కొన్ని సంఘటనలను చూస్తే మనుషులకు సహనం తక్కువవుతుందని చెప్పలా? లేదా కోపానికి బానిసైపోతున్నారని అనాలో కూడా తెలియదు. పోనీ మనకు నచ్చకపోతే కాస్త గట్టిగా చెప్పడం లాంటివి చేయోచ్చు లేదా ఒకవేళ కాస్త కోపం వస్తే తిట్టి వదిలేయాలిగానీ మరీ వాళ్లని కొట్టి హింసచడం వంటివి చేయకూడదు. కానీ, ఇటీవల అబ్బాయిలు/అమ్మాయిలు కూడా సిల్లీ సిల్లీ కారణాలకే కోపం తెచ్చుకోవడం, దాడులకు దిగడం వంటివి చేస్తున్నారు. న్యూయర్క్ నగర్‌లో ఇద్దరు వ్యక్తులు ఆర్డర్ ఆలస్యమైందని దారుణంగా ప్రవర్తించారు.
(చదవండి: భయంకరమైన భారీ పీత!.. గోల్ఫ్ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!)
అసలు విషయంలోకెళ్లితే.. న్యూయార్క్ నగరంలో న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్‌లోని బర్గర్ కింగ్స్ లిండెన్ బౌలేవార్డ్‌లో ఇద్దరు వ్యక్తుల బర్గర్లు ఆర్డర్ చేశారు. అయితే ఆర్డర్ కాస్త ఆలస్యమైంది. అంతే ఇద్దరు కోపంతో ఆర్డర్ కౌంటర్ వద్దకు వచ్చారు. వారిలో ఒక వ్యక్తి కౌంటర్‌లోకి దూసుకువచ్చి అక్కడ ఉన్న సదరు ఉద్యోగిపై దాడి చేశాడు. సదరు వ్యక్తి సహచరుడు సైతం ఆ ఉద్యోగిని దారుణంగా కొట్టాడు. అయితే ఇంతలో సహచర ఉద్యోగులు జోక్యం చేసుకోవడంతో ఆ భాదితుడు సురక్షితంగా బయటపడ్డాడు.
ఈ మేరకు ఆ ఉద్యోగిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డైయ్యింది. దీంతో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీఫుటేజ్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేయడమే కాక ఆ నిందుతులు ఆచూకి తెలిసినవాళ్లు ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే ఆ సీసీఫుటేజ్‌లో నిందితులు ముసుగు ధరించి ఉండటం కారణంగా గుర్తుపట్టడం కష్టమవ్వడంతో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ విధంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
(చదవండి: 40 రోజుల్లో 700 మైళ్లు.. ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!)
🚨WANTED for ASSAULT: Do you know these guys? On 12/4/21 at approx 6:14 PM, inside of 1661 Linden Blvd in Brooklyn, the suspects engaged in a dispute with a 22-year-old male, then punched him multiple times while displaying a knife. Any info? DM @NYPDTips or call 800-577-TIPS. pic.twitter.com/Y843eiAWkU
— NYPD NEWS (@NYPDnews) January 4, 2022
Comments
Please login to add a commentAdd a comment