కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన మహాలక్ష్మి. చిత్రంలో గోవర్ధన్, దానం తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి వారిని కడుపులో పెట్టుకుని చూడాలన్నదే సీఎం కేసీఆర్ విధానమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తాం, కూల్చేస్తామని కొందరు అంటున్నారని, జేబులో నోటు లాంటి సీఎంను వదులుకోవద్దని పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ నేత పల్లపు గోవర్దన్, హిమాయత్‌నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ చిల్లర మాటలకు పడిపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. హైదరాబాద్‌లో మౌలిక వసతులు మెరుగు పరుస్తూ నగరాన్ని పసిగుడ్డులా చూసుకుంటున్నామన్నారు. ‘వండి పెట్టుడు.. మూతి తుడుసుడు తప్ప అన్నీ ప్రభుత్వమే చేస్తుంది’అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లు
హైదరాబాద్ మహా నగరంలో పేదల కోసం ఇప్పటికే లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి 70వేలు పంపిణీ చేశామని, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో లక్ష ఇళ్లు నిర్మిస్తామని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా హైదరాబాద్ మెట్రోను 400 కి.మీ మేర విస్తరిస్తామన్నారు. సినీ నటులు రజనీకాంత్, సన్నీ డియోల్, లయ తదితరులు హైదరాబాద్‌ను అమెరికా నగరాలతో పోలి్చన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌కు యునైటెడ్ ముస్లిం ఫోరం మద్దతు
మైనారీ్టల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు యునైటెడ్ ముస్లిం ఫోరం ప్రకటించింది. ప్రగతిభవన్‌లో ఫోరం ప్రతినిధులు శుక్రవారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముస్లింల జీవితాల్లో గణనీయ మార్పు వచి్చందని, బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడంతో పాటు మైనారిటీ విద్యా సంస్థల ఏర్పాటు వంటివి ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో అక్బర్ నిజాముద్దిన్, జియాఉద్దిన్ నయ్యర్, సయ్యద్ మసూద్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment