా స్పందించారు.