చర్లపల్లి జైలులో వార్డర్ పై విరుచుకుపడిన ఖైదీ | Prisoner attacks Cherlapally warder | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైలులో వార్డర్ పై విరుచుకుపడిన ఖైదీ

Published Wed, Sep 11 2013 1:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

Prisoner attacks Cherlapally warder

హైదరాబాద్, సాక్షి: విధి నిర్వహణలో ఉన్న జైలు వార్డర్‌పై మానసిక స్థితి సరిగ్గాలేని జీవిత ఖైదీ దాడికి పాల్పడి, ఆయునను గాయుపరిచాడు. హైదరాబాద్ నగర శివార్లలోని చర్లపల్లి సెంట్రల్ జైలులో సోమవారం ఈ సంఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం, దమ్మాయిగూడకు చెందిన  జి.సాయి కుమార్(28)  2009నుంచి జైలులో జీవిత ఖైదీగా ఉంటున్నాడు.
 
 ఈ నేపథ్యంలో,.. కొత్తగా వార్డర్‌గా నియమితుడైన షేక్ దర్గా(24) జైలులో విధి నిర్వహణలో ఉండగా, దాడిచేసిన సాయి కుమార్, భోజనం ప్లేటే ఆయుుధంగా, వార్డర్‌మెడను కోసేందుకు ప్రయుత్నించాడు, దాడినుంచి తప్పించుకోవడానికి షేక్ దర్గా ప్రయుత్నించినా, ఆయునకు నుదుటిపై, వీపుపై గాయూలయ్యూరుు. భోజనం చేసే సత్తు ప్లేటు ముక్కను కత్తిగా మార్చి సాయికుమార్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. సాయికుమార్‌కు మతిస్థిమితం సరిగ్గాలేకపోవడమే దాడికి కారణమని ఈ మేరకు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశామని జైలు అధికారులు తెలిపారు. గాయుపడిన వార్డర్‌ను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement