రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నగరంపైన చిక్కుముడి పెడితే సహించేది లేదని నగర కాంగ్రెస్ నేత, ఖాదీ బోర్డు ఛైర్మన్ నిరంజన్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... హైదరాబాద్పై ఆంక్షలు పెడితే అంతర్యుద్ధం తప్పదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
హైదరాబాద్ను కేంద్రం పాలిత ప్రాంత చేయడమన్నా, గవర్నర్ పరిధిలోకి తీసుకురావడమన్నా నగర వాసుల హక్కులు కాలరాయడమేనని నిరంజన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీ తరహాలో చేయాలని సీమాంధ్రకు చెందని కేంద్ర మంత్రుల బృందం శనివారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో గోవర్థన్ పైవిధంగా స్పందించారు.