Jail warder
-
జైల్లో సెల్‌ఫోన్ కలకలం: వార్డెన్ సస్పెండ్
అనంతపురం : అనంతపురం జిల్లా జైలులో సెల్‌ఫోన్ కలకలం రేపింది. జైలులోని ఖైదీలు... సిబ్బంది సహకారంతో సెల్ ఫోనులు వాడుతున్నారన్న సమాచారం జైలు సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డికి చేరింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు. జైల్ వార్డెర్ హరినాథ్ సాయంతో ఖైదీలు సెల్‌ఫోన్ వినియోగిస్తున్నట్లు సదరు విచారణలో అధికారులు గుర్తించారు. దీంతో వార్డెర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తు జైలు సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జైలులో విచారణలో ఉన్న ఓ దొంగతో ఇద్దరు పత్రికా ప్రతినిధులు సెల్ ఫోనులో మాట్లాడినట్లు ఈ విచారణలో బహిర్గతమైంది. -
నా భార్యను వార్డర్ వేధిస్తున్నాడు: ఖైదీ ఫిర్యాదు
హైదరాబాద్: చర్లపల్లి జైలు వార్డర్ తన భార్యకు తరచుగా ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ ఓ ఖైదీ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... రాములు అనే ఖైదీ చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని చూసేందుకు అతడి భార్య తరచుగా జైలుకు వచ్చేది. ఆ క్రమంలో జైలు వార్డర్ వెంకన్న ఆమె నుంచి సెల్ ఫోన్ నెంబరు తీసుకున్నాడు. అప్పటి నుంచి తరచుగా ఖైదీ రాములు భార్యకు ఫోన్ చేసి వేధించేవాడు. ఆ విషయాన్ని భర్త రాములకు తెలిపింది. దీంతో రాములు జైలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించ లేదు. దీంతో వార్డర్ వెంకన్న... రాముల భార్యపై వేధింపులు మరింత పెరిగాయి. ఆ విషయాన్ని రాములకు వెల్లడించింది. దీంతో రాములు కూషాయిగూడ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చర్లపల్లి జైలులో వార్డర్ పై విరుచుకుపడిన ఖైదీ
హైదరాబాద్, సాక్షి: విధి నిర్వహణలో ఉన్న జైలు వార్డర్‌పై మానసిక స్థితి సరిగ్గాలేని జీవిత ఖైదీ దాడికి పాల్పడి, ఆయునను గాయుపరిచాడు. హైదరాబాద్ నగర శివార్లలోని చర్లపల్లి సెంట్రల్ జైలులో సోమవారం ఈ సంఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం, దమ్మాయిగూడకు చెందిన జి.సాయి కుమార్(28) 2009నుంచి జైలులో జీవిత ఖైదీగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో,.. కొత్తగా వార్డర్‌గా నియమితుడైన షేక్ దర్గా(24) జైలులో విధి నిర్వహణలో ఉండగా, దాడిచేసిన సాయి కుమార్, భోజనం ప్లేటే ఆయుుధంగా, వార్డర్‌మెడను కోసేందుకు ప్రయుత్నించాడు, దాడినుంచి తప్పించుకోవడానికి షేక్ దర్గా ప్రయుత్నించినా, ఆయునకు నుదుటిపై, వీపుపై గాయూలయ్యూరుు. భోజనం చేసే సత్తు ప్లేటు ముక్కను కత్తిగా మార్చి సాయికుమార్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. సాయికుమార్‌కు మతిస్థిమితం సరిగ్గాలేకపోవడమే దాడికి కారణమని ఈ మేరకు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశామని జైలు అధికారులు తెలిపారు. గాయుపడిన వార్డర్ను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.