నా భార్యను వార్డర్ వేధిస్తున్నాడు: ఖైదీ ఫిర్యాదు | inmate case file against jail warder in kushaiguda police station | Sakshi
Sakshi News home page

నా భార్యను వార్డర్ వేధిస్తున్నాడు: ఖైదీ ఫిర్యాదు

Published Tue, Oct 28 2014 9:12 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

నా భార్యను వార్డర్ వేధిస్తున్నాడు: ఖైదీ ఫిర్యాదు - Sakshi

నా భార్యను వార్డర్ వేధిస్తున్నాడు: ఖైదీ ఫిర్యాదు

హైదరాబాద్: చర్లపల్లి జైలు వార్డర్ తన భార్యకు తరచుగా ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ ఓ ఖైదీ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... రాములు అనే ఖైదీ చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని చూసేందుకు అతడి భార్య తరచుగా జైలుకు వచ్చేది. ఆ క్రమంలో జైలు వార్డర్ వెంకన్న ఆమె నుంచి సెల్ ఫోన్ నెంబరు తీసుకున్నాడు. అప్పటి నుంచి తరచుగా ఖైదీ రాములు భార్యకు ఫోన్ చేసి వేధించేవాడు.

ఆ విషయాన్ని భర్త రాములకు తెలిపింది. దీంతో రాములు జైలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించ లేదు. దీంతో వార్డర్ వెంకన్న... రాముల భార్యపై వేధింపులు మరింత పెరిగాయి.  ఆ విషయాన్ని రాములకు వెల్లడించింది. దీంతో రాములు కూషాయిగూడ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement